సినిమా ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నిర్మాతలు తెలియజేస్తున్నారు. చియాన్ విక్రమ్ హీరోగా, యామి జాక్సన్ హీరోయిన్‌గా ఆస్కార్ ఫిలిమ్ ప్రై. లిమిటెడ్ పతాకంపై శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆస్కార్ ఫిలిమ్ ప్రై. లిమిటెడ్, మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొంది ఈ చిత్రంలోని పాటలు సోని మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చెయ్యబోతున్నారు.
సురేష్‌గోపి, ఉపేన్ పటేల్, సంతానం, రామ్‌కుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్ధిక్ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్, ఆర్ట్: ముత్తురాజ్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి,, కో`ప్రొడ్యూసర్: డి.రమేష్‌బాబు, నిర్మాత: ఆస్కార్ వి.రవిచంద్రన్, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: శంకర్.