Advertisement
Google Ads BL

ఆ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోంది..!!


బాలీవుడ్‌లో కొంతకాలంగా సీక్వెల్‌ చిత్రాల ట్రెండ్‌ కొనసాగుతోంది. గతంలో ప్రేక్షకుల ఆదరణ పొందిన పలు చిత్రాలకు కొనసాగంపు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ జాబితాలో మరో కొత్త చిత్రం చేరింది. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా 2011లో రూపొందిన చిత్రం 'బాడీగార్డ్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సల్మాన్‌ఖాన్‌ కెరియర్‌లో భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డులు తిరగరాసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. తొలిభాగానికి నిర్మాతగా వ్యవహరించిన అతుల్‌ అగ్నిహోత్రి ఈ సీక్వెల్‌ను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు కొనసాగుతున్నాయి. మొదటి భాగానికి భిన్నంగా రెండో భాగంలో సల్మాన్‌ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs