Advertisement
Google Ads BL

సేనాపతి ఓటిటి రివ్యూ


సేనాపతి ఓటిటి రివ్యూ 

Advertisement
CJ Advs

బ్యానర్: గోల్డబోస్ ఎంటర్టైన్మెంట్స్ 

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, హర్షవర్ధన్, సత్య ప్రకాష్, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, జోష్ రవి, జీవన కుమార్ తదితరులు

మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్ 

ఎడిటింగ్:గౌతమ్ నెరుసు

నిర్మాత: సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్

డైరెక్టర్: పవన్ సాదినేని 

కరోనా కరోనా అంటూ కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి లో రిలీజ్ అవుతుంటే.. కొన్ని సినిమాలు ఓటిటిలోనే రిలీజ్ అయ్యేందుకు తెరకెక్కిస్తున్నారు. ఇక నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు కమెడియన్ గాను, హీరోగానూ, అలాగే కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను అందరి మన్ననలు పొందారు. ఫస్ట్ టైం ఓ ఓటిటి కోసం రాజేంద్ర ప్రసాద్ మంచి విలన్ అవతారం ఎత్తారు. ఆహా ఓటిటి కోసం సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లు నిర్మాతలుగా పవన్ సాదినేని దర్శకత్వంలో సేనాపతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వైవిధ్యమైన రోల్ లో నటించగా నరేష్ అగస్త్య హీరోగా నటించిన ఈ సినిమా ఆహా ఓటిటి నుండి నేడు డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సేనాపతి ప్రేక్షకులని ఎంతగా ఎంటర్టైన్ చేసిందో సమీక్షలో చూసేద్దాం.

కథ:

కృష్ణ( నరేష్ అగస్త్య) చిన్నప్పుడే చెయ్యని నేరానికి జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ చెప్పిన మంచి మాటలతో పెరణ పొంది పోలీస్ అవుతాడు. పోలీస్ గా ఛార్జ్ తీసుకున్న కృష్ణ కి ఎస్సై(సత్య ప్రకాష్) వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక ఓ రౌడీని తరుకుంటూ వెళ్లిన కృష్ణ తన పోలీస్ గన్ పారేసుకుంటాడు. ఆ గన్ పోవడంతో.. కృష్ణ సమస్యల్లో ఇరుక్కుంటాడు. పోలీస్ గన్ తో గుర్తుతెలియని వ్యక్తులు మూర్తి(రాజేంద్ర ప్రసాద్), జోష్ రవి బ్యాంకు రాబరీ చెయ్యడమే కాకుండా.. ఆ గన్ తో ఓ పసి ప్రాణాన్ని తీస్తారు. ఆ తర్వాత మూర్తి మరికొందరిని గన్ తో చంపడంతో.. గన్ వలన కృష్ణ పై అధికారులకి అడ్డంగా దొరిపోతాడు.. ఆతర్వాత కృష్ణ పై ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. మరి కృష్ణ తన గన్ కోసం ఎలాంటి సమస్యల్లో పడ్డాడు? అసలు మూర్తి కి బ్యాంకు రాబరీ చెయ్యాల్సిన అవసరం ఏమిటి? మూర్తి ఎందుకు పోలీస్ గన్ తో కొందరిని చంపాడు? అసలు మూర్తి రాజేంద్ర ప్రసాద్ ఫ్లాష్ బ్యాగ్ ఏమిటి? అనేది సేనాపతి కథ.

పెరఫార్మెన్స్: 

మూర్తిగా, జాబ్ పోయిన వ్యక్తిగా, కన్నవాళ్ళకే భారంగా మారిన ఓ తండ్రిగా, జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ కేరెక్టర్ సేనాపతిలో హైలెట్ అనేలా ఉంది. వైవిధ్యమైన నెగెటివ్ రోల్ అయినా రాజేంద్ర ప్రసాద్ పెరఫార్మెన్స్ పరంగా అదుర్స్ అనిపించారు. ఇక పోలీస్ వాడిగా నరేష్ అగస్త్య సీరియస్ మోడ్ లో తన పాత్రకి ప్రాణం పోసాడు. పోలీస్ ఆఫీసర్ గా హర్ష వర్ధన్, లంచాలు తీసుకునే అధికారిగా సత్య ప్రకాష్, జర్నలిస్ట్ గా జ్ఞానేశ్వరి కాండ్రేగుల వారి వారి పాత్రలకు న్యాయం చెయ్యగా మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు పవన్ సాధినేని.. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సేనాపతి కథని రాసుకున్నాడు. ఒక గన్ చుట్టూ నే కథ రాసుకుని.. దానిలో ట్విస్ట్ లు, ఫ్లాష్ బ్యాగ్ స్టోరీ అంటూ ఆసక్తిని రేకెత్తించాడు. టైటిల్ కార్డ్ నుండే తర్వాత ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని కలిగించాడు. హీరోలు మంచి తనం, సేవా గుణం తన జాబ్ పై ఉన్న డెడికేషన్ అన్ని బాగా మ్యాచ్ అయ్యేలా చూపించారు. రాజేంద్ర ప్రసాద్ ని బ్యాంకు రాబరీ చేసే వ్యక్తిగా చూపించడం, పోలీస్ గన్ తోనే పోలీస్ లని అపరుగులు పెట్టించడం అన్ని ట్విస్ట్ లతో సాగాయి. గన్ కోసం ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ తిరగడం, మధ్యలో హర్షవర్ధన్ ఇన్వెస్టిగేషన్ అన్ని ఆసక్తిని, ఉత్సుకతని రేకెత్తించాయి. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా సేనాపతి మలిచిన విధానం బావుంది. కాకపోతే సినిమా నిడివి ఇబ్బంది పెట్టింది. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కొద్దిగా రొటీన్ గా అనిపించినా.. రాజేంద్ర ప్రసాద్ పెరఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, కొన్ని ట్విస్ట్ లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక సేనాపతి ఆహా ఓటిటిలో చూస్తున్నంతసేపు.. అయ్యో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తే బావుండేది అనే ఫీల్ తో ప్రేక్షకులు సేనాపతిని వీక్షించారు అంటే.. దర్శకుడు ప్రేక్షకులని మంచి గ్రిప్ లో పెట్టాడని అర్ధమవుతుంది.

సాంకేతికంగా:

శ్రవణ్ భరద్వాజ్ నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. అలాగే వివేక్ కలుపు సినిమాటోగ్రఫి మెయిన్ హైలెట్ అనేలా ఉంది. ప్రతి ఫ్రేమ్ చాలా నేచురల్ గా చూపించారు. కాకపోతే ఎడిటింగ్ లో ఇంకాస్త షార్ప్ గా ఉండి ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్ అనేలా ఉంది. నిర్మాణ విలువలు కథానుసారం బావున్నాయి.

రేటింగ్: 2.75

Senapathi Movie Review:

Senapathi Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs