Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : ది ఘోస్ట్


సినీజోష్ రివ్యూ : ది ఘోస్ట్

Advertisement
CJ Advs

బేనర్ : శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్

నటీనటులు : అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్, గుల్ పనాగ్, అనిఖ సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, బిలాల్ హుస్సేన్ తదితరులు

ఆర్ట్ : బ్రహ్మ కడలి,

ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల  

సినిమాటోగ్రఫీ : G. ముఖేష్

సంగీతం : మార్క్ K రాబిన్

నిర్మాతలు : సునీల్ నారంగ్, రామ్మోహనరావు, శరత్ మరార్

రచన, దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

విడుదల తేదీ : 05-10-2022 

ఎప్పుడూ ఏదో ఓ కొత్త తరహా సినిమా చెయ్యాలని కోరుకునే హీరో నాగార్జున - తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని చూపిస్తోన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు కలిశారు. ది ఘోస్ట్ అనే ప్రాజెక్టు కోసం చేతులు కలిపారు. మొదటి నుంచీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తో కదిలారు. టీజర్, ట్రైలర్స్ తో కాన్ఫిడెన్స్ కలిగించారు. తన టాలీవుడ్ ఎపిక్ ఫిలిం శివ రిలీజ్ అయిన అక్టోబర్ 5నే ది ఘోస్ట్ మూవీ రిలీజ్ అంటూ ఈ చిత్రంపై ఎంతో విశ్వాసం వ్యక్తం చేసిన నాగార్జున కాంపిటీషన్ ని కూడా కేర్ చెయ్యకుండా డేర్ చేసారు.. నేడు ఘోస్ట్ గా థియేటర్స్ లో ప్రత్యక్షం అయ్యారు. ఏకంగా 12 యాక్షన్ ఎపిసోడ్స్ తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలింగా భారీ స్థాయిలో రూపొందిన ఈ ఘోస్ట్ చిత్రం నాగ్ నమ్మకాన్ని నిజం చేసిందా.. పండగ రోజున ప్రేక్షకులకు యాక్షన్ సీన్స్ తో థ్రిల్ ఇచ్చిందా అనేది చదవండిక రివ్యూలో.!

స్టోరీ : ఇంటర్ పోల్ ఏజెంట్ విక్రమ్ (నాగార్జున) తన అక్టీవిటీస్ తో బిజీ గా ఉంటాడు. గర్ల్ ఫ్రెండ్ ప్రియ (సోనాల్ చౌహాన్)తో క్రేజీగా వుంటాడు. ఆ టైంలో అతని సిస్టర్ అను (గుల్ పనాగ్) నుంచి కాల్ వస్తుంది. తను ప్రాబ్లెమ్ లో ఉన్నానని చెబుతుంది. ఎన్నో ఏళ్లుగా దూరంగానే ఉంటున్నా ఆమెకు లైఫ్ థ్రెట్ ఉందని తెలియగానే విక్రమ్ మూవ్ అవుతాడు. వ్యాపారంలోని ప్రత్యర్ధులు తన అక్కని, మేనకోడలిని అంతం చేయాలని చూస్తుంటే అడ్డు పడతాడు. అందుకు పెద్ద యుద్ధమే చేస్తాడు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇదీ ది ఘోస్ట్ కథ. ఇంత చిన్న పాయింట్ తోనే భారీ యాక్షన్ ఫిలిం చేసే ప్రయత్నం జరిగింది. అందుకే సినిమా ఏవరేజ్ అవుట్ ఫుట్ గా మిగిలింది.

స్క్రీన్ ప్లే : గరుడ వేగ చిత్రంలో ఈ తరహా చిన్న స్టోరీ లైన్ నే ఆద్యంతం ఆసక్తికరంగా మలిచిన ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ విషయంలో మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ పై పెట్టిన శ్రద్ద స్క్రీన్ ప్లే విషయంలో చూపించలేదు. నాగ్ ని ఎంత స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తున్నా, ఫైట్ సీక్వెన్సెస్ ఎంత అమోఘంగా అనిపిస్తున్నా అరెస్టింగ్ నేరేషన్ మిస్ అవడం మైనస్ అయింది. దాంతో పాటు కథలో ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, ఓ వర్గం ప్రేక్షకులకు ఓవర్ వయొలెన్స్ అనిపించడం కూడా ఘోస్ట్ మూవీ రిజల్ట్ పై ఇంపాక్ట్ చూపించేలా ఉంది. అయితే ర్యాపిడ్ యాక్షన్ బ్లాక్స్ ని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేసే ఆడియన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఘోస్ట్ ని సపోర్ట్ చేస్తున్నారు. నాగార్జున ఇన్ వాల్వమెంట్ నీ, ప్రవీణ్ సత్తారు ప్రెజెంటేషన్ నీ అభినందిస్తున్నారు.

ఎఫర్ట్స్ : సంక్రాంతికి బంగార్రాజులో సరదాగా సందడి చేసిన నాగార్జున విజయదశమికి మాత్రం ఘోస్ట్ గా విజృంభించారు. ఇంట్రో సీన్ నుంచే ఇంప్రెస్ చేసేసిన నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ రొమాంటిక్ మూవ్స్ లో వావ్ అనిపించింది. క్లయిమాక్స్ కి వహ్వా అనిపించే రేంజ్ కి చేరింది. ముఖ్యంగా ఇంటెన్సివ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇరగదీసారు నాగ్. తమహాగానే (కత్తి) చేతబట్టి తను చేసిన ఫైట్ సినిమాకే హైలైట్. సోనాలి చౌహన్ నాగ్ తో సరసాలే కాదు సాహసాలు కూడా చేసింది. తన లుక్, స్టైలింగ్, కాస్త్యుమ్స్ యూత్ ని ఆకట్టుకుంటాయి. గుల్ పనాగ్ కి ఇంపార్టెంట్ రోల్ దక్కింది. అనిఖ నటిగా మరోసారి మంచి మార్కులు వేయించుకుంది. ఇతరులంతా ఆయా పాత్రల్లో ఇమిడిపోయారు. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ మూవీ మూడ్ కి అనుగుణంగా సాగింది. ధర్మేంద్ర ఎడిటింగ్ పై కంప్లైంట్స్ ఏమి ఉండవు కానీ ఇటువంటి ఇంటెన్స్ యాక్షన్ ఫిలిం కి పాటలు అడ్డేమో ఆలోచించి ఉంటే బాగుండేది. ముఖేష్ సినిమాటోగ్రఫీ మూవీకి మేజర్ ప్లస్. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఘోస్ట్ కి ఎస్సెట్ అనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రాజెక్ట్ కి తగ్గట్టు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు థాట్స్ వైల్డ్ గా అనిపించాయి. హాలీవుడ్ రేంజ్ లో ఎక్సయిటింగ్ ఏక్షన్ ఫిలిం చెయ్యాలనే తన తపనను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సిన్సియర్ ఎటెంప్ట్ చేసారు ప్రవీణ్. టేకాఫ్ సో సోగా.. స్లో స్లోగా అనిపించినా ప్రీ ఇంటర్వెల్ నుంచి కథనం పరుగులు పెట్టింది. క్లయిమాక్స్ 30 మినిట్స్ లావిష్ గా, నావెల్ గా అనిపించింది. అన్నిటినీ మించి ప్రవీణ్ ని నాగ్ ఎందుకంత అభినందించారో తెరపై స్పష్టంగా కనిపించింది.

ఎనాలసిస్ : 1989 అక్టోబర్ 5 న శివ సినిమాతో ట్రెండ్ సెట్టింగ్ సినిమా ఇచ్చిన నాగార్జున ఆపై 1996 అక్టోబర్ 4 న నిన్నే పెళ్లాడతా మూవీతో యూత్ అండ్ ఫామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి పోటెత్తేలా చేసారు. అయితే ఈ ఇయర్ మాత్రం ది ఘోస్ట్ కి ఆ యూనివర్సల్ అప్పీల్ మిస్ అయింది. ఎంత ఫామిలీ డ్రామా ఇన్ క్లూడ్ చేద్దామని దర్శకుడు ప్రయత్నించినా చివరికి యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే నచ్చే సినిమాగా మారింది. పండగ సీజన్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ లిమిటెడ్ ఆడియన్సుకి మాత్రమే రీచ్ అవ్వుద్దేమో అనే కామెంట్స్ ఎదుర్కుంటున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రిజల్టే పొందుతుందని ఆశిద్దాం. డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ది ఘోస్ట్ కి ఖచ్చితంగా ది బెస్ట్ రిసెప్షన్ వస్తుంది కనుక ఆ సెన్సేషన్ కోసం వెయిట్ చేద్దాం.!

పంచ్ లైన్ : ది ఘోస్ట్ - యాక్షన్ ఫిలిం లవర్స్ కి ఫీస్ట్

సినీజోష్ రేటింగ్ : 2.75/5

Cinejosh Review: The Ghost:

The Ghost Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs