Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : ఖుషి


సినీజోష్ రివ్యూ : ఖుషి

Advertisement
CJ Advs

బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్ 

నటీనటులు : విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు 

మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్

ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి 

సినిమాటోగ్రఫీ : మురళి జి 

నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవి శంకర్ 

దర్శకుడు :శివ నిర్వాణ

రిలీజ్ డేట్ 01-09-2023 

దెబ్బ తిన్న లైగర్.. విజయ్ దేవరకొండ 

షాక్ తగిలిన శాకుంతల.. సమంత 

లక్ లేని టక్ జగదీష్.. శివ నిర్వాణ 

ముగ్గురూ కలిశారు. కసిగా కదిలారు. ఖుషీకి శ్రీకారం చుట్టారు. 

అనారోగ్యం పరీక్షిస్తున్నా సమంత పట్టుదల ప్రదర్శించింది. 

పరిస్థితి అర్ధం చేసుకున్న విజయ్ దేవరకొండ సహనంతో వ్యవహరించి నిబద్దత చూపించాడు. 

అనుకోకుండా పెరిగిన నిర్మాణ సమయాన్ని సైతం సద్వినియోగం చేస్తూ సందర్భోచితంగా సాగే పాటలన్నిటినీ స్వయంగా దర్శకుడు శివ నిర్వాణ రాసేశారు. ఈ త్రయానికి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు అండగా నిలిచారు. అలా రూపొందిన ఖుషి చిత్రం మొదటినుంచీ చార్ట్ బస్టర్స్ సాంగ్స్ తో ట్రెండింగ్ లో వుంటూ, టీజర్ తో ఒప్పించి, ట్రైలర్ తో మెప్పించి మంచి అంచనాలను ఏర్పరుచుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ - సమంతల జోడీ ప్రత్యేక ఆకర్షణగా తెరకెక్కిన ఖుషి నేడు విడుదలైన నేపథ్యంలో ప్రేక్షకులను ఏ మేరకు ఖుషి చేస్తోందో సమీక్షలో చూద్దాం.!

స్టోరీ : BSNL లో JTO గా జాయిన్ అయిన విప్లవ్ (విజయ్ దేవరకొండ) తన విధుల నిర్వహణకై ఏరికోరి కశ్మిర్ ని ఎంచుకుంటాడు. అక్కడ తారసపడ్డ ఆరా బేగం (సమంత)తో లవ్ లో పడతాడు. తాను పాకిస్థానీ అని చెప్పిన వినకుండా, ఆమె కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు కూడా విప్లవ్ సిద్దపడిపోవడం ఆరాను ఇంప్రెస్ చేస్తుంది. ఇక్కడివరకు ఆహ్లాదంగా సాగిపోయే ఈ ప్రేమకథకు అడ్డం పడతారు వాళ్ళ పెద్దలు. ఒకరిది ఆస్తిక కుటుంబం అయితే మరొకరిది నాస్తిక కుటుంబం. ఇలాంటి భిన్న వాతావరణంలో పెరిగిన ఇద్దరు పెళ్లి చేసుకుని కలిసి ఉండడం కష్టం అని తేల్చేస్తారు. కానీ తమ ప్రేమ బలమైనది అంటూ పెద్దలను ఎదిరించి ఒక్కటైన జంట పెళ్లి తరువాత అంతే ప్రేమగా ఉండగలిగారా, లేక వారి పెద్దల అభిప్రాయాన్ని నిజం చేశారా అన్నదే క్లుప్తంగా ఖుషి కథ. 

స్క్రీన్ ప్లే : లవ్ స్టోరీస్ ని హ్యాండిల్ చేయడంలో తన నైపుణ్యాన్ని చూపుతూ చక్కని టేక్ ఆఫ్ తీసుకుని ప్రథమార్ధం పరుగులు పెట్టించారు దర్శకుడు శివ నిర్వాణ. ఓవైపు కశ్మిర్ అందాలు తెరపై కనువిందు చేస్తోంటే.. మరోవైపు విజయ్ దేవరకొండ - సమంతల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్సుని కట్టిపడేస్తుంది. ఇంకోవైపు వెన్నెల కిషోర్ ట్రాక్ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. ఇలా లవ్ స్టోరీ వరకూ కూల్ గా ఖుషీ పంచేసిన కథకు కరెక్ట్ కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ చేయడంలో మాత్రం దర్శక రచయిత తడబడ్డాడు. ఆస్తికత్వాన్ని - నాస్తికత్వాన్ని ప్రేమకు ముడిపెట్టడం, పెళ్ళికి అడ్డు పడ్డం అంత గొప్పగా అనిపించవు. దాంతో సెకండాఫ్ లో స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. స్క్రీన్ ప్లే లో ల్యాగ్ పెరిగిపోయింది. అయితే క్లైమాక్స్ పోర్షన్ లో మాత్రం తన కలం బలం చాటుకుంటూ ఖుషి చిత్రాన్ని డీసెంట్ అటెంప్ట్ గా నిలుపుకున్నారు శివ నిర్వాణ. 

ఎఫర్ట్స్ : లైగర్ తో భంగపడ్డ విజయ్ దేవరకొండ బ్యాక్ టు ఓన్ ట్రాక్ అంటూ లవ్ స్టోరీ చూజ్ చేసుకోవడమే కాకుండా ప్రేమికుడి లుక్స్ కి పర్ ఫెక్ట్ గా మౌల్డ్ అయిపోవడం హర్షించదగ్గ అంశం. తనదైన స్టైలిష్ పర్ ఫార్మెన్స్ తో అడుగడుగునా ఆకట్టుకున్నాడు విజయ్. సమంత సెటిల్డ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రేమకథకు తగ్గట్టుగా విజయ్ తో కలిసి కరెక్ట్ కెమిస్ట్రీని చూపించింది కానీ పలు సన్నివేశాల్లో ఆమెలోని మానసిక అలసట తెరపై తెలిసిపోయింది. నాస్తికుడిగా సచిన్ ఖేడేకర్, ప్రవచనకర్తగా మురళి శర్మ కీలక పాత్రలు పోషించారు. జయరాం, రోహిణి, శరణ్య, లక్ష్మి వంటి నటీనటులు పాత్రచితంగా అభినయిస్తే.. ఫస్టాఫ్ లో వెన్నెల కిశోర్ - సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణ ఆడియన్సుని ఆహ్లాదపరిచే భాద్యత తీసుకున్నారు. బ్రహ్మానందం, ఆలీ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితర నటులు ప్రాధాన్యత లేని పాత్రల్లో ప్రభావం చూపలేక పోయారు. టెక్నీషియన్సులో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు సినిమాటోగ్రాఫర్ మురళి - మ్యూజిక్ డైరెక్టర్ హీషమ్. ఇటు చార్ట్ బస్టర్స్ సాంగ్స్ తో పాటు పర్ ఫెక్ట్ BGM తో హీషమ్ అదరగొడితే.. కశ్మీర్, టర్కీ వంటి అవుట్ డోర్ అందాలనే కాక ఇండోర్ లో పెట్టిన ప్రతి ఫ్రేమ్ ని కూడా కలర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసి శెభాష్ అనిపించుకున్నారు మురళి. బేసిక్ గానే సెకండాఫ్ లో మేటర్ వీక్ కనుక  ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ని ఏమీ అనలేం కానీ డైరెక్టర్ ని కన్విన్స్ చేసి అయినా ల్యాగ్ తగ్గించుంటే బాగుండేది. ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీ గా ఖుషిని మలచడంలో శివ నిర్వాణ తన ప్రత్యేకతను ప్రూవ్ చేసుకున్నారు. ఎస్పెషల్ల్లీ లిరిక్ రైటర్ గా తన టాలెంట్ నూటికి నూరు మార్కులు వేయించుకుంటుంది. అయితే పాటల్లోని పదాల అల్లికపై పెట్టిన శ్రద్ద - కథకి తగ్గ కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ చేయడంపై, కథనంలోని సాగతీత తగ్గించడంపై కూడా పెట్టి ఉంటే ఫలితం మరింత గట్టిగా వచ్చేది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్థాయికి తగ్గట్టే నిర్మాణ విలువలు ఉత్తమంగా ఉన్నాయి. 

ఎనాలసిస్ : తొలి సగం ప్రేమికుల కథగా - మలి సగం దంపతుల కథగా సాగే ఖుషి చిత్రం మొత్తం ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. కథనం కూడా ఈ మధ్యే వచ్చిన పలు చిత్రాలను గుర్తు చేస్తుంది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్, వండ్రఫుల్ విజువల్స్, మెలోడియస్ మ్యూజిక్, విజయ్ - సమంతల పెయిర్ ఖుషీకి మెయిన్ ఎస్సెట్స్ అయితే.. వీక్ స్టోరీ, స్లో పేస్ స్క్రీన్ ప్లే మైనస్ లుగా మారాయి. మరి ఓవరాల్ గా వన్ టైమ్ వాచ్ అనిపించుకునే ఖుషీకి బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఏ రేంజ్ రిజల్ట్ దక్కుతుంది అనేది క్లాస్ ఆడియన్సు రిసీవింగ్ పైనే డిపెండ్ అయి వుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం.

విజయ్ దేవరకొండ ప్రీవియస్ ఫిలిం లైగర్ కంటే... 

సమంత ప్రీవియస్ ఫిలిం శాకుంతలం కంటే... 

శివ నిర్వాణ ప్రీవియస్ ఫిలిం టక్ జగదీష్ కంటే... 

చాలా చాలా బెటర్ ఫిలిం ఖుషి.!

సినీజోష్ రేటింగ్ : 2.5/5

పంచ్ లైన్ : ఖుషి - లీడ్ పెయిర్ క్యూట్ కెమిస్ట్రీ 

Cinejosh Review : Kushi:

kushi (2023) Movie Telugu review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs