Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: L2 ఎంపురాన్


సినీజోష్ రివ్యూ:  L2 ఎంపురాన్ 

Advertisement
CJ Advs

ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తో 

ది పర్ ఫెక్షనిస్ట్ పృథ్వీరాజ్ మలయాళంలో తీసిన 

లూసిఫర్ ఎంత సక్సెస్ అయిందంటే 

మన మెగాస్టార్ చిరంజీవికి నచ్చి, మెచ్చి 

తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసేంత !

అదే లూసిఫర్ కి సీక్వెల్ ప్లాన్ చేసిన 

మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్

ఈసారి రీమేక్ చేసే ఛాన్స్ ఎవ్వరికి లేకుండా 

పాన్ ఇండియా సినిమా గా మలిచారు 

లూసిఫర్ సీక్వెల్ L2 ఎంపురాన్ ని !

అద్భుతమైన క్రేజ్ తో.. అనూహ్యమైన ఓపెనింగ్స్ తో 

నేడు థియేటర్స్ లోకి ఎంటర్ అయిన ఎంపురాన్ 

మరి ఏ మేరకు మేజిక్ చేసిందో మన రివ్యూలో తేల్చేద్దాం !

L2 ఎంపురాన్ - విధానం :

లూసిఫర్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడినుంచే ఎంపురాన్ కథ స్టార్ట్ అవుతుంది. పెంచిన తండ్రి మరణానంతరం రాష్ట్రాన్ని తమ్ముడు జితిన్ కి అప్పగించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు స్టీఫెన్. స్టీఫెన్ తమ్ముడు జితిన్ మాత్రం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న సందర్భంలో మరోసారి స్టీఫెన్ ఎంట్రీ ఇస్తాడు, స్టీఫెన్ తమ్ముడు జితిన్ ని దారిలో పెడతాడా, లేదంటే స్టీఫెన్ అధికారాన్ని తీసుకుని పరిస్థితులు చక్కదిద్దాడా, ఈ క్రమంలో స్టీఫెన్ కి ఆయన అనుచరుడు సయ్యద్ మసూద్ ఎలా సహాయపడ్డాడు అనేది ఎంపురాన్ షార్ట్ స్టోరీ. 

L2 ఎంపురాన్ - విచక్షణం :

ఒక కోట కట్టడానికి గట్టిగా పునాది వేసినట్టు సినిమా మొదలైన అరగంట దాటేవరకు ప్లాంటింగ్ సీన్స్ వేసుకుంటూ వెళ్లిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఎప్పుడెప్పుడా లాల్ సాబ్ ఎంట్రీ అని ఎదురు చూసిన ప్రేక్షకులకు ఎక్ట్రార్డినరీ ఎపిసోడ్ తో శాటిస్ఫై చేసేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలతో లాగించేసిన పృథ్వీ రాజ్ సెకండ్ హాఫ్ లో మోహన్ లాల్ తో మాయ చేస్తాడనుకుంటే.. ఒకొనొక సమయంలో ఎంపురాన్ రివెంజ్ డ్రామాగా మార్చేసాడా అనిపించకమానదు.  

L2 ఎంపురాన్ - విలక్షణం :

నటుడిగా మోహన్ లాల్ కి కొత్తగా వేసే మార్కులు లేవు, ఆయన ఎక్కని మెట్లు లేవు. కానీ ముఖ్యంగా ఈ చిత్రంతో ఎక్కువ మార్కులు కొట్టేసిందీ, మరిన్ని మెట్లు ఎక్కేసిందీ పృథ్వీరాజ్ సుకుమారన్. వీరి తర్వాత మంజు వారియర్, థొవినో థామస్ ల పాత్రాలు కీలకంగా కనిపిస్తాయి. ప్రారంభంలో అభిమన్యు విలన్ పాత్ర ఇంప్రెస్ చేసినా చివరికి వచ్చేసరికి అభిమన్యు పాత్ర రొటీన్ గా మార్చేసారు. 

L2 ఎంపురాన్ - విమర్శ:

బాహుబలి అనే టైటిల్ తో ఆ సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసారు రాజమౌళి. ఆపై KGF కానీ పుష్ప కానీ విక్రమ్ కానీ జైలర్ కానీ అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్స్ తో ప్యూర్ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతుంటే కొందరు ఎందుకో టైటిల్స్ విషయంలో సరైన శ్రద్ద తీసుకోవడంలేదు. ఇతర సినిమాలు, ఇతర విషయాలు వదిలేసి ఈ పర్టిక్యులర్ సినిమా విషయానికి వస్తే బేసిక్ గా లూసిఫర్ అనేది పాన్ ఇండియా టైటిల్. కానీ మరెందుకో మోహన్ లాల్ అండ్ పృథ్వీ రాజ్ జస్ట్ లూసిఫర్ 2 అనే టైటిల్ పెట్టి ఆ ఫ్రాంచైజీని ముందుకు తీసుకువెళ్లకుండా ఎంపురాన్ అనే మలయాళీ పదంతో ఇతర రాష్ట్రాల ప్రేక్షకులకి అర్ధం కాని టైటిల్ పెట్టారు. సినిమాకి టాక్ బావుండొచ్చు, సినిమాలో కంటెంట్ బావుండొచ్చు. ఏ సినిమాకి జనం థియేటర్స్ కి కదలాలి అంటే ఎంపురాన్ అనే పదం చెప్పగలమా, అర్ధం చేసుకోగలమా. 

L2 ఎంపురాన్ - విశ్లేషణ:

లూసిఫర్ సీక్వెల్ అనే క్రేజ్ తో ఆ ఇద్దరి ఉద్దండుల కలయికపై ఉన్న నమ్మకంతో అడ్వాన్స్ బుకింగ్స్ 60 కోట్లు దాటేశాయి. ఇక సినిమా స్క్రీన్ పైకి వచ్చాక ఆ విజువల్స్ ని, ఆ ఎలివేషన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. లూసిఫర్ ఫ్యాన్స్ ని కంటెంట్ వైజ్ కాస్త డిజప్పాయింట్ చేస్తుందేమో కానీ మోహన్ లాల్ అభిమానులు మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోతారు. కేరళ బాక్సాఫీస్ కి కొత్త రికార్డులు చూపిస్తారు అనేది ప్రస్తుతం వినిపిస్తోన్న రిపోర్ట్. 

పంచ్ లైన్: ఎంపురాన్ కాదు ఎంపరర్ !

సినీజోష్ రేటింగ్ : 2.5/5

Cinejosh Review L 2 Empuraan:

L 2 Empuraan Telugu Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs