Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : డీజే టిల్లు


సినీజోష్ రివ్యూ : డీజే టిల్లు 

Advertisement
CJ Advs

బేనర్ : సితార ఎంటర్టైన్ మెంట్స్ 

నటీనటులు : సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి తదితరులు

సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్

ఎడిటింగ్ : నవీన్ నూలి 

సంగీతం : రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల 

నేపధ్య సంగీతం: థమన్ 

నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ 

రచన, దర్శకత్వం : విమల్ కృష్ణ 

విడుదల తేదీ : 12-02-2022

కృష్ణ హిస్ లీల తో హీరో గా యూత్ ని ఆకట్టుకున్న సిద్దు జొన్నలగడ్డతో టాలీవుడ్ లో మంచి పేరున్న నిర్మాణ సంస్థ చేతులు కలిపిందంటే అందరిలో ఖచ్చితంగా ఆసక్తి మొదలవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సిద్దు జొన్నలగడ్డ సినిమా అనగానే ఆడియన్సులోను - ట్రేడ్ లోను ఇంట్రెస్ట్ ఏర్పడింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో డీజే టిల్లు గా సిద్దమైన సిద్దు  ప్రమోషన్స్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసాడు. కాగా నేడు డీజే టిల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కనుక ఎంత ఎంటర్ టైన్ చేసాడో సమీక్షలో చూసేద్దాం.

కథ: ఇంట్లోవాళ్ళు పెట్టిన పేరు ఇష్టం లేని బాలగంగాధర్ తిలక్(సిద్దు జొన్నలగడ్డ) తన పేరు టిల్లు గా మార్చుకుని డీజే గా పాపులర్ అవుతాడు. దానితో డీజే టిల్లుగా మారిన అతనికి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే కల ఉంటుంది. దిల్ కుష్‌గా లైఫ్‌ను లీడ్ చేసే టిల్లుకు సింగర్ రాధికా(నేహా శెట్టి)తో  పరిచయం ముందు ఫ్రెండ్షిప్ గా ఆ తర్వాత ప్రేమ గా మారుతుంది. అయితే రాధికా ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. రాధికకి సహాయం చేయబోయి టిల్లు కూడా సమస్యల్లో పడతాడు. రాధిక ఎందుకు హత్య కేసులో ఇరుక్కుంటుంది? అసలు ఈ కేసు నుండి టిల్లు ఎలా బయటపడ్డాడు? చివరకు రాధిక, టిల్లు రిలేషన్ కొనసాగిస్తారా? అనేది మిగతా స్టోరీ.

పెరఫార్మెన్స్: టిల్లు పాత్ర గాని, సిద్దు టైమింగ్ గాని బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ మాంచి యూనిక్ గా అనిపిస్తాయి. సిద్దు డీజే టిల్లు గా అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చెప్పాలి. తెలంగాణ లాంగ్వేజ్ లో సిద్దు చెప్పే డైలాగ్స్ బావున్నాయి. సిద్దూ బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగినట్టు డ్రస్సింగ్ స్టయిల్, యాటిట్యూడ్ అన్ని బావున్నాయి. హీరోయిన్ నేహా శెట్టి బోల్డ్ సీన్స్ కూడా క్యాజువల్ గా చేసేసింది. సిద్దూతో తనకి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. మిగతా నటులు ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.  

విశ్లేషణ: దర్శకుడు విమల్ కృష్ణ డీజే టిల్లు అంటూ క్రైం నేపథ్యంలో ఉన్న కామెడీ కథని రాసుకున్నాడు. ఎంచుకున్న స్టోరీ లైన్ అద్భుతంగా లేకపోయినా.. దానిని ఎంటర్టైనింగ్ గా చూపించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. హీరో ఫేస్ లోని ఇన్నోసెన్స్, యాటిట్యూడ్, స్టయిల్, కామెడీ అన్ని కథకి మ్యాచ్ అయ్యాయి. మంచి ఎమోషనల్ పాయింట్‌తో బాల గంగాధర్ తిలక్ తండ్రి చెప్పే సంఘటనలతో కథ ఫన్ రైడింగ్‌గా స్టార్ట్ అవుతుంది. కామెడీ సీన్స్ తో, హీరో - హీరోయిన్ పరిచయం, హీరోయిన్ ని ప్రేమలో పడెయ్యాలనే తాపత్రయం, అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం వంటి సన్నివేశాలతో పాటు ఓ ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కి రాగానే కథలో వేగం తగ్గింది. రొటీన్‌గా మారుతుందనే ఫీలింగ్ కలిగే సరికి మళ్ళీ కథ ట్రాక్ లోకి వస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా రచయితగా  సిద్దూ జొన్నలగడ్డ రాసుకొన్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎమోషన్స్, కామెడీ సీన్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలానే ఉన్నాయని చెప్పాలి.

సాంకేతికంగా: శ్రీచరణ్ పాకాల - రామ్ మిరియాల పాటలు, తమన్ నేపధ్య సంగీతం డీజే టిల్లు కి స్పెషల్ ఎట్రాక్షన్. డీజే టిల్లు టైటిల్ సాంగ్ సినిమాకు ఆంథమ్‌‌గా మారింది. సాయిప్రకాశ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంది. రేసింగ్ సీన్లు, నైట్ ఎఫెక్ట్ సన్నివేశాలు సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. ఎడిటర్ నవీన్ నూలి ఫస్ట్ హాఫ్ విషయంలో పర్ఫెక్ట్ గా వర్క్ చేసినా.. సెకండ్ హాఫ్ విషయంలో తడబడ్డాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు మరింత ప్లస్ అయ్యాయి.

ఫినిషింగ్ టచ్ : నవ్వుల జల్లు... డీజే టిల్లు

రేటింగ్: 2.75/5

DJ Tillu Movie Telugu Review:

DJ Tillu Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs