Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : స్కంద


సినీజోష్ రివ్యూ : స్కంద

Advertisement
CJ Advs

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

నటీనటులు : రామ్ పోతినేని, శ్రీ లీల, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, శరత్ లోహితాశ్వ, అజయ్ పూర్కర్ , ప్రభాకర్, పృథ్విరాజ్ తదితరులు   

సంగీతం : ఎస్.ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ : సంతోష్ డిటాకే

ఎడిటింగ్ : తమ్మిరాజు

సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్

నిర్మాత : శ్రీనివాస చిట్టూరి

రచన, దర్శకత్వం : బోయపాటి శ్రీను

విడుదల తేదీ : 28-09-2023

 

హై వోల్టేజ్ ఎనర్జీ కలిగిన కథానాయకుడు పోతినేని రామ్ - స్కై లెవెల్ హీరోయిజాన్ని చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను. 

ఈ ఇద్దరి కలయికే అంచనాలను పెంచేసింది. సరికొత్త సంచలనానికి సంకేతం ఇచ్చింది. స్కంద చిత్రంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్ తో టెంప్ట్ చేసి.. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసి కల్ట్ జాతర అనే క్యాప్షన్ తో ఊరిస్తూ వచ్చిన స్కంద చిత్రంలో యాక్షన్ డ్రామా స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను మోస్ట్ ఎనర్జిటిక్ హీరో రామ్ ని ఎలా ప్రెజెంట్ చేసారో.. ఎటువంటి కథను తెరపైకి తెచ్చారో రివ్యూలో చూద్దాం.!

స్టోరీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూతురి వివాహం జరుగుతుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు వచ్చి ఆమెని తీసుకు వెళ్ళిపోతాడు. ఏంటీ.. దిమ్మ తిరిగిందా ? అదే మరి బోయ మార్క్ సెన్స్ లెస్ మాస్ అంటే.! ఆ ఇన్సిడెంట్ తరువాత ఒకరిపై ఒకరు పగతో రగిలిపోతూ వుంటారు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఆ సమయంలో ఆంధ్రా సీ ఎం ఓ కత్తిలాంటి క్యాండిడేట్ (రామ్)ని రంగంలోకి దింపుతాడు. ఆ పవర్ ఫుల్ పర్సన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంట్లోకి ఎలా వెళ్ళాడు, ఏం చేసాడు, ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలను కిడ్నాప్ చేసి రుద్రరాజపురం ఎందుకు తీసుకెళ్లాడు, అక్కడ ఉన్నదెవరు, అసలీ సంఘటనలకీ క్రౌన్ గ్రూప్ కంపెనీస్ అధినేతకీ ఉన్న సంబంధం ఏమిటీ అన్నదే స్కంద సబ్జెక్ట్. ఎంత సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా అంతకు అంతా వాస్తవ విరుద్ధంగా అనిపించే ఈ కథని జస్ట్ బోయపాటి మార్క్ మాస్ మసాలా డిష్ గా చూస్తే టార్గెటెడ్ ఆడియన్సుకి టేస్టీ గానే అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే ని అంత పర్ ఫెక్ట్ ఫార్ములాలో పెట్టారు బోయపాటి. 

స్క్రీన్ ప్లే : మాస్ ని బాగా మెప్పించే యాక్షన్ డ్రామాస్ తీర్చిదిద్దడంలో సిద్దహస్తుడనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆ క్రెడిబిలిటీకి తగ్గట్టుగానే కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అఖండ వంటి ఘన విజయం తరువాత రామ్ వంటి యంగ్ హీరోతో జత కట్టినా తన టెంప్లేట్ నే ఫాలో అవుతూ, తన మార్క్ మాస్ మసాలా ఫిలింగానే మలిచారు స్కందని. నిజానికి స్టోరీ లైన్ గా వినడానికే విడ్డూరంగా అనిపించే ఈ స్కంద కథని నా సినిమాలింతే.. ఇలాగే వుంటాయి అనే సాలిడ్ స్టేట్ మెంట్ ఇచ్చేలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో రాసేసి తీసేసారు బోయపాటి. మరి కథగా విసిగించినా, కథనంతో ఆకట్టుకునే స్కంద స్క్రీన్ ప్లే విషయానికి వస్తే... 

క్రౌన్ గ్రూప్ కంపెనీస్ అధినేత రామకృష్ణంరాజు పాత్రతో సినిమాని ప్రారంభించి, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వైరాన్ని రగిల్చి, అప్పుడు అసలు కథానాయకుడిని తనదైన ఊర మాస్ తరహాలో తెరపైకి తెచ్చిన బోయపాటి - హీరో, హీరోయిన్ల మధ్య కాలేజ్ డ్రామా నడుపుతూనే ఆసక్తికరమైన మలుపులతో ప్రథమార్ధాన్ని లాగించేసారు. బోయ మార్క్ ఇంటర్వెల్ బ్లాక్ లో అయితే రామ్ మరింత రెచ్చిపోయాడు. ఇక అసలు కథ కలిగిన ద్వితీయార్ధాన్ని భావోద్వేగాలతో నింపే ప్రయత్నం చేసారు బోయపాటి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని పకడ్బందీగా రాసుకోవడంతో బాటు పతాక సన్నివేశాల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను శాటిస్ ఫై చేయడమే కాకుండా స్కంద సీక్వెల్ ఉంటుందంటూ అనౌన్స్ చేసి టాలీవుడ్ లో మరో కొత్త ఫ్రాంచైజీకి శ్రీకారం చుట్టారు. 

ఎఫర్ట్స్ : మాంఛి మాస్ డైరెక్టర్ చేతిలో పడడంతో మరింత చెలరేగిపోయిన రామ్ ఆన్ స్క్రీన్ చెడుగుడు ఆడేసాడు. ఇటు తెలంగాణ స్లాంగ్, అటు రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్ చెబుతూ ఆశ్చర్యపరిచే రామ్ ఎనర్జీ - డ్యాన్సుల్లో డబుల్ అయింది. ఫైట్స్ లో పీక్స్ కి వెళ్ళింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం రామ్ మేకోవర్ రియల్లీ సూపర్బ్ అని చెప్పాలి. మొత్తానికి మాస్ హీరోగా మరో రెండు రెట్లు క్రేజ్ పెంచి, నటుడిగా ఇంకో నాలుగు మెట్లు ఎక్కేసాడు అనేలా ఉంది స్కందలో రామ్ పర్ ఫార్మెన్స్. శ్రీలీల పాత్ర పరిధి తక్కువే ఉన్నా ఉన్నంతలో ఉనికిని చక్కగా చాటుకుంది. చలాకీ స్టెప్పులతో తన స్పెషాలిటీ చూపుకుంది. పల్లెటూరి పాటలోను, కథకి కీలకమైన మలుపులోనూ సయీ మంజ్రేకర్ మెరిసింది. సీనియర్ హీరో శ్రీకాంత్ పాత్రకి తగ్గట్టు సెటిల్డ్ గా నటించారు. గౌతమి, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, ప్రభాకర్ వంటి వారితో పాటు పలు ఇతర పాత్రల్లో మనకు అంతగా పరిచయం లేని నటులు కనిపించినా అందరూ దర్శకుడి సూచనల మేరకు ఒదిగిపోయి నటించేసారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్సుకి థమన్ తనదైన దరువేశాడు. అయితే BGM వరకు ఓకే కానీ పాటల విషయంలో పూర్తి సంతృప్తి కలగదు ప్రేక్షకులకి. సినిమాటోగ్రాఫర్ సంతోష్ దేటకే టాకీ పార్ట్ కంటే యాక్షన్ పార్ట్ పిక్చరైజెషన్ కే ఎక్కువ కష్టపడి ఉంటారు. బట్ ఓవరాల్ గా క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చారు. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్స్.. ఇలా అన్ని డిపార్టుమెంట్స్ డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు సపోర్ట్ చేసాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పాన్ ఇండియా సినిమా కనుక కాంప్రమైజ్ అయ్యేదే లేదు అన్నట్టున్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను తెరపై మరోమారు మాస్ జాతర జరిపించారు. ప్రెడిక్టబుల్ కథలతోనే అన్ ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ రాబట్టే బోయపాటి ఈసారి మరీ ఇల్లాజికల్ కథని ఎంచుకున్నారు కానీ దర్శకుడిగా తన సామర్ధ్యంతో సక్సెస్ ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేసారు.. టార్గెటెడ్ ఆడియన్సుని సంతృప్తి పరిచేసారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మతి పోగొట్టే హీరో ఎలివేషన్స్ ఇవ్వడంలో తన మార్క్ అనేది మళ్ళీ ఘనంగా ప్రూవ్ చేసుకున్నారు.

ఎనాలసిస్ : అస్సలు కన్విన్సింగ్ గా అనిపించని కథే అయినా.. మాస్ ఆడియన్సుని కట్టిపడేసే అంశాలు స్కందకి బలం. బేసిక్ గానే బోయపాటి సినిమాలకు మొదట విమర్శలు వినిపించడం, పెదవి విరుపులు కనిపించడం కామన్ అయిపోయింది. అందులోనూ స్కందలో ఉన్న పొలిటికల్ సెటైర్లు, కొన్ని పాత్రలు ఓ వర్గాన్ని మరింత ఉడికించేలా ఉన్నాయి కనుక వాళ్ళ వేదన, రోదన గట్టిగానే ఉండొచ్చు. కానీ గత సినిమాలన్నీ చూసుకోండి, రేటింగ్స్ తో సంబంధం లేకుండా రెవెన్యూ రాబట్టడం బోయపాటి సినిమాల నైజం... స్కంద సినిమాకీ అదే తథ్యం అంటోంది ఫస్ట్ డే ట్రేడ్ రిపోర్ట్.

చూద్దాం. కల్ట్ జాతర అంటూ వచ్చిన స్కందకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో.. ఈ తరహా చిత్రాలకు రాజపోషకులైన మాస్ ప్రేక్షకులు స్కందకి ఎంతటి ఫలితం అందిస్తారో.!

సినీజోష్ రేటింగ్ : 2.5/5

పంచ్ లైన్ : బోయపాటి మార్క్ మాస్ ట్రీట్ !

Cinejosh Review : Skanda:

Skanda movie telugu review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs