Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: కార్తికేయ 2


సినీజోష్ రివ్యూ: కార్తికేయ 2

Advertisement
CJ Advs

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌

నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

మ్యూజిక్: కాలభైరవ

సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్ల

నిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం - చందు మెుండేటి

స్వామిరారా సినిమా నుంచీ సబ్జెక్ట్స్ సెలెక్షన్ లో పరిణతి పెంచుకున్న యంగ్ హీరో నిఖిల్ కి తను ఎంచుకుంటోన్న కథలు మంచి ఫలితాలనే అందిస్తూ వస్తున్నాయి. అదే ఉత్సాహంతో ఎనిమిదేళ్ల క్రితం తను నటించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ చేసేందుకై సిద్ధపడ్డాడు నిఖిల్. కార్తికేయని ఇంట్రెస్టింగ్ ఫిలింగా మలిచి హిట్ కొట్టిన చందు మొండేటి దర్శకత్వంలోనే ఎడ్వంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కింది కార్తికేయ 2. అయితే ఈ సారి స్టోరీలో స్పాన్ పెరిగింది. vfx వర్క్ ఎక్కువ అవసరం పడింది. దాంతో బడ్జెట్ కూడా చేతులు దాటింది. పాండమిక్ పరిస్థితి పరీక్ష పెట్టింది. రిలీజ్ డేట్ ఇష్యూలోను ఇబ్బంది ఎదురైంది. మరి వీటన్నిటినీ తట్టుకున్న మేకర్స్ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు పట్టుకొచ్చిన కార్తికేయ 2 ఎలా ఉందంటే...

కథ:

సినీజోష్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే చందు మొండేటి కార్తికేయని ఎక్కడ ముగించాడో అదే కేరెక్టర్ ని కంటిన్యూ చేస్తూ చాలా తెలివిగా కార్తికేయ 2 ని రాసుకొచ్చాడు. రాజ్ కుమార్ హిరానీ మలిచిన మున్నాభాయ్ సిరీస్ ఫాలో అవుతున్నానని ముందే ప్రకటించిన చందు కరెక్ట్ గా కార్తికేయ కేరెక్టర్ తోనే ట్రావెలింగ్ స్టార్ట్ చేసాడు.  MBBS కంప్లీట్ చేసి డాక్టర్ గా మారిన కార్తికేయ(Nikhil) తన విధులు నిర్వర్తించే క్రమంలో ICU లోనే హోమం తలపెట్టిన మేయర్ పై చెయ్యి చేసుకోవడం వలన సస్పెండ్ అవుతాడు. ఆపై తన ఇంటిలో కూడా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. వీటన్నిటికీ కారణం చెల్లించుకోని మొక్కు అని నమ్మే తన తల్లి (తులసి) కార్తికేయ ని మధురై కి తీసుకుని వెళుతుంది. ఇక అక్కడినుంచీ కార్తికేయ మధురై కి రావడం కూడా విధిలిఖితమే అనీ. మధురై లో ఉన్న శ్రీ కృష్ణుని కంకణం దుష్టుల చేతికి చిక్కకుండా చేయడమే తన కర్తవ్యం అనీ తెలిసొచ్చాక అతను అస్సలూహించని సంఘటనలు ఎదురయ్యాక కార్తికేయ ఎలా స్పందించాడు? ఏం చేసాడు? అన్నది తెరపై చూస్తేనే బావుంటుంది. హిస్టరీని వాడుకుంటూ మిస్టరీ కథగా రాసుకున్న కార్తికేయ 2 నిదానంగానే మొదలైనా.. ఆఖరి సన్నివేశాల్లో మాత్రం అబ్బురపరుస్తుంది. 

తెరపై:

కార్తికేయ కేరెక్టర్ ని ఆల్రెడీ చేసేసి ఉన్న ఎక్స్ పీరియన్స్ తో అదే ఇంటెన్సిటీని కంటిన్యూ చెయ్యడంలో అంతకుమించి ఇంపాక్ట్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు నిఖిల్. చాలా సన్నివేశాల్లో నటుడిగా అతడు సాధించిన పరిణితిని చూపించగలిగాడు. ఆర్కియాలజిస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ కార్తికేయకి సపోర్ట్ చేసే కేరెక్టర్ లో సెటిల్డ్ గా పెర్ ఫార్మ్ చేసింది. కృష్ణతత్వాన్ని తెలిపే  ప్రధానమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుంది. ఆదిత్య మీనన్ ఆంటాగినిస్ట్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. నిఖిల్ తల్లి పాత్రలో సీనియర్ నటి తులసి, ఉత్కంఠ భరితంగా సాగే కథలో అక్కడక్కడా ఆహ్లాదాన్ని పంచే పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, ప్రవీణ్, సత్య మెప్పించారు.

తెరవెనుక:

కార్తికేయ 2 కి సంబంధించి ముందుగా మంచి మార్కులు కొట్టేసేది అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన కాలభైరవ. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోయినా కథలో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు కీరవాణి తనయుడు కాల భైరవ. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో.! అలాగే కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ కూడా పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు. బడ్జెట్ పరిమితుల కి లోబడి పనిచేస్తూ.. vfx వర్క్ ని దృష్టిలో పెట్టుకుంటూ సినిమాని విజువల్ ఫీస్ట్ గా చూపించడం ఏ సినిమాటోగ్రాఫర్ కి అయినా సవాలే. ఆ సవాల్ ని స్వీకరించి చాలా చక్కగా నిర్వర్తించాడు కార్తిక్. ఆర్ట్ డైరెక్టర్ ని అభినందించి తీరాలి. ఎడిటర్ తన కత్తెరకి ఇంకాస్త పని కల్పించి ఉండాలి. నిర్మాణంలో జాప్యం జరుగుతున్నా, వడ్డీలు పెరిగిపోతున్నా.. సినిమాపై నమ్మకంతో నిలబడి ఉన్న నిర్మాతలకి హ్యాట్సాఫ్. దైవత్యం, మానవత్వం అనే అంశాలని జత చేస్తూ, హిస్టరీ-మిస్టరీ అనే రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ ని ముడిపెడుతూ కార్తికేయ 2 కథని అల్లిన చందు మొండేటి నిదానంగా సాగిన నేరేషన్ తోనే ప్రేక్షకులని కథలో ఇన్వాల్వ్ చెయ్యగలిగాడు. పతాక సన్నివేశాలతో కట్టిపడేసాడు. మూడో భాగం రాబోతోంది అనే సంకేతాన్నీ ఇచ్చాడు.

విశ్లేషణ:

ప్రతి సమస్యకి ఓ సమాధానము ఉంటుంది: వెతికితే దొరుకుతుంది అని బలంగా నమ్మే వ్యక్తిగా కార్తికేయ కేరెక్టర్ ని తీర్చిదిద్దడంలోనే దర్శకుడు చందు మొండేటి మంచి అమార్కులు కొట్టేసాడు. ప్రశ్న చుట్టూ పయనించే కార్తికేయ కేరెక్టర్ తో ఇంకా ఇంకా చాలా దూరం వెళ్లొచ్చనే తన నమ్మకానికి నిదర్శనంగా కార్తికేయ 2 ని తీసుకొచ్చాడు. బేసిక్ గా ఓ హిట్ సినిమాకి సీక్వెల్ తియ్యడాన్ని అడ్వాంటేజ్ అనుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. ఛాలెంజ్ గా తీసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. రెండో కోవకి చెందినవాడు చందు మొండేటి. కార్తికేయని ఆదరించిన ప్రేక్షకులకు కార్తికేయ 2 తో మరింత థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని తపించిన చందూ.. అందుకు అనుగుణంగానే చాలా ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచాడు కార్తికేయ 2 లో. కథకి తగ్గట్టుగానే ఆర్టిస్ట్ ల నుంచి అభినయాన్ని రాబట్టుకోవడంలో, టెక్నీషియన్స్ నుంచి కావాల్సిన సపోర్ట్ తీసుకోవడంలో 100 పర్సెంట్ సక్సెస్ అయిన చందు తన సీక్వెల్ 100 పర్సెంట్ బావుందనిపించాడు. కార్తికేయ 3 కోసం అందరూ ఎదురు చూసేలా చేసాడు.

పంచ్ లైన్ : కార్తికేయ 2 - శాటిస్ ఫై చేసే సీక్వెల్

రేటింగ్: 2.5/5

Cinejosh Review: Karthikeya 2:

Karthikeya 2 Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs