Advertisement
Google Ads BL

సందీప్‌ కిషన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టైగర్‌’


సందీప్‌ కిషన్‌ హీరోగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టైగర్‌’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌, చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ‘‘ఎక్స్‌ట్రార్డినరీ సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ‘టైగర్‌’ సందీప్‌ కిషన్‌ని హీరోగా మరో స్థాయికి తీసుకెళ్ళే సినిమా అవుతుంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కాశీ, అలహాబాద్‌, బొబ్బిలి వంటి విభిన్నమైన లొకేషన్స్‌ చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆల్‌మోస్ట్‌ ఫైనల్‌ స్టేజ్‌లో వున్న ఈ చిత్రం ఫస్ట్‌ టీజర్‌ని జనవరి 14 నుండి ‘ఐ’ సినిమాతోపాటు థియేటర్‌లో ప్రదర్శించడం జరుగుతుంది’’ అన్నారు.

దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ మాట్లాడుతూ ‘‘కాశీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా వుంటుంది’’ అన్నారు. 

రాహుల్‌ రవీంద్ర, సప్తగిరి, సుప్రీత్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, ప్రవీణ్‌, కాశీ విశ్వనాథ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, కో`డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, లైన్‌ ప్రొడ్యూసర్‌: జి.నాగేశ్వరరావు, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs