Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : ఖిలాడి


సినీజోష్ రివ్యూ : ఖిలాడి

Advertisement
CJ Advs

బేనర్ : హవీష్ ప్రొడక్షన్స్

సమర్పణ : పెన్ స్టూడియోస్

నటీనటులు : రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి, అర్జున్, అనసూయ, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఉన్ని ముకుందన్, ముఖేష్ రిషి, అనూప్ సింగ్ తదితరులు

సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్, జి.కె.విష్ణు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాత : కోనేరు సత్యనారాయణ

రచన, దర్శకత్వం : రమేష్ వర్మ పెన్మెత్స

విడుదల తేదీ : 11-02-2022

క్రాక్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు రవితేజ. రాక్షసుడుతో ఫామ్ లోకి వచ్చాడు రమేష్ వర్మ. పుష్పతో ఊపుమీద వున్నాడు దేవి. మరీ ముగ్గురి కలయికలో నేడు విడుదలైన ఖిలాడి సినిమా ఎలా ఉండాలి..? ఎలా ఉంది..? ఈ త్రయం మరో హిట్టు మెట్టెక్కారా..? ఆ చిత్ర నిర్మాత సేఫ్ గా గట్టెక్కారా..? రివ్యూలో చూద్దాం.

కథ : హోమ్ మినిస్టర్ గా ఉన్న తన తండ్రిని చీఫ్ మినిస్టర్ చెయ్యాలని పదివేల కోట్లని  ఇండియాకి తరలిస్తాడు ఓ మాఫియాడాన్. ఆ డబ్బు ఇక్కడికైతే వస్తుంది కానీ అందాల్సిన వారికి అందకుండా మధ్యలోనే మాయం అవుతుంది. ఇక అక్కడ్నుంచీ మొదలవుతుంది ఆట, వేట. సైకాలజీ చదివే ఓ అమ్మాయి జైలులో ఉన్న ఒక ఖైదీని స్టడీ చేసే ప్రాసెస్ తో కథానాయకుడు మోహన్ గాంధీ పాత్ర తెరపైకి వస్తుంది. ఆడిటర్ గా కూల్ లైఫ్ లీడ్ చేస్తూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న మోహన్ గాంధీ జైలుకి ఎందుకు చేరాడు, ఎలా బయటికి వచ్చాడు అనే అంశాలతో ప్రథమార్ధం సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కి మంచి ట్విస్ట్ పడి సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆ సెకండాఫ్ లో పెట్టిన ఖర్చే తప్ప కథ, కథనాలపై కనిపించని పట్టు క్లయిమాక్స్ కోసం వెయిట్ చేసేలా వీక్షకులని విసిగిస్తుంది.

విశ్లేషణ : రవితేజ వంటి ఎనర్జిటిక్ హీరో ఉన్నాడు. అందాల విందుకి అస్సలు మొహమాటపడని హీరోయిన్లు ఉన్నారు. భారీ తారాగణం ఉంది, మాంచి టెక్నికల్ టీమ్ ఉంది. అన్నిటినీ మించి డబ్బుని నీళ్లప్రాయంలా వెచ్చించే నిర్మాత ఉన్నాడు. కానీ అవన్నీ వాడుకునే వాడి కలిగి ఉండి, ప్రేక్షకుల నాడి తెలిసి ఉండి ఇలాంటి హై బడ్జెట్ ప్రాజెక్టు చేసుంటే బాగుండేది. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే రిజల్ట్ నెక్స్ట్ రేంజ్ లో ఉండేది. కానీ మాస్ ఫైట్లు, మసాలా పాటలు, ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఇంకేదీ ఇంప్రెసివ్ గా లేని ఈ ఖిలాడి బాక్సాఫీస్ వద్ద బయట పడడం కష్టమే.!

నటీ నటులు : రవితేజ పాటల్లో ఉన్నంత ఉల్లాసంగా , ఫైట్స్ లో ఉన్నంత ఉత్సాహంగా సీన్స్ లో కనిపించ లేదు. హీరోయిన్స్ ఇద్దరూ స్కిన్ షోని మాత్రమే సీరియస్ గా తీసుకున్నారు. అర్జున్-అనసూయలవి వారికి అలవాటైన పాత్రలే. మురళీశర్మ, రావు రమేష్, ముకేశ్ ఋషి, వెన్నెల కిశోర్ లవి వారు అలవోకగా చేసేసే పాత్రలే. ప్రత్యేకంగా ప్రస్తావించే అభినయ ప్రదర్శనకి ఆస్కారం లేని కథ కావడంతో అందరు అలా అలా కానిచ్చేశారు.

సాంకేతిక నిపుణులు : విజువల్ గా సినిమా లావిష్ గానే ఉన్నప్పటికీ కెమెరామెన్ల పనితనంలో మార్పు క్లియర్ గా తెలిసిపోతోంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్, ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ కాస్త ఎక్కువగా కష్టపడ్డాయి. డైలాగ్స్ ఏదోకటి మాట్లాడాలిగా అన్నట్టు రాశారు. డాన్స్ మూమెంట్స్ మాస్ కోసమే అన్నట్టు చేసారు. దేవి మ్యూజిక్ లో స్పెషల్ మెరుపులేమీ లేవు. టైటిల్ సాంగ్ నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు అన్నీ తన పద్దతిలోనే పనైపోయింది అనిపించాడు దేవి. ఇక దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే తనకు దొరికిన గోల్డెన్ ఆపర్చ్యునిటీని యుటిలైజ్ చేసుకోవడంలో తడబడ్డాడనే చెప్పాలి. విజువలైజెషన్ లో చూపించిన చొరవ.. కథనాన్ని ఆసక్తిగా నడిపించడంలో కొరవడింది. బడ్జెట్ పెంచుకుంటే భారీ సినిమా మాత్రమే అవుతుంది.. సరైన సబ్జెక్ట్ ఎంచుకుంటే సాలిడ్ హిట్ సినిమా అవుతుంది. ఈ కనువిప్పు కలిగితే కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు.

ఫైనల్ రిపోర్ట్ : ఓ మోస్తరు ఓపెనింగ్సుతో మొదలైన ఈ ఖిలాడీకి మౌత్ టాక్ తో పాటు ఆంధ్రాలో ఇంకా పెరగని టికెట్ రేట్లు, కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూలు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ తో సగం సేఫ్ కాగలిగే ఈ సినిమాని రవితేజపై మోజుతో మాస్ ఆడియన్స్ కాస్తయినా మోస్తారేమో చూడాలి.

ఫినిషింగ్ టచ్ : కాస్ట్ లీ కిచిడి.... ఖిలాడి

సినీజోష్ రేటింగ్ : 2 /5

Khiladi Movie Telugu Review:

Khiladi Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs