నిఖిల్, త్రిద జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న వెరైటీ చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమం జనవరి 7న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా..
వి.వి.వినాయక్: ఈమధ్య నిఖిల్ చేసిన కార్తికేయ చూశాను. చాలా బాగుంది. సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి నిఖిల్‌ని, యూనిట్‌ని అభినందించాను. ఆ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌లెంట్‌గా చేశాడు. ఈ సినిమాతో అతను డైరెక్టర్‌గా మారుతున్నందుకు హ్యాపీగా వుంది. ‘సూర్య వర్సెస్ సూర్య’ టైటిల్ కొత్తగా వుంది, అలాగే టీజర్ కూడా కొత్తగా వుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనిపించింది. ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది.
నిఖిల్: కార్తికేయ సక్సెస్‌కి సంబంధించి నాకు వచ్చిన మొదటి కాల్ వినాయక్‌గారిదే. నన్ను అప్రిషియేట్ చెయ్యడమే కాకుండా నాకు కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహాతోనే కథ విషయంలో, దర్శకుడి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. కార్తికేయ టైమ్‌లో పరిచయమైన శివకుమార్‌గారు ఈ సినిమాకి నిర్మాత కావడం ఆనందంగా వుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది.
తనికెళ్ల భరణి: కార్తీక్ చెప్పిన కథ విన్న తర్వాత మొదట ఈ సినిమా వద్దని అనుకున్న నేను వెంటనే చేస్తానని చెప్పాను. ఇది చాలా మంచి సబ్జెక్ట్ స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్‌హిట్స్ చేసిన నిఖిల్‌కి ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. కార్తీక్ డైరెక్షన్ చాలా బాగుంది. భవిష్యత్తులో అతను మంచి డైరెక్టర్ అవుతాడని నమ్మకం వుంది.
సుధీర్‌వర్మ: వరస హిట్స్‌తో వెళ్తున్న నిఖిల్‌కి ఈ సినిమా మరో హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుంది.
చందు మొండేటి: ఈ కథని కార్తికేయ చిత్రం కంటే ముందే రెడీ చెయ్యడం జరిగింది. చాలా మంచి కథ. దానికి మంచి మాటలు కూడా కుదిరాయి. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుంది.
త్రిదా: ఇది ఫస్ట్ మూవీ. కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.
కార్తీక్ ఘట్టమనేని: నేను అనుకున్న ఒక డిఫరెంట్ పాయింట్‌ని నేను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో నిర్మాత శివకుమార్‌గారి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందర్నీ అలరించే చిత్రమవుతుంది.
మల్కాపురం శివకుమార్: కార్తికేయ మంచి విజయం సాధించింది. మంచి కథతో రూపొందిన ఈ చిత్రం కూడా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. కార్తీక్ చెప్పిన దానికంటే సినిమా బాగా తీశాడు. దానికి తగ్గట్టుగానే నిఖిల్ పెర్‌ఫార్మెన్స్ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. ఈ సినిమా మేం అనుకున్న టైమ్‌కి కంప్లీట్ కావడంలో చందు మొండేటి సహకారం ఎంతో వుంది. ఈ సినిమా నిర్మాణంలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.
తనికెళ్ల భరణి, మధుబాల, రావురమేష్, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: సత్య మహావీర్, మాటలు: చందు మొండేటి, ఎడిటర్: గౌతం నెరుసు, డాన్స్: విజయ్, ఫైట్స్: వెంకట్, ప్రొడక్షన్ కంట్రోలర్: టి.గంగాధర్‌రెడ్డి, నిర్మాత: మల్కాపురం శివకుమార్, రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.