Advertisement
Google Ads BL

ఈ వారంలోనే 'డా. సలీమ్' పాటలు


విజయ్ ఆంటోని, అక్ష జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'డా. సలీమ్'. నాగప్రసార సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు, పాటల రికార్డింగ్ ఇటీవల పూర్తయ్యాయి. ఈ వారంలోనే పాటలను వచ్చేనెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ - "ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులతో పాటు ఐదు పాటలను సాహితి రాశారు. పాటలన్నీ స్వరాలపరంగానే కాదు.. సాహిత్యం పరంగా కూడా బాగుంటాయి. ఈ పాటలను హేమచంద్ర, సుప్రియా జోష్, మహాలింగం, ప్రభు, సంతోష్ తదితరులు పాడారు. ఈ చిత్రం మంచి మ్యూజికల్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.  సరిగమ ఆడియో సంస్థ  ద్వారా ఈ పాటలను విడుదల చేయబోతున్నాం. హీరోగా నటించడంతో పాటు విజయ్ ఆంటోని మంచి పాటలు స్వరపరిచారు. ఆయన నటన హైలైట్ గా నిలుస్తుంది. మా ఎస్.కె. పిక్చర్స్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం చేరుతుంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్. దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్. సంగీతం: విజయం ఆంటోని.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs