‘‘డేటింగ్‌కి నేను వ్యతిరేఖిని కాను. నచ్చిన వ్యకితో డేటింగ్ అంటే వెళ్లామా, వచ్చామా అన్నట్లు ఉండకూడదు. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి. నేను డేటింగ్‌కి వెళ్ళాలంటే కొన్ని రిక్వైర్‌మెంట్స్ ఉన్నాయి’’ అంటూ తన డేటింగ్ రిక్వైర్‌మెంట్ లిస్ట్‌ను చెప్పుకొచ్చింది గోవాబ్యూటి ఇలియానా. తెలుగులో అవకాశాలు లేని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో మాత్రం ఏదొక సినిమా చేస్తునే ఉంది. ఇల్లీబేబీ మాట్లాడుతూ ‘‘డేటింగ్‌కి బీచ్ కన్నా మంచి ప్లేస్ మరొకటి ఉండదు. డేట్‌కి వెళ్ళేప్పుడు పిక్‌నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్, చలి కాగడానికి మంట, ఆకాశంలో తెల్లని నక్షత్రాలను చూస్తూ నచ్చిన వ్యక్తితో మనసువిప్పి మాట్లాడడం, ఇష్టమైన వంటకాలతో పాటు ‘కిక్’ కోసం కాస్త వైన్ తప్పనిసరిగా ఉండాలి. తిని వైన్ సేవించాక మెల్లగా శృంగారంలోకి జారుకోవాలి’’ నా వరకు ఫర్‌ఫెక్ట్ డేటింగ్ అంటే ఇదే అని చెప్పుకొచ్చింది గోవాబ్యూటి.