Advertisement
Google Ads BL

వాలెంటైన్స్‌ డేకి వస్తోన్న ‘మొహబ్బత్‌ మే’


కార్తీక్‌, హమీద జంటగా ఆశ్రిత్‌ మూవీస్‌ పతాకంపై మహేష్‌ సూర్య దర్శకత్వంలో రమా రవిశంకర్‌ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘మొహబ్బత్‌ మే’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో కార్తీక్‌, దర్శకుడు మహేష్‌ సూర్య, నిర్మాత రమా రవిశంకర్‌, సంగీత దర్శకుడు మీనాక్షి భుజంగ్‌, నటి అనితానాథ్‌ పాల్గొన్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కార్తీక్‌ తన పుట్టినరోజును చిత్ర యూనిట్‌ సభ్యుల మధ్య జరుపుకున్నారు. 

Advertisement
CJ Advs

మహేష్‌ సూర్య: మూడు షెడ్యూల్స్‌లో మా చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. చక్కని ప్రేమకథకి ఫ్యామిలీ సెంటిమెంట్‌ జోడిరచి రూపొందించిన సినిమా ఇది. మరో పదిరోజుల్లో ఈ చిత్రం ఆడియోను రిలీజ్‌ చేసి, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం.

రమా రవిశంకర్‌: ఈ చిత్రంలో మంచి ప్రేమకథతోపాటు అమ్మ ప్రేమను తెలియజెప్పే సెంటిమెంట్‌ కూడా వుంటుంది. మా డైరెక్టర్‌ మహేష్‌ సూర్య చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా హీరో కార్తీక్‌కి జన్మదిన శుభాకాంక్షలు.

కార్తీక్‌: ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ముందుగా థాంక్స్‌ చెప్తున్నాను. ఈ చిత్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేయడం జరిగింది. ఈ మూడు నెలలు ఎన్నో కష్టాలు పడినప్పటికీ ఫైనల్‌గా ఔట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. నేను కొత్తవాడినైనప్పటికీ సీనియర్‌ ఆర్టిస్టులు నాకు ఎంతో హెల్ప్‌ చేశారు. 

అనితానాథ్‌: మొహబ్బత్‌ మే అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో నేను హీరో తల్లి పాత్రలో నటించాను. ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినప్పటికీ ఇందులో నేను ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

మీనాక్షి భుజంగ్‌: ఇందులో 5 పాటలు వున్నాయి. అన్నీ సిట్యుయేషనల్‌ సాంగ్సే. ముఖ్యంగా ఈ చిత్రంలో అమ్మ పాట చాలా అద్భుతంగా వచ్చింది. యమలీల చిత్రంలో సిరులొలికించే.., నానిలో పెదవే పలికిన.. పాటల్లా ఈ చిత్రానికి కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.

కార్తీక్‌, హమీద, అనితానాథ్‌, సాయి, అరుణ్‌సింగ్‌, పవన్‌, ప్రదీప్‌, దినేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షి భుజంగ్‌, కెమెరా: శ్రీకాంత్‌ చిలుముల, డాన్స్‌: వంశీ, గోరా, ఫైట్స్‌: అంజిరెడ్డి, పాటలు: విజయేంద్ర, నిర్మాత: రమా రవిశంకర్‌, దర్శకత్వం: మహేష్‌ సూర్య. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs