చియాన్ విక్రమ్ హీరోగా ఆస్కార్ ఫిలిం ప్రై. లిమిటెడ్ పతాకంపై శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మించిన భారీ చిత్రం ‘ఐ’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. కేవలం రెండు రోజులకు తెలుగు వెర్షన్ వరల్డ్‌వైడ్‌గా 19 కోట్ల 11 లక్షల షేర్ సాధించి రికార్డ్ సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఐ’ తెలుగు వెర్షన్ రెండు రోజుల్లో
కలెక్ట్ చేసిన షేర్స్ వివరాలు:
నైజాం 4 కోట్ల 25 లక్షలు,
వైజాగ్ 90 లక్షలు,
తూర్పుగోదావరి 98 లక్షలు,
పశ్చిమ గోదావరి 80 లక్షలు,
కృష్ణా 73 లక్షలు,
గుంటూరు 1 కోటి 18 లక్షలు,
నెల్లూరు 69 లక్షలు,
సీడెడ్ 2 కోట్ల 80 లక్షలు,
రెండు రోజుల గ్రాండ్ షేర్ 12 కోట్ల 33 లక్షలు,
ఓవర్సీస్, కర్ణాటక, నార్త్ ఇండియా 6 కోట్ల 78 లక్షలు
తెలుగు వెర్షన్‌కి రెండు రోజులకు టోటల్ షేర్ 19 కోట్ల 11 లక్షల షేర్.