Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : మిస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి


సినీజోష్ రివ్యూ : మిస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి

Advertisement
CJ Advs

బ్యానర్ : యువీ క్రియేషన్స్

నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళి శర్మ, కేశవ్ దీపక్, అభినవ్ గోమఠం, నాసర్, తులసి తదితరులు

సినిమాటోగ్రఫీ : నీరవ్ షా

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

మ్యూజిక్ : రథన్ - గోపి సుందర్

నిర్మాతలు : వంశీ కృష్ణ - ప్రమోద్  

కథ - దర్శకత్వం : మహేష్ బాబు

రిలీజ్ డేట్: 07-09-23

ఏరి కోరి కథలు ఎంచుకునే అనుష్క శెట్టి

ఆచి తూచి అడుగులేసే నవీన్ పొలిశెట్టి

ఇద్దరికీ ఓ కథ నచ్చిందంటే అందులో విషయం వుంటుందని అంతా నమ్మారు.

వీరి విచిత్రమైన కలయికని వెండి తెరపై వీక్షించేందుకు వేచి చూసారు.

ఎప్పుడో ఎనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ఎన్నో కారణాల వల్ల డిలే అవుతూ వచ్చినా

అనుష్క - నవీన్ గుడ్ విల్ ఈ సినిమా క్రేజ్ ని కాపాడుతూ వచ్చింది.

అనుష్క అందుబాటులో లేకున్నా నవీన్ పొలిశెట్టి గట్టిగా చేసిన ప్రమోషన్స్

మూవీ రిలీజ్ టైమ్ కి కావాల్సిన బజ్ తెచ్చింది.

మొత్తానికి ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయింది కనుక... టీజర్ అండ్  ట్రైలర్ లోనే సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లియర్ గా చెప్పేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆన్ స్క్రీన్ అదనంగా ఏం ఆఫర్ చేసారో.. ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసారో రివ్యూలో చూద్దాం.

స్టోరీ : లండన్ లోని స్టార్ హోటల్ లో వర్క్ చేసే చెఫ్ అన్విత శెట్టి (అనుష్క) కి ప్రేమ, పెళ్లి అనే రిలేషన్ షిప్స్ పై ఏ మాత్రం నమ్మకం ఉండదు. తన తల్లి (జయసుధ)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నవాడు మోసం చేసాడనే రీజన్ తో మొండిగా మారిపోయిన అన్విత ఆమె తల్లి మరణం తరువాత ఒంటరిది అయిపోతుంది. ఆ ఒంటరితనం పోగొట్టుకోవడానికి తోడు కోరుకుంటుంది. అలాగని అది ప్రేమో, పెళ్ళో, భర్తో కాదు. IUI ద్వారా బిడ్డని పొందాలి అనే డెసిషన్ తీసుకుంటుంది. సరైన స్పెర్మ్ డొనేటర్ కోసం చూస్తున్న సమయంలో అన్వితకి స్టాండప్ కమెడియన్ సిద్దు పొలిశెట్టి (నవీన్ పొలిశెట్టి ) ఎదురవుతాడు. అతని క్వాలిటీస్ నచ్చి అన్విత సిద్ధుకి దగ్గర అవుతుంది. సిద్దు అది ప్రేమ అనుకుని పొంగిపోయి ప్రపోజ్ చేసేస్తాడు. అప్పుడు అన్విత అసలు విషయం చెప్పేసరికి షాక్ అయిన సిద్దు రివర్స్ అవుతాడు. మరి అన్విత సిద్దు కోసం తన అభిప్రాయం మార్చుకుందా.. లండన్ వెళ్లిపోయిన అన్వితను సిద్దు కలవగలిగాడా.. ఆమె మనసు మార్చగలిగాడా అన్నదే సింపుల్ గా శెట్టి - పొలిశెట్టిల స్టోరీ.

స్క్రీన్ ప్లే : ప్రేమ, పెళ్లి అంటే విసుక్కునే అమ్మాయికి.. విశ్వసించే అబ్బాయికి మధ్య జరిగే కథగా కాస్త బోల్డ్ కంటెంట్ రంగరించి మరీ అల్లుకున్న కథనం ఇది. అనుష్క, జయసుధల పాత్రలతో ఈ కథకి కావాల్సిన ప్లాంటింగ్ వేసుకుంటూ మొదటి 15 నిముషాలు నిదానంగా సాగిన దర్శకుడికి తన ఎంట్రీ నుంచే స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చేసాడు నవీన్ పొలిశెట్టి. అటు స్టాండప్ కమెడియన్ గా తన స్పార్క్ చూపించి నవ్విస్తూనే ఇటు అనుష్క కాంబినేషన్ ట్రాక్ లో తన మార్క్ పర్ ఫార్మెన్స్ తో ఆడియెన్సుని కట్టిపడేసాడు. ఏ ఎపిసోడ్ అయినా ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ అంటూ చక చకా చలాకీగా సాగిపోయిన ఫస్టాఫ్ ఫుల్ ఫన్ రైడ్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది ఆడియన్సుకి. ఇక కాసేపు ఎమోషనల్ గా.. మరి కాసేపు ఎంటర్ టైనింగ్ గా సాగే సెకండ్ హాఫ్ రోలర్ కోస్టర్ ఫీల్ ఇచ్చినా క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులకు కావాల్సిన కంప్లీట్ నెస్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా ఓహో అనిపించకపోయినా వన్ టైమ్ వర్త్ వాచ్ అనిపించుకునే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కి మరీ వెరీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే మైనస్ అనే చెప్పాలి.

ఎఫర్ట్స్ : అన్విత పాత్రలో అనుష్క హుందాగా ఒదిగిపోయింది. ఆమె డిగ్నిఫైడ్ యాక్టింగ్ ఆ క్యారెక్టర్ బలాన్ని పెంచింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో స్వీటీ సెటిల్డ్ నటన చాలామందికి ఓ లెసన్ లాంటిది. సిద్దు రోల్ లో అయితే నవీన్ మరింత చెలరేగిపోయాడు. తను తప్ప ఇంకెవ్వరూ.... అనే రేంజ్ లో ఆ పాత్రని అద్భుతంగా పోట్రెయిట్ చేసాడు. అనుష్క - నవీన్ ల మధ్య వచ్చే ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయింది. జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, అభినవ్ గోమఠం తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

నీరవ్ షా విజువల్స్ , రథన్ సాంగ్స్ సినిమా సోల్ ని సవ్యంగా తెరపైకి తెస్తే ఆ అనుభూతికి గోపి సుందర్ BGM అదనపు హంగులా మారింది. దర్శకుడు మహేష్ బేసిక్ కాన్సెప్ట్ లో బోల్డ్ థాట్ ఉన్నప్పటికీ.. ఎక్కడా తప్పు చేయకుండా, తప్పటడుగులు వేయకుండా క్లీన్ ఫ్యామిలీ ఫిలిం ఇచ్చే ప్రయత్నమే చేసాడు. అయితే కథకి మరింత స్ట్రెంగ్త్ ఇచ్చే ఎలిమెంట్స్ రాసుకుని వుంటే శెట్టి - పొలిశెట్టిల సౌండ్ బాక్సాఫీస్ దగ్గర మరింత గట్టిగా వినపడేది.

ప్లస్ పాయింట్స్ :

అనుష్క డిగ్నిఫైడ్ పర్ ఫార్మెన్స్

నవీన్ క్రేజీ కామెడీ టైమింగ్

బేసిక్ స్టోరీ కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్ :

నిదానంగా సాగిన ఆరంభం

భారంగా కదిలిన ద్వితీయార్ధం

ఎనాలసిస్ : మిస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి చుసిన వాళ్లంతా పాజిటివ్ రెస్పాన్సే ఇవ్వొచ్చు కానీ.. ఇకపై ఈ శెట్టి - పొలిశెట్టి కోసం ఎంతమంది థియేటర్స్ వైపు కదులుతారు అనేదానిపైనే సినిమా రిజల్ట్ డిపెండ్ అయి ఉంది. భారీ బాలీవుడ్ సినిమాతో పోటీ పడుతూ రిలీజ్ కి వచ్చింది, మంచి స్పందనే సంపాదించింది కానీ సాలిడ్ కమర్షియల్ సినిమా ముందు ఈ సాఫ్ట్ ఫిల్మ్ ఎంతవరకు స్కోర్ చేయగలదు అనేది వేచి చూడాలి. ఆపై OTT లో మాత్రం శెట్టి కి పొలిశెట్టి కి ప్రేక్షకులు గట్టిగానే పట్టం కట్టేస్తారు. కన్ ఫర్మ్.!

సినీజోష్ రేటింగ్ : 2.75/5

పంచ్ లైన్ : Miss విభిన్నం Mister వినోదం

Cinejosh Review: Miss Shetty Mr. Polishetty :

Miss Shetty Mr. Polishetty Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs