Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: రైటర్ పద్మభూషణ్


సినీజోష్ రివ్యూ: రైటర్ పద్మభూషణ్ 

Advertisement
CJ Advs

నటీనటులు: సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర 

సినిమాటోగ్రఫీ: వెంకట్ శేఖమూరి   

ఎడిటింగ్: పవన్ కళ్యాణ్, సిద్దార్థ్

నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చందు మనోహరన్  

దర్శకుడు: షణ్ముఖ ప్రశాంత్ 

రిలీజ్ డేట్: 03-02-2023

చాయ్ బిస్కెట్ చేసిన వీడియోతో పాపులర్ అయిన సుహాస్ కమెడియన్ గా వెండితెరకి ఎంట్రీ ఇచ్చి కలర్ ఫోటోతో లీడ్ యాక్టర్‌గా మారిపోయాడు. ఫ్యామిలీ డ్రామా తో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. సుహాస్ తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. చాయ్ బిస్కెట్ ఫిలింస్‌పై అనురాగ్ మరియు శరత్‌లు సుహాస్‌తో ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని తెరకెక్కించారు. రైటర్ పద్మభూషణ్ ప్రమోషన్స్ తోనే సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగేలా చేసారు. అంతేకాకుండా మేకర్స్ సినిమాపై ఉన్న నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమైన సిటీస్ లో ప్రత్యేక ప్రీమియర్లను నిర్వహించి, సినిమాకు పాజిటివ్ వైబ్ తీసుకురావడంలో విజయం సాధించారు. స్పెషల్ ప్రీమియర్స్, భారీ ప్రమోషన్స్ తో పాజిటివ్ బుజ్ తో రిలీజ్ అయిన ఈ చిత్రంపై ఆడియన్స్ రియాక్షన్ ఏమిటో సమీక్షలో చూసేద్దాం..

రైటర్ పద్మభూషణ్ కథ:

లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న పద్మభూషణ్ (సుహాస్) రైటర్. అతను తన స్వంత పుస్తకం తొలి అడుగుని ప్రచురించాడు, కానీ ఆ పుస్తకంతో అతనికి ఎటువంటి గుర్తింపు రాదు. అయినప్పటికీ పద్మభూషణ్ పెద్ద రచయిత కావాలని కలలుకంటూ ఉంటాడు. అందుకే ఆ పుస్తకం అందరికి చేరాలని ప్రయత్నం చేస్తాడు. దానిని ప్రచారం చెయ్యాలనే కసితో అప్పులు చేసి వడ్డీలు కట్టలేక అప్పులపాలవుతాడు. కానీ పద్మ భూషణ్ తాను రాయని పుస్తకంతో పేరు తెచ్చుకుంటాడు. అదే పేరుతొ ఓ బ్లాగ్ కూడా ఓపెన్ అవుతుంది. దానికీ పేరొస్తుంది. అదే సమయంలో పద్మభూషణ్ కి మేనమావ కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అటు తాను రాయని పుస్తకంతో వచ్చిన పేరుని అనుభవించడం స్టార్ట్ చేసి మేనమావ కూతురితో పెళ్ళికి సిద్దమవుతాడు. కానీ నిశ్చితార్ధం సమయానికి అతనిపేరుమీద వస్తున్న బ్లాగ్ లో వరసగా వస్తున్న కథనాలు ఆగిపోవడంతో.. అసలు కథ మొదలవుతుంది. అసలు పద్మభూషణ్ పేరు మీద ఆ పుస్తకం ప్రచురించింది ఎవరు? తన పేరు మీద బ్లాగ్ ఓపెన్ చేసింది ఎవరు? తనకు కాబోయే భార్యకి జరిగింది పద్మభూషణ్ చెప్పగలిగాడా? ప్రేమించిన అమ్మాయితో పద్మభూషణ్ పెళ్లి జరిగిందా? అనేది క్లుప్తంగా రైటర్ పద్మభూషణ్ కథ.

రైటర్ పద్మభూషణ్ స్క్రీన్ ప్లే:

పెద్ద రైటర్ కావాలని కలలు కనే కాన్ఫిడెన్స్ లేని టైటిల్ పాత్రలో సుహాస్ ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు. తన అమాయకత్వం, గందరగోళం అన్ని నిజజీవితానికి దగ్గరగా చూపించాడు. సారిక పాత్రలో టీనా శిల్పా రాజ్ యావరేజ్ గా కనిపించింది. ఆమె పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉన్నా.. టీనా ఆ పాత్రలో తేలిపోయింది. కాస్త పేరున్న హీరోయిన్ ని ఎంపిక చేసినట్లయితే బావుండేది అనిపిస్తుంది. కన్న పాత్రలో గౌరీ ప్రియ కీలక పాత్ర పోషించింది. ఆమె గ్లామర్ గా కనిపించడం మాత్రమే కాదు పెరఫార్మెన్స్ పరంగాను ఆకట్టుకుంది. రోహిణి మొల్లేటి సుహాస్ తల్లి పాత్రలో తండ్రి పాత్రలో ఆశిష్ విద్యార్థి ఫ్రెష్ గా కనిపించారు.. మిగతావారు తమపరిధిమేర ఆకట్టుకున్నారు.  

సాంకేతిక నిపుణుల సమీక్ష

శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరామ్యాన్ వెంకట్ శేఖమూరి  విజయవాడ, కాకినాడలని మరింత అందంగా చూపించారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ షార్ప్ గా ఉండాలి. సినిమా చాలా వరకు స్లో గా అనిపిస్తుంది. చాయ్ బిస్కెట్ మరియు లహరి చిత్రాల నిర్మాణ విలువలు బావున్నాయి.

ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించిన షణ్ముఖ ప్రశాంత్ ఒక రిలేటబుల్ పాయింట్‌ను మెయిన్ స్టోరీగా తీసుకొని దాని చుట్టూ రైటర్ పద్మభూషణ్ కథను అల్లారు. రచయితగా పేరు తెచ్చుకోవాలని ఆరాటపడే మధ్యతరగతి యువకుడి కథ రైటర్ పద్మభూషణ్. హీరో పాత్రని అమాయకత్వంతో డిజైన్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు మలుపులతో ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో తన పుస్తకాన్ని పాఠకులతో చదివించడానికి పడే పాట్లు, హీరో తల్లితండ్రుల మధ్యన వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎవరూ చదవక కాపీలు వెనకకి తెచ్చుకునే సన్నివేశాలు ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గడం, సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. అప్పటివరకు హాయిగా సాగిన సినిమా అప్పుడు సాగదీత మొదలైంది. సెకండాఫ్‌లో గందరగోళం ఏర్పడిన తరుణంలో దర్శకుడు తను చెప్పాలనుకున్న అసలు పాయింట్‌ని చూపించాడు కానీ, అప్పటికి చాలా ఆలస్యం అయ్యింది. దానితో క్లైమాక్స్ బావున్నా.. కథ, కథనాల విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ద తీసుకుంటే బావుండేది.

రైటర్ పద్మభూషణ్ ఎనాలసిస్: 

కమెడియన్ గా సీరియస్ పాత్రలతోను నవ్వించగల సుహాన్ కలర్ ఫొటోతో ఎమోషనల్ గా ఎలా ఉంటాడో చూపించాడు. ఫ్యామిలీ డ్రామాలో నవ్వించాడు, రైటర్ పద్మభూషణ్ గా నవ్వించాడు, అమాయకత్వంతో కవ్వించాడు. దర్శకుడు కొత్త కథని తీసుకుని సుహాస్ ని కథానాయకుడిగా ఎంపిక చేసి సగం సక్సెస్ అయ్యాడు. కథలో కామెడీ కనిపించినతసేపు ఆహ్లాదంగా మారిన థియేటర్స్, కామెడీ మిస్ అయ్యి కథనం స్లో అవ్వగానే గంభీరంగా మారిపోయాయి. ప్రథమార్ధంలో ఉన్న గ్రిప్ ని దర్శకుడు ద్వితీయార్ధంలో చేజార్చాడు. సుహాస్ తనవంతుగా కథని బుజాల మీద నడిపించినా కథనంలో తగ్గినా వేగానికి సుహాస్ కూడా ఏమి చెయ్యలేకపోయాడు. రైటర్ విషయంలో ఒక అంచనాకు వచ్చిన ప్రేక్షకుడిని క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టడం కష్టంగా మారింది. మెసేజ్ ఇచ్చినా అది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. కామెడీ వరకు ఓకె కానీ.. కథాకథనాల విషయంలో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేదిగా ఓటిటికి పర్ఫెక్ట్ గా సరిపోయే రైటర్ పద్మభూషణ్ థియేటర్స్ లోను బాగానే సందడి చేస్తుంది

పంచ్ లైన్: ముందు తడబడ్డాడు-ముగింపుతో మెప్పించాడు 

రేటింగ్: 2.5/5

Cinejosh Review: Writer Padmabhushan:

Writer Padmabhushan Telugu movie review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs