ముకుంద తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించబోయే చిత్రం "బ్రహ్మోత్సవం''. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రలో ఓ కీలక పాత్రను రావు రమేష్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు తీర్చిదిద్దారు.
శ్రీకాంత్ గత చిత్రాలయిన ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకంలలో రావు రమేష్‌కు మంచి పాత్రలు లభించాయి. రావు గోపాలరావు తనయుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన రమేష్, తన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించాడు. తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు దర్శకులు తనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు సృష్టించే స్థాయికి ఎదిగాడు.