కథానాయికగా తాను సక్సెస్ అయినట్లేనని శృతిహాసన్ చెబుతోంది. కెరియర్ ప్రారంభంలో వరుస ప్లాఫులతో తాను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యానని, తాను హీరోయిన్‌గా రాణించలేనని ఆందోళనకు గురైనట్లు చెప్పారు. ఇక తెలుగులో 'గబ్బర్‌సింగ్' విజయంతో శృతిహాసన్ విజయాల బాట పట్టారు. గతేడాది ఎవడు, రేసుగుర్రం చిత్రాల ఘన విజయంతో తెలుగులో టాప్ పోజిషన్‌లోకి వెళ్లిపోయారు. పస్తుతం ఈ భామ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇక 2015లో శృతిహాసన్ నటించిన 7 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక అక్షయ్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న 'గబ్బర్‌సింగ్' హిందీలో తన కెరియర్‌ను మలుపుతిప్పుతుందని శృతిహాసన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.