చాలా బాగుంది, తొట్టిగ్యాంగ్, నువ్వంటే నాకిష్టం, కత్తికాంతారావు, కితకితలు, అత్తిలి సత్తిబాబు, ఫిటింగ్ మాస్టర్ వంటి ఎన్నో కామెడి ఎంటర్ టైనర్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఇ.వి.వి.సినిమా పతాకంపై అల్లరి నరేష్, ఈషా జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాజేష్ ఈదర నిర్మిస్తున్న చిత్రం ‘బందిపోటు’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి, యం.యం.కీరవాణి, సీనియర్ నటుడు చలపతిరావు, అల్లరి నరేష్, చిత్ర నిర్మాత ఈదర రాజేష్, సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా. సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, జెమినికిరణ్, హీరో శ్రీకాంత్ ఈష, హరీష్ శంకర్.యస్, సీతారామశాస్త్రి, నటకిరిటీ డా॥రాజేంద్రప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి, డా॥బ్రహ్మానందం, అవసరాల శ్రీనివాస్, నాని, సందీప్‌కిషన్, నవీన్‌చంద్ర, నవదీప్, సుశాంత్, సుమంత్ ఆశ్విన్, నాగశౌర్య, భీమనేని శ్రీనివాసరావు, జి.నాగేశ్వరరెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు పాల్గొన్నారు.
బిగ్‌సీడీని హీరో శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, హరీష్ శంకర్.ఎస్ ఆవిష్కరించారు. అడియోను ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించి యం.యం.కీరవాణికి తొలి సి.డి. అందించారు. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా.
ఎస్.ఎస్.రాజమౌళి: నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఇవివిగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు ఇండస్ట్రీని ఏలుతున్నారు. నేను డైరెక్టర్‌గా మారిన తర్వాత స్టూడెంట్ నెం.1 చిత్రం తర్వాత ఓ సందర్భంలో ఆయన్ని కలిశాను. ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్‌ను పక్కన పెడితే డౌన్ టు ఎర్త్ ఉండాలి. డబ్బులు కూడబెట్టుకోవాలి అనే సలహా ఇచ్చారు. ఇప్పటికీ ఆ మాటలు నా చెవుల్లో మారు మ్రోగుతుంటాయి. ఆయన స్టార్ట్ చేసిన ఈ బ్యానర్‌ను నరేష్, రాజేష్‌లు రీస్టార్ట్ చేయడం హ్యపీగా ఉంది. ఈ బ్యానర్‌లో గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
యం.యం.కీరవాణి: సినిమాకి స్క్రిప్ట్, రచయిత మూలమని నమ్మే దర్శకుడు ఇ.వి.విగారు. అలాగే ఆశ్లీలతకి దూరంగా సినిమాలు నిర్మించే దర్శకుడు మోహనకృష్ణ. ఈయన దర్శకత్వంలో నరేష్, రాజేష్‌లు కలిసి నిర్మించిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ యూనిట్‌కి కంగ్రాట్స్ చెబుతున్నాను.
అల్లరి నరేష్: మా నాన్నగారు మమ్మల్ని హీరోలుగా నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో, అంత కంటే ఎక్కువగా కష్టపడి ఇ.వి.వి.బ్యానర్‌ను నిలబెడతాం.
మోహనకృష్ణ ఇంద్రగంటి: నరేష్‌తో చాలాసార్లు సినిమా చేయాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. ఈ సినిమాతో వీలుపడిరది. డిఫరెంట్ కథ, నరేష్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాను. ప్రతి క్యారెక్టర్‌ను డిఫరెంట్ ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాం. అలాగే ఇ.వి.వి.గారు స్టార్ట్ చేసిన ఈ బ్యానర్‌ను తిరిగి నేను డైరెక్ట్ చేసిన సినిమాతో రీస్టార్ట్ చేయడం అనేది గర్వంగా ఫీలవుతున్నాను. కల్యాణ్ కోడూరిగారితో నాలుగో సినిమాకి పనిచేస్తున్నాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన నరేష్, రాజేష్‌లకు థాంక్స్.
హీరో శ్రీకాంత్: నేను ఇ.వి.వి.గారి దర్శకత్వంలో పదకొండు సినిమాలకు పనిచేశాను. ఇ.వి.విగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారి సినిమాలే వరుసగా చేసిన రోజులున్నాయి. నా లైఫ్‌లో మరిచిపోలేని వ్యక్తులు ఎస్వీ కృష్ణారెడ్డిగారు, ఇ.వి.వి.గారు. ఈ బ్యానర్ స్టార్టయినప్పుడు మొదటి చిత్రంలో నేను హీరోగా నటించాను. ఈ సినిమాతో నరేష్, రాజేష్‌లకు మంచి పేరు రావాలి.
ఎస్.వి.కృష్ణారెడ్డి: ఇ.వి.విగారు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు కూడా చేశారు. ఆయనకి, నాకు మధ్య మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఈ బ్యానర్‌లో ఇప్పుడు చేసిన బందిపోటుతో పాటు ఫ్యూచర్‌లో కూడా ఆయన రేంజ్ సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.
డి.సురేష్‌బాబు: ఆహ నా పెళ్లంట సినిమా నుండి ఇ.వి.వి.గారు నాకు పరిచయం. ఆ తర్వాత చాలా సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశాం. ఆయన తనయులు ఆయన పేరు మీద ఉన్న బ్యానర్‌ను తిరిగి ప్రారంభించడం ఆనందంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
డా॥రాజేంద్రప్రసాద్: దేవదాస్ కనకాల, జంధ్యాల దగ్గర ఇ.వి.వి.గారు పనిచేసే రోజుల నుండే నాకు బాగా తెలుసు. మా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా తర్వాత వచ్చిన అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు వంటి చిత్రాలతో పాటు అనేక చిత్రాలు చేసి వరుస విజయాలు సాధించాం. ఆయన టైటిల్ దగ్గర నుండి ఎండ్ కార్డ్ వరకు అనేక ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ చేశారు. ఇ.వి.వి., ఎస్వీ కృష్ణారెడ్డిగారు నాకు రెండు కళ్లు. ఆయన స్టార్ట్ చేసిన ఈ బ్యానర్‌లో వచ్చే సినిమాలు ఆయన పేరుని నిలబెట్టేలా ఉండాలని ఆశిస్తున్నాను.
డా॥బ్రహ్మానందం: ఈ వేడుకకి అభిమానంతో పాటు బాధ్యతగా వచ్చాను. ఆహా నా పెళ్లంట సినిమా టైమ్‌లో కోట శ్రీనివాసరావు సరసన అసిస్టెంట్‌గా ఎవరిని తీసుకోవాలి అని జంధ్యాలగారు ఆలోచిస్తున్నప్పుడు ఇ.వి.వి.గారు నా పేరు సజెస్ట్ చేశారు. ఆయన లేకుంటే ఈ స్థాయిలో నేను ఉండేవాడిని కాను. ఆయన దర్శకుడిగా మారిన తర్వాత కూడా ఆయన సినిమాల్లో అనేక పాత్రలు వేశాను. ఇ.వి.వి. కంటే గొప్పవాళ్లు, చిన్నవాళు ఉండవచ్చేమో కానీ ఇ.వి.వి.అంతటివాళ్లు లేరు. ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెన్స్ చూపించాలని తాపత్రయపడుతుంటారు.
హీరో నాని: మోహనకృష్ణగారు, కళ్యాణ్‌కోడూరిగారితో గతంలో పనిచేశాను. పాటలు, ట్రైలర్స్ బావున్నాయి. నరేష్ ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనపడుతున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్టయి అందరికీ మంచి పేరు తీసుకురావాలి.
హీరో సుశాంత్: మోహనకృష్ణగారి సినిమాలన్నీ చూశాను. ఆయన కామెడియే డిఫరెంట్‌గా ఉంటుంది. అవుటాఫ్ ది బాక్స్ వెళ్లి సినిమాలు చేస్తుంటారు. ఈ సినిమా లుక్, సాంగ్స్, ట్రైలర్స్ చూస్తే అలాగే ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. నరేష్, రాజేష్, టీమందరికీ ఆల్ ది బెస్ట్.