మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా, షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై డా.ఎం.వి.కె.రెడ్డి తో కలిసి నిర్మించిన చిత్రం ''లేడీస్ అండ్ జెంటిల్ మెన్". ఈ చిత్రం ద్వారా పి.బి.మంజునాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్ 4 వ తేదీన మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో ఘన విజయం సాధించి, శ్రోతలను ఆకట్టుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ స్థానిక ప్రసాద్ లాబ్స్ లో ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకుంది.
ఈ సందర్భం గా నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ"ఈ చిత్రానికి రఘు కుంచె, సిరాశ్రీ సాహిత్యం అందించారు. ఈ చిత్రం పాటలను ఇంటర్నెట్ లో విన్న పది లక్షల శ్రోతలకు న కృతజ్ఞతలు. సమాజంపై సైబర్ నేరాల ప్రభావం కధాంశంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, జనవరి 30 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది" అని చెప్పారు.
ఈ వేడుకకు అతిధిగా విచ్చేసిన కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ"రొటీన్ వాటికి భిన్నంగా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.
దర్శకుడు పి.బి.మంజునాథ్ మాట్లాడుతూ"ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కథలను ఒక చిత్రం గా తెరకెక్కించాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించాం." అని చెప్పారు.
సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ"ఎవరు తీయని విధంగా ఒక భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతుంది. ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
పి.ఎల్.క్రియేషన్స్ అధినేత లోహిత్ మాట్లాడుతూ"ఒక అధ్ముతమైన సినిమాలో నేను ఒక పార్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది" అని అన్నారు.
ఈ చిత్రంలో నటీనటులు: చైతన్య కృష్ణ, మహత్ రాఘవేంద్ర, అడవి శేష్, కమల్ కామరాజ్, స్వాతి దీక్షిత్, నికితా నారాయణ్, జాస్మిన్ భాసిన్.
ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, సాహిత్యం: సిరాశ్రీ, మాటలు: నివాస్, సినిమాటోగ్రఫీ: జగన్ చావలి, కథ: సంజీవ్ రెడ్డి, ఎడిటింగ్: నవీన్ నూలి.