Advertisement

సినీ జోష్ రివ్యూ: బీస్ట్


సినీ జోష్ రివ్యూ: బీస్ట్  

Advertisement
-->

బ్యానర్: సన్  పిక్చర్స్ 

నటీనటులు: విజయ్, పూజ హెగ్డే, యోగి బాబు, సెల్వ రాఘవన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: అనిరుద్ రవిచంద్రన్

ఎడిటింగ్: R. నిర్మల్ 

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంశ 

ప్రొడ్యూసర్: కళానిధి మారన్ 

దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్

రిలీజ్ డేట్: 13-04-2023 

కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈమధ్యన దర్శకులు కూడా విజయ్ ఫాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నారా అనిపించేలా ఉంటున్నాయి ఆయన ఎంచుకునే కథలు. తమిళంలో విజయ్ కి 100 కోట్ల మార్కెట్ ఉంది. ఇక తెలుగులో కూడా విజయ్ సినిమాలు తమిళంలో తో పాటుగా విడుదలవుతున్నా ఇక్కడి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విజయ్ వరసగా ఫెయిల్ అవుతున్నారు. అయితే తమిళంలో వరుణ్ డాక్టర్ వంటి డార్క్ కామెడీ తో 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా అనగానే ఆ సినిమాపై అంచనాలు పెరగడం, అనిరుద్ మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అవడంతో విజయ్ - నెల్సన్ కలయికలో తెరకెక్కిన బీస్ట్ పై తమిళం లోనే కాదు తెలుగులోనూ అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. మరి సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజ హెగ్డే తో కలిసి విజయ్ బీస్ట్ తో విజయాన్ని వరించాడో లేదో సమీక్షలో చూసేద్దాం. 

కథ:

వీర రాఘ‌వ (విజ‌య్‌) ఓ మాజీ రా ఏజెంట్‌. వీర రాఘవ రా ఏజెంట్ గా ఉన్న టైం లో ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ ఉమ‌ర్ ఫ‌రుక్‌ని పట్టుకునే క్రమంలో ఓ పాప చ‌నిపోతుంది. ఆ పాప చనిపోవడానికి కారణం తానే అనే ఫీలింగ్ తో వీర రాఘవ ఉద్యోగం వదులుకుని వెళ్ళిపోతాడు. మరో ఉద్యోగం వెతుక్కునే వేటలో ఉన్న వీర రాఘవ.. మళ్ళీ ఉమ‌ర్ ఫారుక్‌ని విడిపించుకోవ‌డానికి ఉగ్ర‌వాదులు చేసిన ప్లాన్ లోకి అనుకోకుండా వెళతాడు. దానిలో భాగంగా చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ ని హైజాక్ చేసి.. అందులో ఉన్న కస్టమర్స్ ని బంధీలుగా చేసి ఉమ‌ర్ ఫారుక్‌ని విడిపించుకోవాల‌న్న‌ది ఉగ్రవాదుల ప్లాన్‌. ఆ షాపింగ్ మాల్ లోనే ఉన్న వీర రాఘవ్ వాళ్ళని ఎలా మట్టు పెట్టాడు? ప్రజలకి ఎలాంటి ఆపద లేకుండా ఎలా సేవ్ చేసాడు? ఉగ్రవాదులతో వీర రాఘవ ఎలా పోరాడాడు? అనేది బీస్ట్ మిగతా కథ.

నటీనటులు:

వీర రాఘవగా విజయ్ ఆ పాత్రలో అల్లుకుపోయారు. ఈ సినిమాలో హీరోయిజాన్ని హైలెట్ చేసే సీన్స్ ఎక్కువగా ఉండడం విజయ్ ఫాన్స్ కి కిక్కిచ్చేలా ఆయా సీన్స్ లో కనిపించారు. విజయ్ మ్యానరిజం తో ఆకట్టుకున్నారు. అరబిక్ కుతు సాంగ్ లోను పూజ హెగ్డే తో కలిసి అదిరిపోయే స్టెప్స్ వేశారు. కాకపోతే పూజ హెగ్డే కి పెరఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ దొరకలేదు. కారణం ఆమె కేరెక్టర్ కి అంతగా ప్రాధాన్యత లేదు. జస్ట్ గ్లామర్ షో వరకు ఓకె. ఇక సెల్వ రాఘవన్ రెస్క్యూ ఆపరేషన్ ఇంచార్జ్ గా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ లేకపోవడం మైనస్. మిగతా వారు తమ తమ పాత్రల్లో మెప్పించారు. 

విశ్లేషణ:

నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన వరుణ్ డాక్టర్ సినిమాలో డార్క్ కామెడీ ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేసారు. ఆ కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు విజయ్ తోనూ అలాంటిది ఏదో నెల్సన్ ప్లాన్ చేసాడు అనుకున్నారు. కానీ నెల్సన్ విజయ్ కోసం రొటీన్ ఫార్ములా కథ అంటే హైజాక్ కథని తీసుకుని అందులో హీరోయిజాన్ని హైలెట్ చేద్దామనుకుని బొక్క బోర్లా పడ్డారు. ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ విజయ్ కి చెప్పడం, ఆ హీరోయిజం ఎలివేషన్ సీన్స్ కి విజయ్ పడిపోయెరేమో అనేలా ఉంది సినిమా మొత్తం. ఇక కథనంలోకి వెళితే.. ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్, కామెడీ, ఇంట్రెస్టింగ్ సాంగ్ తో నడిపిస్తే.. క‌థ‌లో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కిక్ ఇచ్చేదిలా ఉంది. టెర్ర‌రిస్ట్ లానే, హీరో కూడా ప్ర‌భుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయ‌డం చూస్తే నిజంగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో కథ మొత్తం డైవర్ట్ అయ్యింది. హైజాక్ సీన్స్ లో బలం లేదు. టెర్రరిస్టులు హీరో చేతుల్లో చావడం తప్ప బలంగా హీరోని ఢీ కొట్టేలా ఏం చెయ్యరు. ఎక్కడ చూసినా హీరో హీరోయిజమ్. ఫాన్స్ లేచి విజిల్స్ వేసేలా ఆ సీన్స్ ని ఎలివేట్ చేసాడు దర్శకుడు. క్లైమాక్స్ లో పట్టు లేదు. సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించే సన్నివేశాలే లేవు. యాక్షన్ లో కామెడీ ఇరికించాలని చూసినా అది వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడా నెల్సన్ మార్క్ కామెడీ కనిపించదు. నెల్సన్ కేవలం విజయ్ ఫాన్స్ కోసమే సినిమా తీసాడా అంటే.. ఆ ఫాన్స్ కూడా సినిమాని ఎంజాయ్ చేస్తారో లేదో డౌట్ పడేలా ఉంది బీస్ట్.

సాంకేతికంగా..

అనిరుధ్ మ్యూజిక్ లో అర‌బిక్ కూతు సాంగ్ ఇప్ప‌టికే హిట్. థియేట‌ర్లో విజ‌య్-పూజ హెగ్డే స్టెప్పుల‌తో క‌లిపి చూస్తే ఇంకా బాగుంది. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. యాక్ష‌న్ సీన్స్‌లో నేపధ్య సంగీతం ఎలివేట్ అయ్యింది. మనోజ్ పరమహంశ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. అడుగడుగునా రిచ్ నెస్ కనిపించేలా ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

రేటింగ్: 1.75/5

Cinejosh Review: Beast:

Beast Movie telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement