శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్, షాలుని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సందీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 25 రోజుల తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. నిర్మాత మరపట్ల కళాధర్ చక్రవర్తి మాట్లడుతూ 1970లో జరిగిన ఒక ప్రేమకధని మా దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. తొలి ప్రయత్నంలో ఇంత మంచి సినిమా చేయ్యడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కిరణ్, షాలు మంచి నటన కనబరుస్తున్నారు. కోడిపుంజు చౌదరిగారి నటన సినిమాకే ప్రాణంగా నిలుస్తుందని, తదుపరి షెడ్యూల్ జనవరి 26 నుంచి కేరళ మరియు రామోజీపిల్మ్ సిటిలో ఉంటుందని తెలిపారు.