త్రిషకు రూ. 7 కోట్ల బహుమతి..!!


చెన్నై సొగసరి త్రిష త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తమిళ నిర్మాత వరుణ్‌మణియన్‌తో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న త్రిష.. త్వరలోనే అతని జీవిత భాగస్వామి కాబోతోంంది. పెళ్లి విషయాన్ని త్రిష స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈనెల 23న చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్లో త్రిష నిశ్చితార్థం వేడుక జరగనుంది. ఇదిలావుండగా త్రిష నిశ్చితార్థం గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. తనకు కాబోయే జీవిత భాగస్వామినుంచి త్రిష ఓ ఖరీదైన బహుమతి అందుకోబోతున్నట్లు సమాచారం. ఏడు కోట్ల రూపాయల విలువైన రోల్స్‌రాయిస్‌ కారును నిశ్చితార్థం రోజును త్రిషకు కానుకగా అందించబోతున్నాడట ఆమెకు కాబోయే భర్త వరుణ్‌మణియన్‌. చెన్సై సినీ వర్గాల్లో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. మే నెలలో ఈ జంట వివాహం జరగనున్నట్లు తెలిసింది.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES