Advertisement
Google Ads BL

నిజజీవిత పాత్రల్లో తల్లీకొడుకు..!!


అలనాటి బాలీవుడ్‌ నటి జయాబచ్చన్‌, ఆమె తనయుడు అభిషేక్‌బచ్చన్‌లు తమ నిజ జీవిత పాత్రల్లో వెండితెరపై ప్రేక్షకులను అలరించబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. అభిషేక్‌ బచ్చన్‌, జాన్‌ అబ్రహం కథానాయకులుగా బాలీవుడ్‌లో 'హెరాఫెరీ-3' చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో వచ్చిన 'హెరాఫెరీ' చిత్రానికి మూడో భాగంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నీరాజ్‌వోరా దర్శకుడు. ఫిరోజ్‌ నదియావాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయా బచ్చన్‌ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అభిషేక్‌బచ్చన్‌ తల్లిగా జయాబచ్చన్‌ ఓ కీలకపాత్రలో పోషించనున్నట్లు తెలిసింది. ఇటీవలే ఈ చిత్ర వర్గాలు జయాబచ్చన్‌ను సంప్రదించగా కథ నచ్చడంతో ఆమె ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇక వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs