Advertisement
Google Ads BL

'గోపాల గోపాల'పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు


పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ నటించిన 'గోపాల గోపాల' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అత్తారింటికి దారేది' తర్వాత పవన్‌కల్యాన్‌ నటించిన సినిమా కావడంతో 'గోపాల గోపాల'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ సినిమా ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో రాలేదో అప్పుడే సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో పలు సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ రఘునాథరావు అనే వ్యక్తి హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంకా స్పందించలేదు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి. మరోవైపు 'గోపాల.. గోపాల' భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతోపాటు ఈ సినిమా చూడటానికి విద్యార్థులు క్యూ కడుతున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs