Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : ఊర్వశివో రాక్షసివో


సినీజోష్ రివ్యూ : ఊర్వశివో రాక్షసివో 

Advertisement
CJ Advs

బ్యానర్ : GA 2 పిక్చర్స్ - శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రై లిమిటెడ్ 

నటీనటులు : అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, పృధ్వి, పోసాని

ఛాయాగ్రహణం : తన్వీర్ మీర్ 

కూర్పు : కార్తీక శ్రీనివాస్ 

సంగీతం : అచ్చు రాజమణి & అనూప్ రూబెన్స్

నిర్మాణం : ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం. & తమ్మారెడ్డి భరద్వాజ

సమర్పణ : అల్లు అరవింద్ 

దర్శకత్వం : రాకేష్ శశి 

విడుదల తేదీ : 04-11-2022

మెగా కాంపౌండ్ హీరో అనే ముద్ర ఉన్నా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రదర్ అనే ఐడెంటిటీ తోడైనా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సుపుత్రుడే అయినా సాలిడ్ హిట్టు కొట్టలేక  స్ట్రగుల్ అవుతున్నాడు అల్లు శిరీష్. కెరీర్ బిగినింగ్ నుంచీ విభిన్న కథలనే ఎంచుకుంటూ వస్తున్నా సరైన విజయం మాత్రం శిరీష్ కి అందని ఫ్రూట్ లాగే మిగిలింది.. ఫేట్ మార్చుకోమని ఛాలెంజ్ విసిరింది. అందుకే ఈసారి అప్రమత్తంగా ఉన్న అల్లు శిరీష్ పాత పంథా పక్కనెట్టి కొత్త ట్రాక్ లోకి అడుగెట్టాడు. ట్రెండీ సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నాడు. యూత్ ఆడియన్సుని టార్గెట్ గా పెట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ పట్టుకున్నాడు. రొమాన్సులోనూ రెచ్చిపోయాడు. మరీ మార్పుకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నేడు విడుదలైన తన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో రివ్యూలో చూద్దాం..!

స్టోరీ : మధ్య తరగతి కుటుంబానికి చెందిన పద్ధతైన కుర్రాడు శ్రీకుమార్ (అల్లు శిరీష్). అమెరికా వెళ్లి ఇండియా తిరిగి వచ్చిన మోడ్రన్ అమ్మాయి సింధు (అను ఇమ్మాన్యుయేల్). ఇద్దరూ ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఎంప్లాయిస్ కావడం వల్ల అక్కడ సింధుని చూసిన శ్రీకుమార్ కి ఆమెపై ఆకర్షణ ఏర్పడుతుంది. సింధు కూడా శ్రీకుమార్ విషయంలో సింపుల్ గానే ఇంప్రెస్ అవుతుంది. అంతేకాదు.. ముద్దులు దాటి, హద్దులు మీరి ఇద్దరూ శారీరకంగా ఒక్కటైపోతారు కూడా.! ఆపై శ్రీకుమార్ తన ప్రేమను, పెళ్లి చేసుకునే ఉద్దేశాన్ని వ్యక్తం చేయగా సింధు మాత్రం అందుకు నో అంటుంది. మరి మనసులో ప్రేమ లేకుండానే శ్రీకుమార్ తో ఎలా బెడ్ షేర్ చేసుకుంది.. సహజీవనానికి సరేననే సింధు పెళ్లిని మాత్రం ఎందుకు వద్దంటోంది.. వారిద్దరి జర్నీఎక్కడికి చేరింది అన్నదే మిగిలిన కథ.!

స్క్రీన్ ప్లే : నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రంలోని చాలా పలుచని కథని చక్కని స్క్రీన్ ప్లే తో చిక్కగా మార్చారని, మలిచారని చెప్పాలి. స్టోరీ టేకాఫ్ స్లో గానే ఉన్నా, స్టార్టింగ్ అంతా సోసోగానే అనిపించినా శ్రీకుమార్ - సింధులు దగ్గరయ్యాక మాత్రం కథనం కవ్విస్తూ, నవ్విస్తూ హుషారుగా సాగింది. ఓ వైపు ఆఫీస్ సీన్స్ - మరో వైపు ఫ్యామిలీ సీన్స్ తో పాటు హీరో హీరోయిన్ ల రొమాంటిక్ సీన్స్ ఫస్టాఫ్ వరకూ సినిమాని పైసా వసూల్ అనిపిస్తే.. సెకండ్ హాఫ్ లోను హిలేరియస్ గా పండిన కామెడీ, క్లయిమాక్స్ లో నింపిన కాస్త ఎమోషన్ తో ఓవరాల్ గా ఊర్వశి మార్కులు కొట్టేసింది.. రాక్షసి ర్యాంక్ పట్టేసింది. అక్కడక్కడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపించినప్పటికీ శృతి మించని ధోరణితో సాగిన సునీల్ కామెంట్రీ ట్రాక్ ఈ స్క్రీన్ ప్లే లోనే మెయిన్ హైలైట్. అదే యూత్ కి ఈ చిత్రం ఆఫర్ చేసే స్పెషల్ ట్రీట్.!

ఎఫర్ట్స్ : అపజయాలు ఎదురైనా ఆత్మ విశ్వాసం కోల్పోలేదని ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రత్యేకంగా చెప్పిన అను ఇమ్మాన్యుయేల్ అదే తీరుని ఈ చిత్రంలోని తన పాత్రలో చూపించింది. స్టార్ట్ టు ఎండ్ స్టన్నింగ్ గ్లామర్ తో స్క్రీన్ పై మెరిసిపోయిన అను పాత్ర ప్రకారం రాక్షసిగా ప్రవర్తిస్తున్నా - ప్రేక్షకుల కళ్ళకు మాత్రం ఊర్వశిగానే కనువిందు చేసింది. అలాగే అల్లు శిరీష్ కూడా తెరపై మునుపటి కంటే కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా కనిపించాడు. కామెడీలో టైమింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అయితే మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో ఎంత ఒదిగి నటించినా, రొమాంటిక్ సీన్స్ లో మాత్రం అసలైన అల్లు శిరీష్ రంగంలోకి దిగిపోయాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా అల్లు శిరీష్ -  అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ ఈ సినిమా రిజల్ట్ రిలీఫ్ ఇస్తుందని, రీఛార్జ్ చేస్తుందని చెప్పొచ్చు. చాలాకాలం తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసిన సునీల్ తిరిగి ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీలా విజృంభించాడు. తనకే సొంతమైన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ వీర విహారంతో వీక్షకులకు వినోదాన్ని పంచాడు. వెన్నెల కిషోర్ గురించి చెప్పేదేముంది.. కరెక్ట్ క్యారెక్టర్ పడిందంటే కావాల్సిన కామెడీ ఇచ్చి పడేస్తాడు. తల్లి పాత్రలో సీనియర్ నటి ఆమని ఆకట్టుకుంది. సినిమా మూడ్ కి తగ్గటుగ్గా సంగీతం మూవ్ అయింది. పాటలు అందంగా అమరితే.. నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. తన్వీర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. డైలాగ్స్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యేలా కరెక్ట్ గా ఉన్నాయి. అనుభవజ్ఞులు అల్లు అరవింద్ - తమ్మారెడ్డి భరద్వాజల పర్యవేక్షణలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, ఎం.విజయ్ లు ప్రొడక్షన్ పరంగా రాణించారు. ఇక దర్శకుడు రాకేష్ శశి ఈ సినిమా యూనిట్ మొత్తం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి ఈ అవకాశానికి తను అర్హుడినేనని నిరూపించుకున్నాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో కొంచెం తడబడ్డట్టు అనిపించినా విసిగించని సన్నివేశాలతో, వినోదభరిత సంభాషణలతో సినిమాని పట్టు తప్పకుండా నడిపించాడు.. హిట్టు గట్టుపై నిలబెట్టాడు.

ఎనాలసిస్ : పెళ్లిని నిరాకరిస్తూ ప్రేమని స్వాగతించడం, శారీరక సంబంధంతో సాగే సహజీవనం, కలలు - లక్ష్యాలు అంటూ నేటి పోకడలను పోట్రెయిట్ చేసే క్రమంలో ఈ చిత్రం ద్వారా యువతను చాలావరకు మెప్పించే ప్రయత్నం జరిగింది. శృంగారం కాస్త శృతి మించిందే అనిపించినా కథతోనే కలిసి సాగిన హ్యూమర్ ఆ లోపాన్ని కప్పేసింది. కథ అంతా అనుకుంటున్నట్టే కదులుతున్నా.. బోర్ కొట్టనివ్వని కథనం సినిమాని కాపాడేసింది. 2018లో వచ్చిన ప్యార్ ప్రేమ కాదల్ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్ అయినప్పటికీ.. ఆ తమిళ వాసన తగలనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. ప్రీ రిలీజ్ ఈవెంటుకి అటెండై నటసింహం బాలకృష్ణ ఇచ్చిన బూస్టప్ తో నేడు మంచి ఓపెనింగ్స్ నే రాబట్టుకున్నారు. యూత్ మెచ్చే కంటెంట్ కనుక - మౌత్ టాక్ పాజిటివ్ గా వచ్చింది కనుక సునాయాసంగా సూపర్ హిట్ అనిపించుకోగలదు ఈ ఊర్వశివో రాక్షసివో..!!

సినీజోష్ రేటింగ్ : 2.8/5

పంచ్ లైన్ : వినోదంలో ఊర్వశి - రొమాన్సులో రాక్షసి

- Read Urvasivo Rakshasivo English Review -

- Watch Urvasivo Rakshasivo Release Trailer -

CineJosh Review : Urvasivo Rakshasivo:

Urvasivo Rakshasivo Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs