మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫెరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తన కంటూ ఒక ఇమేజ్‌ను సొంత చేసుకున్నారు. 2014లో పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు చిత్రాల్లో నటించిన ఈ డైనమిక్ హీరో ప్రతి సినిమాలోనూ డిఫెరెంట్ లుక్, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అరిమ నంబి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌కి అమేజింగ్ రెస్పాన్సింగ్ వస్తుంది. నూతన సంవత్సరంలో జనవరి ఫస్ట్ రోజునే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ చేయబోతున్నారు. డిఫెరెంట్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం విష్ణుకి 2015 సంవత్సరంలో మరో హిట్ ఇస్తుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.