గౌహార్‌ఖాన్.. 'శంకర్‌దాదా ఎంబీబీఎస్'లో నా పేరే కాంచనమాల అంటూ మెగాస్టార్ చిరంజీవితో ఆడిపాడింది. అయితే ఈ బాలీవుడ్ హాట్‌గర్ల్ పబ్లిసిటీ కోసం అచ్చం సినిమా స్క్రీన్‌ప్లేలా ఓ నాటకాన్ని ప్లే చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం ముంబై శివార్లలో ఏర్పాటుచేసిన ఓ స్టేజీషోకు హాజరైన గౌహార్‌ఖాన్ చెంపను ఓ యువకుడు పబ్లిక్‌గా చెల్లుమనిపించాడు. జనంలోకి ఇంత పొట్టి దుస్తులతో వస్తావా అంటూ అంటూ ఆమెపై దాడి చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతణ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. గౌహార్‌ఖాన్ డబ్బులిచ్చి మరీ తనను కొట్టమని చెప్పినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా అలా కొడితే త్వరలో రానున్న 'దబాంగ్-3'లో అవకాశం ఇప్పిస్తానని కూడా గౌహార్‌ఖాన్ హామీ ఇచ్చినట్లు చెప్పాడు. ఇప్పుడు తనను పట్టించుకోకపోవడంతో అసలు నిజాన్ని మీడియాకు వెల్లడిస్తున్నట్లు చెప్పాడు. చెంపదెబ్బ సీన్‌తో దేశవ్యాప్తంగా తనకు క్రేజ్ పెరుగుతుందని ఆలోచించిన గౌహర్‌ఖాన్ పాచిక పారకపోవడమే కాకుండా ఇలా రివర్స్ కావడం ఆమె ఊహించి ఉండకపోవచ్చు.