సినీజోష్ రివ్యూ : కృష్ణ వ్రింద విహారి
బేనర్ : ఐరా క్రియేషన్స్
నటీనటులు : నాగశౌర్య, షిర్లీ సెటియా, రాధిక, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
సంగీతం : మహతి స్వరసాగర్
సమర్పణ : శంకర్ ప్రసాద్ ముల్పూరి
నిర్మాత : ఉషా ముల్పూరి
దర్శకత్వం : అనీష్ కృష్ణ
విడుదల తేదీ : 23-09-2022
ఆమధ్య కొన్ని యాక్షన్ మూవీస్ ట్రై చేసిన హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య మళ్ళీ తన కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసి చేసిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి. ట్రెడిషనల్ టైటిల్ తో, ఎట్రాక్టీవ్ గా కనిపిస్తోన్న లీడ్ పెయిర్ తో మొదటినుంచీ మంచి బజ్ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం నాగశౌర్య వినూత్నంగా చేసిన పాద యాత్ర పబ్లిసిటీ వల్ల ట్రేడ్ లో మరింత క్రేజ్ పెంచుకుంది. మొత్తానికి ప్రామిసింగ్ ప్రాజెక్టు గానే అనిపిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణ వ్రింద విహారి చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో.. నాగశౌర్యకి ఎటువంటి ఫలితాన్ని అందించనుందో రివ్యూలో చూద్దాం.
బేసిక్ పాయింట్ : బ్రాహ్మణ యువకుడు కృష్ణ (నాగశౌర్య) తన కొలీగ్ అయిన వ్రింద (షిర్లీ సెటియా)ని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమని పొందేందుకు సిన్సియర్ గా ప్రయత్నిస్తాడు. ఫైనల్ గా కృష్ణ - వ్రిందల ప్రేమ కథ ఓ కొలిక్కి రావడంతో ఇరువురి కుటుంబాలను ఒప్పించి పెళ్లితో ఇద్దరూ ఒక్కటవుతారు. అయితే అసలు కథ ఇక్కడ్నుంచే ఆరంభం అవుతుంది. అప్పటివరకూ సాఫీగానే సాగిన వారి లైఫ్ లో పెళ్లి తర్వాత కొత్త సమస్యలు తలెత్తుతాయి. ప్రేమించుకునేటపుడు లేని ప్రాబ్లెమ్ పెళ్లి తర్వాత రావడం ఏంటి.. దాని పట్ల ఇరువురి కుటుంబాలు ఎలా స్పందించాయి.. చివరికి కృష్ణ - వ్రిందల కథ ఏమైంది అన్నదే ముగింపు.
ప్లస్ పాయింట్ : బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడిగా నాగశౌర్య నటనే ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్. హ్యాండ్సమ్ హీరో అనే ట్యాగ్ ని హండ్రెడ్ పర్శంట్ జస్టిఫై చేస్తూ చాలా గ్లామరస్ గా కనిపించిన నాగశౌర్య ఇటు హ్యూమర్ నీ, రొమాన్స్ నే కాక ఎమోషనల్ సీన్స్ నీ చక్కగా పండించాడు. హీరోయిన్ షిర్లీ సెటియా లుక్స్ వైజ్ ఓకె కానీ.. పెరఫార్మెన్స్ లో పదును లోపించింది. సీనియర్ నటి రాధిక తనకి అలవాటైన పాత్రలో అలవోకగా నటించేసింది. ఇతర పాత్రల్లో ఎక్కువగా ఆకట్టుకునేది వెన్నెల కిషోర్, సత్య రోల్స్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అయిన ఫన్.. ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. సంభాషణలు ఆహ్లాదాన్ని పంచితే కెమెరా పనితనం చిత్రాన్ని కంటికింపుగా చూపించింది.
మైనస్ పాయింట్: ఇటీవలే వచ్చిన అంటే సుందరానికి చిత్రంతో చాలా సిమిలారిటీస్ ఉండడం కృష్ణ వ్రింద విహారి కి మెయిన్ మైనస్ పాయింట్ గా మారింది. ఆ సినిమాలో సేమ్ సమస్యను, సేమ్ అబద్దాన్ని వాడేశారు. అందుకే ప్రతి సీన్ ని అంటే సుందరానికి చిత్రంతో పోల్చి చూడడం స్టార్ట్ చేసారు ఆడియన్స్. ఆ చిత్రంతో ఈ చిత్రానికి మరీ ఎక్కువ పోలిక తేవడానికి తప్పితే బ్రాహ్మణ నేపథ్యం అనేది ఎందుకు ఎన్నుకున్నాడో దర్శకుడికే తెలియాలి. చిన్న స్టోరీ లైన్ కి కాస్త కామెడీ జోడించి సింపుల్ సినిమాగా తీసేద్దామనే ప్రయత్నంలో పరమ రొటీన్ సన్నివేశాలతో స్క్రిప్ట్ రాసుకున్న దర్శకుడు ఫైనల్ గా ఓ ప్రెడిక్టబుల్ ఫిలిం ని అందించాడు. నస పెట్టె కథనంతో ప్రథమార్ధం విసిగించారు కానీ.. ద్వితీయార్ధంలో మాత్రం కాస్త వినోదాన్ని పంచగలిగారు. అయితేనేం కొత్తదనం లోపించిన కథాకథనాలతో సాదాసీదా సినిమాగా మిగిలింది కృష్ణ వ్రింద విహారి. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ మ్యూజిక్ కూడా ఎలాంటి మ్యాజిక్ చెయ్యలేకపోయింది.
ఫైనల్ పాయింట్: నాగ శౌర్య తనకి నప్పే కథని ఎంచుకోవడమే రిలీఫ్ తప్ప అతను ఎంతో గొప్పగా చెప్పిన ఆ బ్రాహ్మణ యువకుడి పాత్రలో పెద్ద విషయమేమి కనిపించలేదు. తన తనయుడు ఎన్నుకుంటున్న కథలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న ఉష ముల్పూరి మరోసారి నాగ శౌర్య కి రాజి పడని నిర్మాణంతో క్వాలిటీ అవుట్ ఫుట్ నే ఇచ్చారు. కానీ మూడు నెలల గ్యాప్ లోనే ఒకే కథాంశంతో ఇద్దరు యువ కథానాయకుల చిత్రాలని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు గనక కాస్త జాగ్రత్త వహించి ఉంటే.. రిజల్ట్ బెటర్ గా వచ్చి ఉండేది.
Punch Line: కొంత విసుగు - కొంత వినోదం
రేటింగ్: 2.5/5