Advertisement
Google Ads BL

23న ‘ఇంటెలిజంట్‌ ఇడియట్స్‌’


విక్రమ్‌శేఖర్‌, ప్రభ్‌జీత్‌ కౌర్‌ జంటగా బాలాజీ దర్శకత్వంలో శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శరద్‌మిశ్రా, శ్రీనివాసులు దంపూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంటెలిజెంట్‌ ఇడియట్స్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో విక్రమ్‌శేఖర్‌, ప్రభ్‌జీత్‌ కౌర్‌, నిర్మాతలు, దర్శకుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

బాలాజీ: నేను చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చి ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మించిన నిర్మాతలకు థాంక్స్‌ చెప్తున్నాను. నేను ఏదైతే చెప్పానో దాన్ని అందంగా తెరపై చూపించేందుకు ప్రయత్నించాను. ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. 

చిత్ర నిర్మాతలు: ప్రస్తుతం యూత్‌ ఎలా వుంది, వారి ఆలోచనలు ఏవిధంగా వుంటున్నాయి. యూత్‌ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనే విషయాలు ఈ సినిమాలో డిస్కస్‌ చేయడం జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా బాలాజీగారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల 23న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం నాకు వుంది. 

విక్రమ్‌ శేఖర్‌: కొత్తదనాన్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈనెల 23న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం మీ అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం. 

ప్రభ్‌జీత్‌ కౌర్‌: ఇది నాకు చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చే కాన్సెప్ట్‌. స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ సినిమా అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే వుంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs