Advertisement
Google Ads BL

ఆమెతో జతకట్టాలనుంది : రానా


‘దమ్‌ మారో దమ్‌’ సినిమాతో బిపాసాతో రొమాన్స్‌ చేశాడు దగ్గుబాటి రానా. మరొసారి ఆమెతో జతకట్టనున్నాడా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రముఖ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ విక్రమ్‌ పడ్నీస్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నియా’(వర్కింగ్‌ టైటిల్‌). ఇందులో ఓ కీలక పాత్ర కోసం రానాను, కథానాయికగా బిపాసా బసును ఎంపిక చేశారు.  ఈ నెలాఖరు నుండి షూటింగ్‌ ప్రారంభంకానుంది.

ఇదిలా ఉంటే రానా తనలో ఉన్న మరో బడా కోరికను బయట పెట్టాడు. బాలీవుడ్‌ అందాల భామ కట్రీనాకైఫ్‌తో కలిసి పని చెయ్యాలనుందని, ఏదొక రోజు తనతో వర్క్‌ చేస్తానని తన ఆలోచనను ఓ ఇంటర్వ్యూలో బయటుంచాడు దగ్గుబాటి వారసుడు. తన ఆశ ఎప్పటికి నెరవేరుతుందో  చూడాలి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs