దక్షిణ భారత దర్శక దిగ్గజం శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా 'ఐ'. అయితే ఈ సినిమాకు కొత్తకొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. మొదట దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ప్రకటించారు. కాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగడంతో సినిమా విడుదలను సంక్రాంతికి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ తేదీకి కూడా సినిమా విడుదలవుతుందా..? లేదా..? అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. పిక్చర్ మీడియా హౌస్ సంస్థ 'ఐ'కి వ్యతిరేకంగా చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ సినిమా కోసం ఆస్కార్ తమనుంచి తీసుకున్న రూ. 15 కోట్లను తిరిగి చెల్లించలేదని, వడ్డీ రూ. 2 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 17 కోట్లు ఇచ్చే వరకు కూడా సినిమా విడుదలను నిలిపివేయాలని పిటీషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు ఈ కేసు విచారణను జనవరి 30కి వాయిదా వేసింది. కాగా నేడో రేపో ఆస్కార్ ఈ సమస్యను సెటిల్‌చేసే పనిలో తలమునకలైనట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి 'ఐ'ని విడుదల చేస్తామని ఆస్కార్ రవిచంద్రన్ చెబుతున్నారు.