Advertisement
Google Ads BL

‘గోపాల గోపాల’ ఆడియో రిలీజ్‌


ఒకప్పుడు మల్టీస్టారర్‌ మూవీస్‌ తెలుగులో విరివిగా వచ్చేవి. ఆ తర్వాత ఆ ఒరవడి తగ్గిపోయింది. అయితే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో వెంకటేష్‌, మహేష్‌ మళ్ళీ మల్టీస్టారర్‌ మూవీస్‌కి శ్రీకారం చుట్టారు.  దాన్ని కంటిన్యూ చేస్తూ తాజాగా వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ కలిసి ‘గోపాల గోపాల’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపైన ప్రేక్షకుల్లో, ఆడియన్స్‌, ఇండస్ట్రీలోనూ చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య ఆదివారం ‘గోపాల గోపాల’ ఆడియో ఆవిష్కరణ జరిగింది. చిత్ర కథనాయకులు వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ కలిసి ఆడియోను ఆవిష్కరించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర నిర్మాతలు డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

శరత్‌ మరార్‌: చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నిర్మాతగా మారడం హ్యపీగాఉంది. డాలీ ఎక్స్‌లెంట్‌ వర్క్‌ చేశాడు. వెంకటేష్‌గారు, పవన్‌కల్యాణ్‌గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇద్దరికీ థాంక్స్‌. ఈ మూమెంట్‌ నా హృదయానికి చాలా దగ్గరైన విషయం. పవన్‌కల్యాణే నా కృష్ణుడు. 

వెంకటేష్‌: నా క్యారెక్టర్‌ ఇందులో చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందులో పవన్‌ చాలా స్టయిల్‌గా నిలడటం నాకు బాగా నచ్చుతుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా కొత్త కాన్పెప్ట్‌. పవన్‌ ఈ రోల్‌ చేయడానికి ఒప్పుకోగానే చాలా హ్యపీగా అనిపించింది. ఈరోజు తనకి మనస్ఫూర్తిగా థాంక్స్‌ చెబుతున్నాను. ఎప్పట్నుంచో మేమిద్దరం కలిసి చేద్దామనుకుంటున్నాం. కానీ ఇప్పటికి కుదరింది. పవన్‌ డైలాగ్‌ చెప్పినట్లు లేట్‌గా వచ్చినా పవర్‌ఫుల్‌గా వస్తున్నాం. 

పవన్‌కళ్యాణ్‌: అనూప్‌ రెండు సంవత్సరాలు క్రితం గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి ఆడియో రిలీజ్‌ చేశాను. అప్పుడు నాకు తన మ్యూజిక్‌ బాగా నచ్చింది. తనతో సినిమాల్లో పనిచేసే అవకాశం రాలేదు. ఈ సినిమాలో అనూప్‌ మ్యూజిక్‌ చేస్తున్నాడని తెలియగానే ఓకే అన్నాను. వెంటనే అనూప్‌కి ఫోన్‌ చేసి నా నెక్స్‌ట్‌ మూవీ కూడా నువ్వే చేయాలి(అది గబ్బర్‌సింగ్‌ కాదు తర్వాత వచ్చే మూవీ)అన్నాను. వెంకటేష్‌గారి కామికల్‌ ఎక్స్‌ప్రెషన్‌ బాగుంటుంది. సినిమాలో రాక ముందు నేను వెంకటేష్‌గారి ఇంటికి వెళ్లేవాడిని, భోజనం చేసి అప్పట్లో లేజర్‌ డిస్క్‌లుంటే కలెక్ట్‌ చేసుకునేవాడిని. నేను సినిమాలకు సంబంధం లేకుండా వెంకటేష్‌గారిని కలుసుకుంటాను. ఆయన మామూలుగా కలుసుకుంటే సినిమాల కంటే ఆధ్యాత్మిక విషయాలనే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఆ ఆధ్యాతికతే గోపాల గోపాల సినిమా చేయడానికి కారణమైందనుకుంటాను. చిన్నప్పట్నుంచి ఎమవ్వలాదో నాకు తెలిసే కాదు. అమ్మ అడిగినా, అన్నయ్యలు అడిగినా తెలిసేది కాదు. పెద్దగా చదువుకోలేదు కూడా. దేవుడంటే నాకు చాలా భయం. నేను నమ్మే దేవుడికి ఏ రూపం లేదు. ఆయనకి ఆకారం లేదు. నాకు ఎమవ్వలో తెలియక నేను, నా ఫ్రెండ్‌ ఆనంద్‌సాయి ఇద్దరం ఆడవుల్లోకి పారిపోవాలని డిసైడ్‌ చేసుకున్నాం. రెడీగాఉన్నాం. అంతలోనే చిరంజీవి అన్నయ్య ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావురా అని అడగ్గానే ఇక్కడే ఉన్నానంటూ నవ్వాను. ఏం చేస్తున్నావ్‌ అని అన్నారు. ఏం చేయడం లేదని అన్నాను. వెంటనే బయలుదేరి హైదరాబాద్‌కి వచ్చేసెయ్‌ అన్నారు. అప్పుడు ఆనంద్‌సాయిని వదిలేసి హైదరాబాద్‌కి వెళ్లేపోయాను, ధ్యానం నేర్చుకున్నాను. మొత్తం వదిలేసి పని అనేది మానేశాను. నేను అన్నయ్యకి కథలు చెప్పేవాడిని.అన్నయ్యొమో బాగా కష్టపడి ఇంటికి వచ్చేవారు. ఇలా యోగాసనాలు, ధ్యానం గురించి చెబుతుంటే నీకేంరా కష్టపడే అన్నయ్య, బాగా చూసుకునే వదిన ఉన్నారు. నీకు అన్నీ సమకూర్చితే ఎన్ని కథలైనా చెబుతావు. అలా కాకుండా ఇలాగే కష్టపడినప్పుడు చెప్పు నేను నీ మాటలు నమ్ముతాను అన్నారు. ఆరోజు అన్నయ్య చెప్పిన మాటలు విని చెంపదెబ్బకొట్టినట్లయింది. అన్నీ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గురించి మాట్లాడటం చాలా తేలిక. అన్నీ కష్టాలు ఎదురైనప్పుడు ఆధ్యాత్మిక పాటించడం ఎంతో కష్టమో సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచి తెలుస్తుంది. నాకు అణువణువునా నాకు భగవంతుడే కనపడుతున్నాడు. ఖుషీ సినిమా చేశాను. రేపు రిలీజ్‌ అనగానే నేను, సినిమాలో పనిచేసిన స్టాప్‌ అంతా సినిమా చూస్తున్నాం. ఇంటర్వెల్‌ టైమ్‌లో నీకు రాబోయే కొద్దికాలం చాలా కష్టాలు పడాతావనిపించి, విపరీతమైన భయమేసింది. ఖుషీ సినిమా బాగా వచ్చింది. అయినా నాకు కొన్ని సంవత్సరాలు పాటు సక్సెస్‌ అనేది ఉండదు అనే భావన కలిగినప్పుడు నమ్మాలో లేదో తెలియక నీరసంగా బయటికి వచ్చేశాను. అన్నీ వదిలేసి వెళ్లిపోతామనుకున్న నాకు భగవంతుడు ఇంతమంది అభిమానులను ఇచ్చాడు. అలాంటి నాకు అపజయం వస్తుందని నాకు తెలుసు. కానీ నాకు అంత బలం రావడానికి కారణం నా అభిమానులు. నన్ను ఒక్క క్షణం కూడా వదల్లేదు. నాకు ఉహ తెలిసినప్పట్నుంచి దేవుడి దగ్గర ఏ కోరికా కోరలేదు. ఈ మధ్యనే ఓ కోరిక కోరుకున్నాను. అది రాజకీయాలు కాదు. రాజకీయాల్లో నేను సేవ చేస్తాను. అది వేరే సంగతి. అయితే గుండెజారి గల్లంతయ్యిందే ఆడియో తర్వాత వెళుతుంటే కొంత మంది అభిమానులు నా కారుకు అడ్డుపడి నువ్వెప్పుడు హిట్‌ సినిమా తీస్తావ్‌..చచ్చిపోతున్నాం. హిట్‌ సినిమా తీయన్నా, రా అన్నా.. అన్నారు. కానీ అభిమానులకు ఏం చెప్పగలను. ఇంత సక్సెస్‌ నాకు నా అభిమానుల రూపంలో ఇచ్చిన సక్సెస్‌ నా స్వశక్తితో నేను సాధించిందని అనుకోను. ఏ మూలకెళ్లినా ఒక సక్సెస్‌ ఇవ్వన్నా..రోడ్లు పైకి వెళ్లలేకపోతున్నాం అనేవారు. గబ్బర్‌సింగ్‌ ఇంటర్వెల్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ చేస్తున్నప్పుడు ఓ అభిమాని మహబూబ్‌నగర్‌ నుండి వచ్చి అన్నా ఒక్క హిట్‌ తీయన్నా..చచ్చిపోతున్నామన్నా అని అన్నాడు. కానీ నాకు ఆరోజు నీకు స్క్రిప్ట్‌ చేతకాకపోతే నేను మంచి కథ ఇస్తానన్నాడు. ఆ మాటతో నా గుండె కదిలిపోయింది. సరే కథ రాశావా, చెబుతావా అన్నాను. నేను రాయలేను.. చెప్పగలను అన్నాడు.  నిజంగా ఆప్రేమ చూసి నా అభిమానులు కోసం ఒక్క సక్సెస్‌ ఇవ్వు తండ్రి నేను సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతాను అనుకున్నాను. కానీ భగవంతుడు వరుస విజయాలు అందించాడు. నేను ప్రతి ఒక అభిమానితో వన్‌ టు వన్‌ అభిమానం ఉంటుంది. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడలేను. నాకు సమస్యల నుండి పారిపోవడం తెలియదు. అందులో అపజయాలు కూడా రావచ్చు. కానీ నాకు వెన్ను చూపడం తెలియదు. నా కష్టమంటారా, చేతుల్లో ఏముందో అంత వరకు నేను కష్టపడతాను. నాకు తెలిసిందే అది. జయాపజయాలు నా చేతుల్లో లేదు. అది భగవంతుడు ఆశీస్సులు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs