Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: అర్జున ఫల్గుణ


సినీజోష్ రివ్యూ: అర్జున ఫల్గుణ

Advertisement
CJ Advs

బ్యానర్: మాటినీ ఎంటర్టైన్మెంట్

నటీనటులు: శ్రీ విష్ణు, అమృత  అయ్యర్, శివాజీ రాజా, సీనియర్ నరేష్, సుబ్బా రాజు, మహేష్ ఆచంట, దేవి ప్రసాద్, చైతన్య గరికిపాటి మరియు ఇతరులు

సినిమాటోగ్రాఫర్: జగదీశ్ చీకటి

మ్యూజిక్ డైరెక్టర్: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం

ఎడిటర్: విప్లవ్ నైషధం

నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

దర్శకుడు: తేజ మార్ని

యాక్టర్ శ్రీ విష్ణు అనగానే అతను కొంచెం వైవిధ్యమయిన సినిమాలు చేస్తాడని అందరికి తెలుసు. అందుకే శ్రీ విష్ణు సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా కొత్తదనం ఏముందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. ఈసారి అతను అర్జున ఫల్గుణ అనే సినిమా టైటిల్ తో వచ్చాడు. అమృత అయ్యర్ హీరోయిన్ కాగా, తేజ మారని దర్శకుడు. సినిమా ఎలా ఉందొ సమీక్షలో చూద్దాం.

కథ:

ఈ కథ గోదావరి జిల్లాలోని ఒక ఊరిలో జరుగుతుంది. అర్జున (శ్రీ విష్ణు) ఆ ఊరిలో పాలు అమ్ముతూ ఉంటాడు. అర్జునకి నలుగురు స్నేహితులు, వాళ్ళ కోసం అర్జున ఏమైనా చెయ్యడానికి సిద్ధ పడుతూ ఉంటాడు. అందులో తాడి (మహేష్ ఆచంట) అనే స్నేహితుడు కష్టాలు తీర్చటానికి అర్జున ఒక చెయ్యకూడని పని చెయ్యడానికి సిద్ధపడతాడు. అరకు నుండి గంజాయి అక్రమంగా రవాణా చేసి ఒరిస్సా లోని ఒక గ్రామం లో వున్న కొందరి వ్యక్తులకి అప్పచెప్పాలి. అలా చెయ్యడానికి అర్జునాకి బాగా డబ్బు ఆశ చూపిస్తాడు ఒకరు. తన నలుగురు స్నేహితులతో కలసి అరకు ప్రయాణం చేసి, అక్కడ గంజాయి వున్న బస్తా తీసుకొని బయలుదేరతాడు. అయితే మార్గమధ్యంలో అర్జునాకి అతని ఫ్రెండ్స్ కిఒక పోలీస్ ఆఫీసర్ (సుబ్బరాజు) అడ్డు తగులుతాడు. అతని నుండి తప్పించుకొని అర్జున అతని స్నేహితులు ఆ గంజాయిని గమ్యానికి చేర్చారా? వాళ్ళకి కావలసిన డబ్బు వచ్చిందా? అర్జున అతని స్నేహితులు చివరికి ఏమయ్యారు? అన్నదే మిగతా కథ.

పెర్ఫార్మన్స్:

శ్రీ విష్ణు ఎటువంటి రోల్ లో అయినా ఇట్టే ఇమిడిపోతాడు, అలాగే ఈ సినిమాలో కూడా ఒక గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న కుర్రాడిలా బాగానే చేసాడు. కొంచెం గోదావరి యాస మాట్లాడించారు ఇందులో. తన వరకు తాను సిన్సియర్ గానే చేసాడు. మహేష్ ఆచంటకి ఈ సినిమాలో పెద్ద రోల్ దొరికింది, అతను బాగానే నటించాడు. అమృత అయ్యర్ హీరోయినిగా ఒక గ్రామం లో పెరిగిన అమ్మాయిగా చేసింది, కానీ ఆమె పాత్ర కి ప్రాధాన్యత లేదు. అలాగే శ్రీ విష్ణు స్నేహితులుగా నటించిన వాళ్ళు కూడా పరవాలేదు, బాగానే చేసారు. సీనియర్ నరేష్ ఇందులో చిన్న నెగటివ్ రోల్ చేసాడు. కానీ అందులో పెద్దగా ఏమి విషయం లేదు. ఇటువంటివి అతను చాలా చేసాడు. దర్శకుడు దేవి ప్రసాద్ నటుడు అయిన దగ్గర నుంచి బాగానే ఆఫర్స్ వస్తున్నాయి, ఇందులో కూడా మంచి రోల్ వచ్చింది. చాలా కలం తరువాత శివాజీ రాజా శ్రీ విష్ణు తండ్రిగా కనిపించాడు.

విశ్లేషణ

దర్శకుడు తేజ మారని కి ఇది రెండో సినిమా. ఇంతకు ముందు అతను జోహార్ అనే సినిమా చేసాడు. అది కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. అలానే ఈ అర్జున ఫల్గుణ ని కూడా వైవిధ్యం గా తీయాలి అనుకున్నాడు, కానీ విఫలం అయ్యాడు. కథలో అసలు పట్టులేదు. మొదలు పెట్టడం కొంచెం బాగానే మొదలు పెట్టిననా ఆ తరువాత కొంచెం సేపటికి, బాగా బోర్ కొట్టించాడు. స్నేహితులను వాళ్ళ మధ్య అనుబంధాన్ని చెప్పటం కోసం చాలా టైం తీసుకున్నాడు. అసలు విషయం ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఇవన్నీ కాకుండా సినిమాలో ఎమోషనల్ కంటెంట్ లేదు. ప్రేక్షకులు ఆ విషయం లో అస్సలు కనెక్ట్ కాలేరు. కథలో కూడా ఒక్కో సీన్ కి కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. అదీ కాకుండా కొన్ని సీన్స్ అయితే బాగా చెత్తగా కూడా తీశారు. దర్శకుడు ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు అన్నది ఎక్కడా అర్ధం కాదు. హీరో జూనియర్ ఎన్ టి ఆర్ ఫ్యాన్ అని చూపెట్టి దాన్ని మధ్యలో వదిలేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో వున్న గ్రామ వాలంటీర్స్, చీప్ లిక్కర్ అమ్మటం వంటివి పెట్టి చిన్న కామెడీ చేద్దాం అనుకున్నాడేమో కానీ, అదీ సరిగ్గా కుదరలేదు. అదీ కాకుండా కథకి వాటికీ అస్సలు సింక్ అవ్వలేదు. గంజాయి అక్రమ రవాణా అనే విషయం కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు దర్శకుడు. కానీ అరకు నుండి స్నేహితులు అందరు పోలిసుల నుండి తప్పించుకొనే సీన్స్ కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైన్ సీన్ మరీ సినిమాటిక్ గా వుంది. రైతుల సమస్యలు అని ఏదో అన్నాడు, అది కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు. మామూలుగా అయితే ఆ రైతు ఆత్మహత్యల నేపధ్యం లో ఆ వూరు యువకులు నలుగురు ఏమి చేద్దాం అనుకున్నారు, ఏమి చేసారు అన్న దాని మీద దర్శకుడు కొంచెం కథ అల్లితే బాగుండేది ఏమో. ఏమైనా కూడా అర్జున ఫల్గుణ అనే సినిమా మొత్తం ఒక ఫెయిల్యూర్ సినిమాగా చెప్పొచ్చు. సరి అయిన కథ లేనప్పుడు, నటీ నటులు ఎంత బాగా చేసిన కూడా ప్రయోజనం ఉండదు. దర్శకుడు అన్ని విభాగాల్లో మొత్తం విఫలం అయ్యాడనే చెప్పాలి.

సాంకేతికంగా

ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు కానీ అది అంతంత మాత్రంగానే వుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా. చీకటి జగదీష్ సినిమాటోగ్రఫీ కూడా అంత ఏమి గొప్పగా లేదు. మామూలుగా వుంది అంతే. ఎడిటింగ్ అయితే మాత్రం దారుణంగా వుంది. చాలా సీన్స్ ఇంకా ఎడిట్ చేసేయవచ్చు కూడా. కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ చేసారు అనిపించింది. గోదావరి యాసలో కొన్ని డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. కానీ ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్స్ మాత్రం సరిగ్గా రాయలేదు, అందుకే కనెక్ట్ కాలేదు.

ముగింపు

శ్రీ విష్ణు కొత్తదనం తన సినిమాల్లో చూపిస్తాడు అనుకునే వాళ్ళకి ఈ అర్జున ఫల్గుణ బాగా నిరాశ పరుస్తుంది. కథలో దమ్ము లేకపోవటం, కధనం కూడా మరీ చెత్తగా ఉండటం వల్ల ఈ సినిమాలో ప్రేక్షకులకి ఆకర్షించే అంశం ఒక్కటి కూడా లేదు. దర్శకుడు తేజ మార్నిశ్రీ విష్ణు లాంటి నటుడిని సరిగ్గా వినియోగిచుకోలేక పోవటం దురదృష్టకరం. ఈ సినిమా థియేటర్స్ లో చూడలేకపోయాం అన్న బాధ ఏమి అక్కరలేదు. ఎందుకంటే త్వరగానే ఈ సినిమా థియేటర్స్ నుండి ఆహా ఓ టి టి లో వచ్చేస్తుంది.

రేటింగ్: 1.5/5

Arjuna Phalguna Telugu Review:

Arjuna Phalguna Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs