Advertisement
Google Ads BL

దుబాయ్ లో జరగనున్న గామా అవార్డ్స్..!


గత సంవత్సరం దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగిన గామా అవార్డ్స్ గల్ఫ్ తెలుగు సాంస్కృతిక చరిత్రలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సంవత్సరం కూడా భారీగా గామా అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6, 2015 న దుబాయ్ జబీల్ పార్క్ లో జరగబోయే ఈ అవార్డ్స్ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవబోతున్నారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశం లో గామా అవార్డ్స్ చైర్మెన్ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ "ప్రతిష్టాత్మకమైన ఈ గామా జీవన సాఫల్య పురస్కారాన్ని 2014 వ సంవత్సరానికి కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మురళి మోహన్, కృష్ణం రాజు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పద్మశ్రీ బ్రహ్మానందం, యువ హీరోలు అల్లరి నరేష్, శర్వానంద్ హాజరవుతున్నారు" అని చెప్పారు.

జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్ అధినేత ప్రవీణా కడియాలా మాట్లాడుతూ.."2014 లో విడుదలైన చిత్రాల నుంచి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ మేల్ & ఫిమేల్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్ వంటి వివిధ క్యాటగిరీలలో నామినేషన్స్ సాధించిన వారికి ఆన్ లైన్, ఎస్ ఎం ఎస్, మీడియా రిపోర్ట్స్ ఆధారంగా వోటింగ్ నిర్వహించి విజేతలకు అవార్డ్స్ తో సత్కరించుతామని" తెలియజేసారు. కమెడియన్ ఆలీ, యాంకర్ సుమ ల నిర్వహణలో ప్రముఖ టాలీవుడ్ కళాకారులు, గాన కోకిల చిత్ర, శ్రీరామచంద్ర, వందేమాతరం శ్రీనివాస్, రఘు కుంచె, గీతామాధురి లతో పాటు అందాల తారలు సదా, సలోని, నవీన , యాంకర్ అనసూయ నృత్యాలు, శివారెడ్డి బృందం నిర్వహించే కామెడీ వంటి వినోద కార్యక్రామలతో అలరించనున్నట్లు చెప్పారు.

ప్రముఖ కమెడియన్ ఆలీ మాట్లాడుతూ "గత సంవత్సరం ఎంతో అధ్బుతంగా జరిగిన ఈ కార్యక్రమం మరోసారి జరుగుతుండడం, గామా అవార్డ్స్ కార్యక్రమం మళ్ళీ నేనే చెయ్యడం చాలా గర్వంగా ఉంది. విదేశంలో మన తెలుగు సినిమాలకి సంబంధించి ఇంత పెద్ద ఈవెంట్ జరగడం ఇదే" అని అన్నారు. విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమం డైరెక్టర్ అనిల్ కడియాలా , గామా ఇండియా ప్రతినిధి ఫణిమాధవ్ కస్తూరి, ప్రధాన స్పాన్సర్ బాస్కర రియల్ ఎస్టేట్స్ అధినేత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గామా అవార్డ్స్ మొబైల్ ఆప్ ఆవిష్కరించారు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs