Advertisement

డబుల్ ఇస్మార్ట్ మినీ రివ్యూ


డబుల్ ఇస్మార్ట్ మినీ రివ్యూ

Advertisement

ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టిన రామ్ - పూరి జగన్నాథ్ లకి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ రిజల్ట్ రాకపోవడంతో మరోసారి ఇద్దరూ పొత్తు కలిశారు. డబుల్ ఇస్మార్ట్ అంటూ సీక్వెల్ ఎత్తుకున్నారు. మ్యూజిక్ కోసం మణిశర్మనే పెట్టుకున్నారు. విలన్ గా సంజయ్ దత్ ని పట్టుకొచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశానని పూరీ - ప్రేక్షకులు కళ్లప్పగించి చూసేస్తారని రామ్ సినిమా ప్రమోషన్స్ లో గొప్పగా చెప్పుకొచ్చారు.  పాటలు, టీజర్లు, ట్రైలర్లు ఇస్మార్ట్ గానే అనిపించాయి.. ఈవెంట్లు, ఇంటర్ వ్యూలు ఘనంగానే జరిగాయి. మరి వారి స్టేట్ మెంట్ కి తగ్గ కమిట్ మెంట్ సినిమాలో కనిపించిందా.. ప్రేక్షకుడి టికెట్ డబ్బుకీ డబుల్ ఇస్మార్ట్ న్యాయం చేసిందా తేల్చేద్దాం ఈ మినీ రివ్యూ లో !

కొనసాగింపు కాదు.. కొత్త సాధింపు !

ఇస్మార్ట్ శంకర్ అనే మోడ్రన్ మొరటు క్యారెక్టర్ క్రియేట్ చేసి, అతని బ్రెయిన్ లో చిప్ చేర్చడం - మెమొరీ మార్చడం నేపథ్యంగా తొలి ప్రయత్నంలో హిట్టు కొట్టిన పూరి సీక్వెల్ కి కూడా అదే పంథాలో పయనించారు. ఈసారి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ మెమొరీని శంకర్ సంకలో పెట్టేసి పంపేస్తే పని అయిపోద్ది అనుకున్నారు కానీ, ఈమధ్య ఆడియన్స్ ఇంకా ఇస్మార్ట్ అయిపోయారనే విషయాన్ని విస్మరించారు. అందుకే తేడా కొట్టేసింది. నెగెటివ్ టాక్ వచ్చేసింది. అసలు బేసిక్ స్టోరీ థాట్ అనేదే బేస్ లెస్ గా ఉంటే దానికి చీప్ కామెడీ ట్రాక్ నీ, ఓవర్ ది బోర్డ్ సీన్స్ నీ, వల్గర్ థింగ్స్ నీ కలిపేసి కంగాళీ చేసేసిన పూరి ఎంతో ఊహించుకుని, ఊపుతో వెళ్లిన జనాన్ని ఉస్సూరుమనిపించారు. అందుకే ఇది ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపు కాదు, ప్రేక్షకులపై పూరి కొత్త సాధింపు అనే కామెంట్స్ పడుతున్నాయి సోషల్ మీడియాలో !

రామ్ తగ్గలేదు.. పూరి మారలేదు !

ఇస్మార్ట్ శంకర్ అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసాడా అన్నట్టు సరికొత్త స్లాంగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో ఫస్ట్ పార్ట్ లోనే బెస్ట్ ఇచ్చిపడేసిన రామ్ ఈ సీక్వెల్ లో ఇంకా చెలరేగిపోయాడు. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ ఏది చూసినా రామ్ ఎనర్జీ అనంతం అనిపించే రేంజ్ లో ఉంది. ఉన్నకొన్ని సెంటిమెంట్ సీన్స్ ని కూడా తన నటనతోనే నిలబెట్టాడు రామ్. కావ్య థాపర్ గ్లామరస్ గా కనిపించింది. గ్లామర్ నే చూపించింది. సంజయ్ దత్ నేమ్ క్యాస్టింగ్ స్ట్రెంగ్త్ పెంచింది. సంజయ్ దత్ ఇమేజ్ నార్త్ మార్కెటింగ్ కి పనికొచ్చింది. సినిమాలో మాత్రం ఆయన చేసిందేమీ లేదు. అఫ్ కోర్స్... అక్కడ చెయ్యడానికీ ఏమి లేదు. అలాగే పూరీ సినిమాల్లో ఆలీ కామెడీ ట్రాక్ అద్భుతం అనుకునే వాళ్లందరినీ అమ్మో, వామ్మో, వాయ్యో అనుకునేలా చేసిందీ డబుల్ ఇస్మార్ట్. ఇక ఇతర నటీనటులూ, ఆయా పాత్రలూ అన్నీ అంతంతే.. ఏ ఇంపాక్టు లేదంతే. మ్యూజిక్ వైజ్ మణిశర్మ, విజువల్స్ వైజ్ శ్యామ్ కె నాయుడు చేయగలిగింది చేసారు కానీ దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్ చెయ్యాల్సిందే సక్రమంగా చేయలేదు. తన స్థాయికి తగ్గ అవుట్ ఫుట్ ఇవ్వలేదు. లైగర్ రిజల్ట్ తో రియలైజ్ అయి ఉంటారు, తన పెన్ పవర్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారు అని ఆశించిన పూరి అభిమానులైతే నిరాశలో కూరుకుపోయారు.. సినిమా మిడిల్ లోనే థియేటర్స్ నుంచి వాకౌట్ చేసారు.

ఆడియన్స్ సేయింగ్ సారీ టు పూరి !

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అనిపించుకుని, అశేష అభిమానుల్ని పొందిన పూరి గత కొన్నేళ్ళుగా తనదైన మార్క్ నీ, స్పార్క్ నీ చూపించలేకున్నారు. లైగర్ వల్ల తగిలిన దెబ్బ డబుల్ ఇస్మార్ట్ విడుదలకి కూడా అవరోధంగా మారిన దశలో పూరీ తన సత్తా చాటుతారని, అన్నిటికీ సమాధానం ఇస్తారని అనుకుంటే మళ్ళీ సినిమా అంతటా ఆయనలోని నిర్లక్ష్య ధోరణే కనిపించింది. నిర్లిప్తతను మిగిల్చింది. ఇక ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇమేజ్ మాత్రమే కాపాడాల్సిన ఈ డబుల్ ఇస్మార్ట్ చిత్రం లాంగ్ వీకెండ్ రిలీజ్ ని ఎంతవరకూ క్యాష్ చేసుకుంటుందో, ఏ మేరకు రాబడుతుందో చూడాలి !

పంచ్ లైన్: డబుల్ ఇస్మార్ట్ - పూరి నీడ్స్ న్యూ స్టార్ట్ !

రేటింగ్ : 2.25/5

Double iSmart Movie Mini Review :

Double iSmart Movie Telugu review 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement