Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: తెగింపు


సినీజోష్ రివ్యూ: తెగింపు 

Advertisement
CJ Advs

బ్యానర్: బేవ్యూ ప్రాజెక్ట్స్ , జీ స్టూడియోస్

నటీనటులు: అజిత్ కుమార్, మంజు వారియర్, సముద్రఖని, పావని రెడ్డి, అజయ్ తదితరులు 

మ్యూజిక్: గిబ్రాన్

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా 

ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి 

ప్రొడ్యూసర్: బోనీ కపూర్

డైరెక్షన్ : H.వినోత్ 

రిలీజ్: 11-01-2023

ముందు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త సినిమా విడుదలవుతుందంటే చాలు మిడ్ నైట్ షోలకి భారీ హంగామా చేసే వీరాభిమానులు ఉన్నారు, రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తెచ్చే ప్రేక్షకులు ఉన్నారు, ఇంత స్టార్ డం ఉన్నా హీరో అజిత్ కి ఇవేవీ పట్టవు. తన సినిమాలు తను చేసుకోవడం తనని కలవడానికి వచ్చిన అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడి ఫోటోలు దిగటం అంతే. బయటకు తెలియకుండా తన అభిమానులకి అవసరమైన సహాయ సహకారాలు అందించడం లాంటివి ఉండొచ్చేమో గాని అభిమానులతో కలిసి అట్టహాసంగా ఈవెంట్లు, సక్సెస్ సెలబ్రేషన్లు, ర్యాలీలు అంటూ అజిత్ ఎప్పుడు హంగామా చేయడు.

సినిమాల పరంగా కూడా తనతో బాగా ట్యూన్ అయిన దర్శకుడితోనే వరుసగా సినిమాలు చేయడం అజిత్ కుమార్ అలవాటు. ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే దర్శకుడితో వరుసగా చిత్రాలు చేసే హీరో బహుశా ఆయన ఒక్కరే అయ్యుంటారు. మొన్నటికి మొన్న దర్శకుడు శివ తో వరుసగా నాలుగు సినిమాలు చేసిన అజిత్ ఇప్పుడు వినోద్ తో వరుసగా మూడు సినిమాలు చేశాడు. నీర్కొండ పరవై, వలిమై తర్వాత తునివు సినిమాతో అజిత్ ఈ రోజు థియేటర్ లోకి వచ్చాడు. తునివు తెలుగులో తెగింపుగా విడుదలైంది. మరి ఈ తెగింపు దేనికి దారి తీసిందో చూద్దాం.

స్టొరీ :

యువర్ బ్యాంక్ ను దోచుకోవడానికి ఒక రాధా గ్యాంగ్ బ్యాంక్ లోకి ఎంటర్ అవడం తీరా ఆ గ్యాంగ్ పని పూర్తి చేసేలాగా అందులోనే ఉన్న డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) రంగంలోకి దిగి బ్యాంక్ ను తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడంతో కథ మొదలవుతుంది. ఇక తర్వాత తంతు అంతా అజిత్ ఎలివేషన్లు, బయట ఉన్న పోలీసులు పై ఎత్తులు, పోలీసులు వేసే ప్రతి స్టెప్ కు రిటార్ట్ ఇచ్చి స్లో మోషన్ లో అజిత్ ఎక్స్ప్రెషన్లు, డాన్సులు ఫైనల్ గా రెండు ట్విస్టులతో తెగింపు కథ కి ఒక ముగింపు చూసే ప్రేక్షకులకు ఒక నిట్టూర్పు.

స్క్రీన్ ప్లే :

ఇప్పటికే అజిత్ తో రెండు సినిమాలు తీసిన దర్శకుడు వినోద్ మూడోసారి బ్యాంక్ దోపిడీ నేపథ్యంతో తెగింపు ను తెచ్చాడు. మొదటి సినిమా నేర్కొండ పరవాయి హిందీ పింక్ అనుకరణ యధాతథంగా కాబట్టి కోర్టు రూం డ్రామా తో లాగించేసారు. ఇక రెండోది వలిమై యాక్షన్ థ్రిల్లర్ గా ట్రై చేసి అతకని సెంటిమెంట్ తో దెబ్బ తిన్నారు. ఈ సారి బ్యాంక్ హైస్ట్ థీమ్ తో అజిత్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి వలిమై లో చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేశారు కానీ పకడ్బందీ స్క్రీన్ ప్లే లేక కంగాళీ అయిపోయింది. ప్రారంభం నుండీ అంతా హడావిడిగా జరిగిపోతూ ప్రేక్షకుడికి అసలేం జరుగుతోందో క్లూ కూడా దొరకదు. సీరియస్ గా సాగాల్సిన బ్యాంక్ దోపిడీని హీరోయిజం పేరిట అజిత్ తో సిల్లీ డైలాగులు, సీన్లు తో డైల్యుట్ చేసేశారు. సెకండ్ హాఫ్ లో మెసేజ్ ను మిక్స్ చేసి మరింత స్పీడ్ పెంచే ప్రయత్నంలో ఒకో సారి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కాస్త బెటర్ గా ఉన్నా ఓవరాల్ ఇంటెన్సిటీ లేక నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్స్ తో తెగింపు ను తెగే దాకా లాగారు.

ఎఫర్ట్స్:

అజిత్ తనకు నప్పే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో చూడటానికి బాగున్నారు. తనకి అచ్చొచ్చిన మంకత గ్యాంబ్లర్ స్టైల్ హీరో కం విలనిజం తో ఫ్యాన్స్ ను కొంత వరకు అలరించారు కానీ కంటెంట్ గ్రిప్పింగ్ గా లేకపోవడంతో ఒక స్టేజ్ దాటాక ఆయన చేసేది కూడా ఏమీ లేకపోయింది. మంజు వారియర్ హీరోయిన్ లాంటి పాత్ర పోషించింది. ఆవిడ యాక్షన్ పార్ట్, స్టంట్ చేయడం కాస్త కొత్తదనం. పోను పోను ఆ పాత్రను కూడా ప్రాముఖ్యత లేని ఒక క్యారక్టర్ గా మార్చేశారు. అజయ్, సముద్రఖని తమ ఎక్స్పీరియన్స్ తో కొంత వరకు తమ పాత్రలను రక్తి కట్టించగలిగారు. జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు మాత్రం నిరాశపరుస్తాయి. నిరవ్ షా సినిమాటోగ్రఫీ ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. బ్యాంక్ సెట్టింగ్ గ్రాండ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండేలా చూసుకున్నారు.

ఎనాలిసిస్ :

తెగింపు సినిమా చూసే ప్రేక్షకుడు సగం సినిమా నుంచే ముగింపు కోసం ఎదురు చూసాడంటే అది దర్శకుడి అసమర్థతే. ఈ సినిమా రిజల్ట్ కి 100 పర్సెంట్ రీజన్ దర్శకుడే అయినా.. 200 పర్సెంట్ కార్నర్ అయ్యేది, కామెంట్స్ పడేది అజిత్ మీదే. తనకున్న అభిమాన గణాన్ని, తన సినిమాపై ప్రేక్షకులులు చూపించే అభిమానాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన మానాన సినిమాలు చేసుకుపోతుండే అజిత్ ఇకపై అయినా రియలైజ్ అవుతారని ఆశిద్దాం. మొదటి సినిమాతో ఎమోషనల్ పార్ట్ తో రెండో సినిమాతో యాక్షన్ పార్ట్ తో మంచి మార్కులు వేయించుకున్న దర్శకుడు వినోద్ మూడో సారి ఆ రెండిటితో పాటూ అజిత్ మార్క్ హీరోయిజం తో కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేశాడు. ఎంత హీరో ఎలివేషన్ సీన్లు అయినా సరైన కథ, స్క్రీన్ ప్లే తో వచ్చే సన్నివేశాల తోనే పండుతాయి. కానీ అటు అజిత్ ఫ్యాన్స్ కోసం ట్రై చేసిన హీరోయిజం ఇటు సరైన స్క్రీన్ ప్లే లేక పేలవంగా తయారయిన కథ తో రెండిటికీ చెడ్డ రేవడి అయింది తెగింపు.

పంచ్ లైన్: తెగింపు సరిపోని ముగింపు 

రేటింగ్: 1.5/5

Cinejosh Review: Thegimpu:

Thegimpu Telugu Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs