Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీ


సినీ జోష్ రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీ 

Advertisement
CJ Advs

బ్యానర్: SLV సినిమాస్, RT టీం వర్క్ 

నటీనటులు: రవితేజ, దివ్యంశ కౌశిక్, అన్వేషి జైన్, వేణు తొట్టెంపూడి, రాజిష విజయన్, పవిత్ర లోకేష్, నాజర్ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ 

ఎడిటర్: ప్రవీణ్ K. L

మ్యూజిక్ డైరెక్టర్: శ్యామ్ C.S

ప్రొడ్యూసర్స్: సుధాకర్ చెరుకూరి

స్టోరీ-డైరెక్షన్: శరత్ మండవ 

రిలీజ్ డేట్: 29-07-2022 

రామారావు ఆన్ డ్యూటీ.. రవితేజ సినిమా. హీరోయిన్లు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంతా మనకి కొత్తవారే కావడంతో కేవలం రవితేజ సినిమాగానే రిజిస్టర్ అయిన రామారావు ఆన్ డ్యూటీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ని కాస్త ఆకర్షించే ఐటెం సాంగ్ తప్ప మరే పాట కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ సినిమాపై సరైన బజ్ క్రియేట్ చేయలేకపోయినా, ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ లో దర్శకుడి నోటి తీరు రామారావు పై వివాదాలను రాజేసింది. తన వ్యాఖ్యలతో ఓ వైపు ఫిలిం క్రిటిక్స్ ని కెలికేసిన దర్శకుడు, మరోవైపు నెటిజెన్స్ మనసులని నొప్పించాడు. దానితో అప్పటికే కొందరికి టార్గెట్ గా మారిపోయిన రామారావు నిన్న లీక్ అయిన సీన్ లోని పొలిటికల్ డైలాగ్ తో సోషల్ మీడియాలో కొత్త రచ్చకు కారకుడయ్యాడు. ఒక్కసారిగా ఓ వర్గం జనానికి విరోధిగా మారిపోయాడు. ఇన్ని ప్రతి కూలతల మధ్య అసలే ప్రేక్షకులు థియేటర్స్ కి రాక, కలెక్షన్స్ లేక బావురుమంటున్న బాక్సాఫీసు వద్ద రవితేజ ఛరిష్మా పని చేసిందా? రామారావు చేసిన డ్యూటీ సరిపోయిందా? రివ్యూలో చూద్దాం.

కథ: 

1995 కాలంలో చిత్తూరు జిల్లాలో జరిగే కథగా రామారావు చేసే డ్యూటీ తెరపైకి వస్తుంది. నిజాయితీ గల సబ్ కలెక్టర్ పాత్రలో రామారావు(రవితేజ) ఆ ప్రాంతంలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ ని ఆపే ప్రయత్నాలు చేస్తాడు. దానికి తోడు అతని మాజీ లవర్ మాలిని(రాజిష విజయన్) భర్త మిస్సింగ్ కేసుని కూడా టేకప్ చేస్తాడు. సిఐ మురళి(వేణు) ఆ మిస్సింగ్ కేసు పట్ల ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నాడో, తానే స్వయంగా విచారణ చేపట్టిన రామారావు కి ఆ ప్రాసెస్ లో ఎటువంటి షాకింగ్ విషయాలు తెలిసాయి, ఆ మిస్సింగ్ కేసు వెనకాల ఏమేం జరిగాయి, ఫైనల్ గా అవన్నీ ఎలా క్లియర్ అయ్యాయి అనేదే క్లుప్తంగా కథ. కథగా ఇంతే అనిపించొచ్చు. లేదా ఈ కథలో ఇంకేదో ఉందనిపించొచ్చు. కానీ దర్శకుడు మాత్రం ఆ రెండు అభిప్రాయాలు తప్పని తేల్చేసాడు. ఇంతే అని సరిపెట్టుకుందామంటే.. అక్కర్లేని పాత్రలతో ఎక్కువైపోయిన సన్నివేశాలతో సినిమాని నింపేసాడు. ఎంతో ఉంది అనుకుందామా అంటే నస పెట్టే నేరేషన్ తో, విసిగించే కథనంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. జనరల్ గా ఇటువంటి సినిమాలని రొటీన్ మూవీ అని తేల్చి పారేస్తూ ఉంటాం. నిజానికి రొటీన్ గా వచ్చే ఆ సినిమాలే బెటర్ అన్నంత రొట్టలా తయారు చేసాడు రామారావు ని.

తెరపై:

క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చాడనుకున్న రవితేజ ఖిలాడీ తో దారితప్పాడు.. రామారావు గా జారి పడ్డాడు. మాస్ మహారాజ్ అనిపించుకున్న రవితేజ నుంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఫైట్స్ వరకు వస్తున్నాయి తప్ప అతని ప్రధాన ఆయుధం అయిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కంప్లీట్ గా మిస్సయ్యిపోతుంది అనేది ఆడియన్స్ ఫీలింగ్. సబ్జెక్టు సెలెక్షన్ లోనే తప్పటడుగులు వేస్తున్నాడు అనుకుంటే.. ఈసారి స్క్రీన్ ప్రెజెన్స్ లోను రవితేజలో తడబాటు కనిపించింది. పెరఫార్మెన్స్ ఎనర్జిటిక్ గానే ఉన్నా ఫేస్ లో గ్లో తగ్గిపోయింది అనేది స్క్రీన్ పై తెలుస్తోంది. దాచాలని ఎంత ప్రయత్నించినా వయసు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇకపై ఇటు అప్పీరియన్స్ వైజ్ అటు సబ్జెక్టు సెలెక్షన్స్ వైజ్ రెండు విధాలా కేర్ తీసుకోక తప్పదు రవితేజ. అలాగే మహేష్ బాబు GMB తరహాలో ఈ సినిమాకి RT టీం వర్క్స్ అంటూ వేసుకున్న రవితేజ కి రిజల్ట్ విషయంలో మాత్రం చుక్కెదురైంది. చాలాకాలం తర్వాత మళ్ళీ నటుడిగా జనం ముందుకు వచ్చిన వేణు తన పాత్రకి తగిన న్యాయం చేసాడు. హీరోయిన్స్ ఇద్దరూ ఉన్నారంటే.. ఉన్నారంతే!. ఐటెం సాంగ్ లో అన్వేషి జైన్ అందాల ఆరబోతకు గొళ్ళెం తీసేస్తే.. సెన్సార్ బోర్డు సీరియస్ గా కళ్లెం వేసేసింది. నరేష్, పవిత్ర లోకేష్, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ( కొన్ని కాన్ టెంపరరీ ఇష్యూస్ వల్ల నరేష్-పవిత్ర లు తెరపై కనిపించగానే థియేటర్స్ లో విచిత్రమైన స్పందన రావడం విశేషం)

తెర వెనుక: 

ఫోటోగ్రఫి బావుంది. కత్తి, మాస్టర్ వంటి సినిమాలు చేసిన సత్యన్ సూర్యన్ రామారావు విషయంలోనూ సిన్సియర్ గా డ్యూటీ చేసాడు. తన శక్తిమేర మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఖైదీ, విక్రమ్ వేద వంటి తమిళ హిట్స్ తో పాటు రీసెంట్ గా రాకేట్రీ తోనూ కాంప్లిమెంట్స్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ తెలుగు నేటివిటీకి తగ్గ సంగీతం అందించడంలో మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు  అనిపించింది. పాటల విషయంలో వీక్ అనిపించుకున్నా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో బాగానే స్కోర్ చేసాడు. ప్రవీణ్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే కరెక్ట్ గా ఉండేది. డైలాగ్స్ ఇంకొంచెం కొత్తగా ఉంటే బావుండేది. అర్హతలేని కథకి అనవరసంగా ఖర్చు చేశారేమో.. అనిపించేలా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్.

ఇక దర్శకుడు శరత్ మండవ విషయానికొస్తే.. తాను టాకింగ్ లో చూపిస్తున్న చలాకీతనం టేకింగ్ లోను చూపించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఉన్న ఉత్సాహం స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఉండుంటే తనకి పనికొచ్చేది. కంప్లీట్ థ్రిల్లర్ గా మలచాల్సిన కథని కమర్షియల్ హంగులతో తెరపైకి తెచ్చేందుకు చాలా తంటాలు పడ్డాడు దర్శకుడు. అయితే ఎంత కుస్తీ పట్టినా కథకు కావాల్సిన సరంజామా నిండలేదు.. అందుకే సినిమాలో ఎక్కడా ఎమోషన్లు పండలేదు. సిల్లీ స్క్రీన్ ప్లే తో బోరింగ్ నేరేషన్ తో డల్ గా కదిలిన ఫస్ట్ హాఫ్, మెల్లగా సాగిన సెకండ్ హాఫ్ రామారావు గా రవితేజ చేసిన డ్యూటీని లూటీ చేసేశాయి.

చివరిగా..

మరోసారి మరో దర్శకుడి నిర్లక్ష్యం వల్ల రవితేజ ఖాతాలోకి రామారావు రూపంలో ఇంకో పరాజయం చేరడం తధ్యమే.

చాలా విషయం ఉంటే తప్ప కాలు కదిపేది లేదు అంటున్న ప్రస్తుత ప్రేక్షకులు ఎటువంటి ఎమోషనల్ డ్రామా లేని ఈ రామారావు ని చూసేందుకు థియేటర్లకు రావడం కష్టమే!

పంచ్ లైన్: వెయిట్ ఫర్ రామారావు ఆన్ ఓటిటి

రేటింగ్: 2/5

Cinejosh Review: Ramarao On Duty:

Ramarao On Duty Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs