Advertisement
Google Ads BL

‘పడ్డానండి ప్రేమలో మరి’ ఆడియో రిలీజ్‌


వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు జంటగా నల్లపాటి వంశీమోహన్‌ సమర్పణలో పాంచజన్య మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వంలో నల్లపాటి రామచంద్రప్రసాద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని ఆక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. అల్లరి నరేష్‌ ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుకు అందించారు. ఎ.ఆర్‌. ఖుద్దూస్‌ సంగీతం అందించిన ఈ ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, శివబాలాజీతోపాటు హీరో వరుణ్‌ సందేశ్‌, హీరోయిన్‌ వితిక షేరు, విలన్‌ అరవింద్‌, సంగీత దర్శకుడు ఖుద్దూస్‌ ఎ.ఆర్‌., దర్శకుడు మహేష్‌ ఉప్పుటూరి, నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

అల్లరి నరేష్‌:  వరుణ్‌ ఇప్పటివరకు చేసిన సినిమాలతో లవర్‌బోయ్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో యాక్షన్‌ కూడా చేశాడు. తప్పకుండా వరుణ్‌కి ఇది డిఫరెంట్‌ మూవీ అవుతుంది. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. తప్పకుండా ఇది మంచి సినిమా అవుతుంది.

శివబాలాజీ: మహేష్‌ డైరెక్షన్‌లో జగమేమాయ అనే సినిమా చేశాను. అతనితో వర్క్‌ చేయడం చాలా కంఫర్టబుల్‌గా వుంటుంది. అతని వర్కింగ్‌ స్టైల్‌ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా పాటలు బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. 

కోడి రామకృష్ణ: వరుణ్‌ సందేశ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతను చేసే సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ఒక మధ్యతరగతి కుర్రాడిలా అందర్నీ ఆకట్టుకునే విధంగా అతని పెర్‌ఫార్మెన్స్‌ వుంటుంది.  ఈ సినిమా కూడా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. మా అరుంధతి చిత్రంలో నటించిన అరవింద్‌ ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా నటించాడు. అతనికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్‌ కావాలి.

భీమనేని శ్రీనివాసరావు: మహేష్‌ నా దగ్గర పనిచేశాడు. అతనికి టాలెంట్‌తోపాటు మార్కెటింగ్‌ చెయ్యగల సత్తా వుంది. ఆల్రెడీ అతను ఒక సినిమా చేశాడు. అది రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఆ సినిమా రిలీజ్‌ అవక ముందే రెండో సినిమా చేసే అవకాశం వచ్చిందంటే అతనికి మార్కెటింగ్‌ ఎంత బాగా తెలుసో అర్థమవుతుంది. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ ఆడియోతోపాటు సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. 

మహేష్‌ ఉప్పుటూరి: వరుణ్‌ని ఈ సినిమాలో కొత్త చూపించే ప్రయత్నం చేశాను. నేను అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందంటే దానికి నిర్మాత సపోర్టే కారణం. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. సినిమా బాగా రావడానికి హీరో వరుణ్‌ సందేశ్‌, హీరోయిన్‌ వితిక షేరుతోపాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కోఆపరేట్‌ చేశారు. 

నల్లపాటి రామచంద్రప్రసాద్‌: మహేష్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ కథకు వరుణ్‌ సందేశ్‌ అయితేనే కరెక్ట్‌గా సరిపోతాడని భావించి అతనికి కథ చెప్పాం. అతనికి కూడా బాగా నచ్చింది. తన సొంత సినిమాగా భావించి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి చేశారు. వరుణ్‌తో మళ్ళీ తప్పకుండా సినిమా చేస్తాను. మహేష్‌ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. వరుణ్‌ కెరీర్‌కి ఈ సినిమా బాగా హెల్ప్‌ అవుతుందనుకుంటున్నాను. 

వరుణ్‌ సందేశ్‌: నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ సినిమా అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నేను గతంలో చేసిన సినిమాలు కొన్ని నిరాశ పరిచాయి. ఈ సినిమా నా కెరీర్‌కి చాలా ప్లస్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ నాకు వుంది. సినిమా బాగా రావాలని తపించే రామచంద్రరావుగారులాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. డైరెక్టర్‌ మహేష్‌ తను అనకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించడానికి ఎంతో కషి చేసి సక్సెస్‌ అయ్యాడు. దానికి ఖుద్దూస్‌ అందించిన మ్యూజిక్‌ చాలా ప్లస్‌ అయింది. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఈ ఆడియో చాలా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. 

వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు, ఎం.ఎస్‌.నారాయణ, పోసాని కృష్ణమురళి, తెలంగాణ శకుంతల, పృథ్వి, తాగుబోతు రమేష్‌, నల్లవేణు, కాశీ విశ్వనాథ్‌, రక్ష, అరవింద్‌, హేమంత్‌, సోనీ, పీలా గంగాధర్‌, హేమంతిని, అనంత్‌, రాఘవేంద్ర, చంటి, రామ్‌ప్రసాద్‌, శేషుకుమార్‌, సాయి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.ఖుద్దూస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: భరణి కె. ధరన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, పాటలు: చైతన్యప్రసాద్‌, డాన్స్‌: స్వర్ణ, ప్రదీప్‌ ఆంటోనీ, ఫైట్స్‌: రవి, ఆర్ట్‌: కుమార్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: భీమనేని రాయుడు, సమర్పణ: నల్లపాటి వంశీమోహన్‌, నిర్మాత: నల్లపాటి రామచంద్రప్రసాద్‌, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: మహేష్‌ ఉప్పుటూరి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs