Advertisement
Google Ads BL

‘హైదరాబాద్‌ లవ్‌స్టోరీ’ ఆడియో విడుదల


రాహుల్‌ రవీంద్రన్‌, రేష్మి మీనన్‌, జియా ప్రధాన పాత్రల్లో ఎస్‌.పద్మజ సమర్పణలో ఎస్‌.ఎన్‌.ఆర్‌. ఫిల్మ్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై పతాకంపై రాజ్‌ సత్య దర్శకత్వంలో ఎస్‌.ఎన్‌.రెడ్డి నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైదరాబాద్‌ లవ్‌స్టోరీ’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆడియో సీడీలతోపాటు మేకింగ్‌ వీడియోను కూడా ఆవిష్కరించారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను నిర్మాత దామోదరప్రసాద్‌ విడుదల చేశారు. సునీల్‌ కశ్యప్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ ఆడియో ఫంక్షన్‌లో పార్లమెంట్‌ సభ్యుడు జితేందర్‌రెడ్డి, భీమనేని శ్రీనివాసరావు, వి.ఎన్‌.ఆదిత్య, సునీల్‌, సందీప్‌కిషన్‌, నవీన్‌చంద్ర, దీక్షాపంత్‌, మనాలి రాథోడ్‌, నిర్మాత శివకుమార్‌, హీరో అరుణ్‌, రాహుల్‌ రవీంద్రన్‌,  రేష్మి మీనన్‌, సునీల్‌ కశ్యప్‌, జియా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

తలసాని శ్రీనివాస యాదవ్‌:  ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా వుండే సినిమాలు రావాల్సి వుంది. సినిమా నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వున్నా తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించేందుకు సహకారం అందిస్తుంది. ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. 

జితేందర్‌రెడ్డి: పాటలు చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.

భీమినేని శ్రీనివాసరావు: ఎస్‌.ఎన్‌.రెడ్డిగారు నాకు మంచి మిత్రుడు. ఈమధ్య రాహుల్‌  చేసిన అలా ఎలా చిత్రం మంచి హిట్‌ అయింది. సునీల్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. పాటలతోపాటు సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది. 

వి.ఎన్‌.ఆదిత్య: సునీల్‌ మ్యూజిక్‌ అంటే నాకు ఇష్టం. ఈ సినిమాకి కూడా చాలా మంచి మ్యూజిక్‌ చేశాడు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది. 

నవీన్‌చంద్ర: హైదరాబాద్‌కి వచ్చిన తర్వాతే రాహుల్‌ లవ్‌ చేసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి యాప్ట్‌ టైటిల్‌ ఇది. 

సందీప్‌కిషన్‌: కథను నమ్మే నిర్మాత ఎస్‌.ఎన్‌.రెడ్డిగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ను ఇస్తుందనడంలో డౌట్‌ లేదు. రాహుల్‌ నాకు మంచి మిత్రుడు. రాజ్‌సత్య సినిమా బాగా చేశాడనిపిస్తోంది. సునీల్‌ కశ్యప్‌ ది బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. 

ఎస్‌.ఎన్‌.రెడ్డి: ముగ్గురి మధ్య జరిగే కథ ఇది. మంచి ఫీల్‌ వున్న లవ్‌స్టోరీ. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. 

రాజ్‌సత్య: సినిమా బాగా వచ్చిందంటే దానికి హండ్రెడ్‌ పర్సెంట్‌ మా నిర్మాత ఎస్‌.ఎన్‌.రెడ్డిగారే కారణం. నేను ఏది కావాలన్నా ప్రొవైడ్‌ చేసి సినిమా బాగా రావడానికి తోడ్పడ్డారు. నాకు సహకరించిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కి థాంక్స్‌ చెప్తున్నాను. 

రాహుల్‌ రవీంద్రన్‌: సునీల్‌ చాలా మంచి పాటలు చేశాడు. ఇంఉదో ‘జాజి పువ్వా’ అనే సాంగ్‌ అందరికీ నచ్చుతుంది. ఎస్‌.ఎన్‌.రెడ్డిగారు మంచి క్వాలిటీతో సినిమాని నిర్మించారు. రాజ్‌సత్య చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. 

సునీల్‌ కశ్యప్‌: ఒక మంచి సినిమా చెయ్యడానికి నిర్మాత రెడ్డిగారు ఎంతో కష్టపడ్డారు. నిజానికి ఈ సినిమాకి ఆయనే హీరో. రాజ్‌ సత్య చాలా బాగా తీశారు. 

రావురమేష్‌, అంబటి శీను, మధుమణిచంటి, రమాప్రభ, తాగుబోతు రమేష్‌ తదితరులు మిగతా పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, కెమెరా: బీవీ అమర్‌నాథ్‌రెడ్డి, ఎడిటర్‌: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రాజేందర్‌రెడ్డి పిన్నింటి, సహనిర్మాత: ఎస్‌.శ్రీలక్ష్మి, నిర్మాత: ఎస్‌.ఎన్‌.రెడ్డి, రచన,దర్శకత్వం: రాజ్‌సత్య.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs