పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రంలో అంత్యాక్షరి సీన్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఆ సీన్‌లో నటించిన ఆర్టిస్టులతో తారా నీలు కార్పోరేషన్ పతాకంపై ఎం.ఎస్.బాబు స్వీయ దర్శకత్వంలో ‘గ్యాంగ్ ఆఫ్ గబ్బర్‌సింగ్’ పేరుతో పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మానస్, శ్వేతావర్మ జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం బాధ్యతలను కూడా ఎం.ఎస్.బాబు నిర్వహించడం విశేషం. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. విజయేందర్‌రెడ్డి ఆడియోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్న, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హేమాస్ మీడియా అధినేత కె.సురేష్‌బాబు, పద్మిని తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఎస్.బాబు: ఇప్పటివరకు 20 కార్పోరేట్ యాడ్స్‌తోపాటు 150 ఇతర కంపెనీల యాడ్స్ చేశాను. నేను స్వతహాగా పవన్‌కళ్యాణ్‌గారి అభిమానిని. ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఎస్.కె.మక్బూల్ నాకు బ్రదర్‌లాంటివాడు. ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేయడంలో మక్బూల్ ఎంతో సపోర్ట్ చేశాడు. ఒక మంచి సినిమా చేశానన్న సంతృప్తి నాకు కలిగింది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.
మానస్: పవన్‌కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్‌ని అయిన నేను ఈ చిత్రంలో గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. ఇది ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్. కామెడీని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఎంటర్‌టైన్ చేస్తుంది.
గోరటి వెంకన్న: ఈ సినిమాలో మంచి కథ, మంచి హాస్యంతోపాటు ఒక సందేశం కూడా వుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
మానస్, శ్వేతావర్మ, షకీలా, హరనాథ్, భవ్య, ఆంజనేయులు, బంటి, రిమ్‌సన్‌రాజ్, ప్రవీణ్, రమేష్, సాయి, లాల్ మధార్, శ్రావణ్, కుట్టిపాల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: గిరి దొసాడ, ఎడిటింగ్: ఉపేంద్ర, మేకప్: ఈశ్వర్, డాన్స్: ఆండ్రూస్‌పాల్, బ్రదర్ ఆనంద్, కో`ప్రొడ్యూసర్: ఎస్.కె.మక్బాల్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఎం.ఎస్.బాబు.