విక్రమ్ శేఖర్, ప్రభ్‌జీత్ కౌర్ జంటగా స్పైసీ క్రియేషన్స్, శ్రీ చెజెర్లమ్మ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బాలాజీ దర్శకత్వంలో శరద్‌మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఇంటలిజెంట్ ఇడియట్స్’. శ్వేతాబసు ప్రసాద్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్వేతా బసు ప్రసాద్, హీరో విక్రమ్‌శేఖర్, నిర్మాతలు శరద్‌మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి, దర్శకుడు బాలాజీ పాల్గొన్నారు.
శ్వేతాబసు ప్రసాద్: ఈ చిత్రంలో నేను స్పెషల్ సాంగ్ చేశాను. నటిగా అన్నిరకాల పాత్రలు చేయాలన్నది నా అభిప్రాయం. అందుకే ఈసినిమాలో పాట చేశాను. పాట చాలా బాగా వచ్చింది. ఒక మంచి టీమ్‌తో వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది. నేను రూట్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీ చేస్తున్నాను. అది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో వుంది. మూడు సంవత్సరాలుగా ఎంతో డెడికేషన్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ అది. బాలీవుడ్‌లో నేను చేయబోయే కొన్ని సినిమాలు డిస్కషన్స్ స్టేజ్‌లో వున్నాయి.
బాలాజీ: సినిమా విజయం మీద చాలా కాన్ఫిడెన్స్ వున్నాం. చక్కని కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా బాగా రావడానికి నిర్మాతలు అందించిన ప్రోత్సాహం మర్చిపోలేనిది. ఈ సినిమా విజయం సాధించి మా అందరికీ పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
నిర్మాతలు: యూత్‌ని టార్గెట్ చేస్తూ చేసిన సినిమా అయినప్పటికీ అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించడం జరిగింది. 23న మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం.