నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ ఆర్.విహారి
సినిమాటోగ్రఫీ: పీసీ మౌళి
నిర్మాత: 88 రామారెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీ సరిపల్లి
RX100 మూవీ తో హిట్ కొట్టిన కార్తికేయ.. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా.. నాని గ్యాంగ్ లీడర్ మూవీ లో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. తమిళంలో స్టార్ హీరో అజిత్ వాలిమై సినిమాలో అజిత్ తో విలన్ గా తలపడబోతున్నాడు. తాజాగా కార్తికేయ శ్రీ సిరిపల్లి దర్శకత్వంలో.. మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ టైటిల్ తో రాజా విక్రమార్క మూవీ చేసాడు.. భారీ అంచనాల నడుమ మంచి ప్రమోషన్స్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా ట్రైలర్, టీజర్, సాంగ్స్ తోనే అంచనాలు, ఆసక్తి పెంచిన రాజా విక్రమార్క మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో.. అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
విక్రమ్ ఎన్ఐఏ లో కొత్తగా చేరిన ఆఫీసర్. కొత్త జాబ్ తో ఉత్సాహంతో ఉన్న విక్రమ్ కాస్త తొందర పాటు ఉన్న అబ్బాయి. అయితే ఒక రోజు ఎన్ఐఏ బృందం అక్రమంగా ఆయుధాలు అమ్ముతున్న ఓ నల్లజాతీయుడ్ని పట్టుకుంటుంది. అతని విచారణ సమయంలో విక్రమ్ తొందరపాటు వల్ల అతను హోమ్ మినిస్టర్ కి థ్రెడ్ ఉన్న విషయాన్ని సగం చెప్పి చనిపోతాడు. దానితో హోం మినిస్టర్ కేసులో దొరికిన కీలకమైన ఆధారం చేచేతులా జార విడచినట్టు అవుతుంది. అందుకే హోం మినిస్టర్‌ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత కూడా విక్రమ్‌పైనే పడుతుంది. హోమ్ మినిస్టర్ ని కాపాడడానికి ఎన్ఐఏ అధికారి (తనికెళ్ళ భరణి) విక్రమ్ తో కలిసి సీక్రెట్ ఆపరేషన్ చేపడతాడు. ఆ ఆపరేషన్ లో భాగంగా విక్రమ్ హోమ్ మినిస్టర్ కూతురు కాంతి(తాన్యా రవిచంద్రన్)ని ప్రేమలో పడేస్తాడు. మరి ఈ ఆపరేషన్ లో విక్రమ్ సక్సెస్ అయ్యాడా? హోంమంత్రిని కాపాడే క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? హోమ్ మంత్రి కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్)తో విక్రమ్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? అనే విషయం తెలియాలి అంటే.. రాజా విక్రమార్క చూడాల్సిందే.
పెరఫార్మెన్స్:
రాజా విక్రమార్క పాత్రలో ఎన్ఐఏ ఆఫీసర్ గా సిక్స్ ప్యాక్ లుక్ లో కార్తికేయ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. యాక్షన్ సన్నివేశాల్లో కార్తికేయ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. హోమ్ మంత్రి కూతురిగా కాంతి పాత్రలో జస్ట్ ఓకె అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో క్లాసికల్ డ్యాన్స్‌తో తాన్యా ఆకట్టుకుంటుంది. విలన్ గా సుధాకర్ కొమాకుల ఫర్వాలేదనిపించాడు. హోమ్ మినిస్టర్ గా సాయికుమార్, ఎన్ఐఏ అధికారిగా తనికెళ్లభరణి జస్ట్ ఓకె అనిపించారు. అంటే దర్శకుడు వాళ్ళ ఎక్సపీరియెన్స్ ని యూస్ చేసుకోలేకపోయాడు. ఎల్ఐసీ ఏజెంట్‌గా హర్షవర్ధన్ అక్కడక్కడా కామెడీ చేసే ప్రయత్నం చేశాడు.
విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్ ని పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే.. ఆ జోనర్ లో చాలా సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.. సస్పెన్స్ థ్రిల్లర్ ని లైక్ చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఉగ్రవాదులతో పోరాడుతూ.. టెర్రరిస్టులని మట్టుబెట్టే.. ఎన్ఐఏ కథలు చాలా వచ్చాయి.. ప్రేక్షకులని మెప్పించాయి. దర్శకుడు తీసుకున్న పాయింట్ పర్ఫెక్ట్ గా రీచ్ అయితే ప్రేక్షకులు ఆటోమాటిక్ గా హిట్ చేస్తారు.. అదే పాయింట్ అర్ధం కాకపోతే ప్రేక్షకులు తిరస్కరించడానికి ఎంతో టైం పట్టదు. మరి రాజా విక్రమార్క తో దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగానే ఉంది. కానీ దానిని ఎగ్జిక్యూట్ చెయ్యడంలో దర్శకుడు అడుగడుగునా తడబడ్డాడు. అంటే హోమ్ మినిస్టర్ కి థ్రెడ్ ఉంటే.. సీక్రెట్ ఆపరేషన్ ఏమిటో.. హోమ్ మినిస్టర్ ఇంటికి హీరో క్యాజువల్ గా వెళ్లిరావడం అనేవి అంత రుచించవు. మారణాయుధాలతో పట్టులబడిన ఓ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సగం వివరాలు బయటపెట్టిన తర్వాత హీరోగారి చేతిలో ఆ వ్యక్తి చనిపోవడంతో.. కథ మొదలవుతుంది.. ఆ తర్వాత కథ లో ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో.. మిగతా వివరాలకును హీరో ఎలా సేకరించాడో అంటూ ప్రేక్షకులు థ్రిల్ ఫీలయినా.. సినిమాలో అలాంటిదేం కనిపించలేదు. రొటీన్ సన్నివేశాలతో ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అవడంతో.. మళ్ళీ సెకండ్ హాఫ్ పై ఆసక్తి మొదలవుతుంది. కానీ ఆ థ్రిల్ ని మెయింటింగ్ చెయ్యడంలో దర్శకుడు తడబడ్డాడు.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వీక్ గా అనిపిస్తుంది. హోంమంత్రి కూతురి కోసం నారాయణను ఎన్ఐఏ బృందం విడిచి పెట్టాలనుకోవడం.. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఇటు మంత్రి, అటు నారాయణ చనిపోవడంతో కథకి ఎండ్ కార్డు పడింది అనుకుంటే.. అక్కడ నుండి సుధాకర్ కొమాకుల విలన్ గా ఎంట్రీ ఇవ్వడం మరింత గందరగోళంగా మారిపోయింది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అన్ని రోటీన్ రోడ్డ కొట్టుడు ఫార్ములాతోనే అనిపిస్తుంది తప్ప.. ఎక్కడా థ్రిల్ ని కలిగించలేదు.. సరికదా ప్రేక్షకుడికి అడుగడుగునా బోర్.. అన్నటుగా ఉంది ఈ రాజా విక్రమార్క.
సాంకేతికంగా:
ప్రశాంత్ ఆర్.విహారి మ్యూజిక్ లో పస కనిపించలేదు. ఉన్న రెండు పాటలు అంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే నేపథ్య సంగీతం కట్టుకునేలా ఉంది, పీసీ మౌళి సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. ఎడిటింగ్ వీక్.. కత్తిరించాల్సిన సన్నివేశాలు కోకొల్లలు. ఇక నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్: 2.25/5