Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: పెద్ద‌న్న‌


బ్యానర్: స‌న్ పిక్చ‌ర్స్‌

Advertisement
CJ Advs

న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, కీర్తిసురేష్‌, న‌య‌న‌తార‌, మీనా, ఖుష్బూ, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: వెట్రి

మ్యూజిక్ డైరెక్టర్: ఇమ్మాన్

ఎడిటింగ్: రూబెన్

నిర్మాత : క‌ళానిధి మార‌న్‌ (తెలుగు: డి.సురేష్‌బాబు, నారాయ‌ణ్‌దాస్ నారంగ్‌)

ద‌ర్శ‌క‌త్వం: శివ

            సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే.. అభిమానుల్లో ఓ క్రేజ్.. నిర్మాతలకి దేవుడు, దర్శకులకి డ్రీం హీరో. అలాంటి రజినీకాంత్ తో తెరకెక్కించే సినిమాలన్ని ఆయన హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ, కేవలం రజినీకాంత్ అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నారు తప్ప.. రజినీకాంత్ కోసం ప్రత్యేకంగా సినిమా చేసే దర్శకులే కనిపించడం లేదు. రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు స్కూల్స్ కి హాలిడేస్, ఆఫీస్ లకి సెలవు అనేంతగా ఉంటుంది.. ఆయన సినిమా రిలీజ్ సందడి. కానీ రజినీకాంత్ అభిమానుల అంచనాలు ఆయనతో సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకులు అందుకోలేకపోతున్నారు. అందుకే గత కొన్నేళ్లుగా రజినీకాంత్ కి హిట్ అన్నదే దక్కడం లేదు. ఆఖరికి మురుగదాస్ కూడా రజిని స్టయిల్లోనే హీరోయిజం హైలెట్ చేసి దర్భార్ చేసినా.. అదే లెక్క. తాజాగా యాక్షన్, కమర్షియల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రజినీకాంత్ అన్నాత్తే మూవీ చేసాడు. పోస్టర్స్, టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు రజిని అండ్ శివ లు. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో పెద్దన్నగా రిలీజ్ చేసారు. మరి పెద్దన్న తెలుగు ప్రేక్షకులకు ఏ మేర నచ్చిందో సమీక్షలో చూసేద్దాం.  

కథ:

రాజోలు కి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని గ్రామాల‌కు ప్రెసిడెంట్ వీర‌న్న (ర‌జ‌నీకాంత్‌). వీరన్నకి చెల్లెలు క‌న‌క‌మ‌హాల‌క్ష్మి (కీర్తిసురేష్‌) అంటే ప్రాణం. అన్నా చెల్లెళ్ళ మధ్యన విపరీతమైన అనుబంధం ఉంటుంది. చెల్లికి పెళ్లి చేసి పంపించాలనుకుంటాడు వీరన్న. అన్న చూసిన సంబంధమే చేసుకుంటాను అని కనకమహాలక్ష్మి అన్నకి మాటిస్తుంది. క‌న‌క మ‌హాల‌క్ష్మికి చుట్టు ప‌క్క‌లే దగ్గరలోనే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల‌ని అనుకుంటాడు. శ‌త్రువు నుండి మిత్రుడైన ప్ర‌కాశ్‌రాజ్ కొడుకుతో పెళ్లి నిశ్చ‌య‌మ‌వుతుంది. కనకమహాలక్ష్మి కూడా అన్న తెచ్చిన సంబంధం నచ్చుతుంది. కానీ పెళ్లి జరిగే సమయానికి కనకమహాలక్ష్మి లేచిపోతుంది. దానితో వీరన్న కుంగిపోతాడు. అన్నమాట జవదాటని కనకమహాలక్ష్మి పెళ్లి నుండి ఎందుకు తప్పించుకుంది. అన్నని కాదని కనకమహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? అసలు అన్నా చెల్లెలు కలుసుకుంటారా? అనేది పెద్దన్న స్టోరీ..

పెరఫార్మెన్స్:

ర‌జనీకాంత్ పెద్దన్నగా వ‌న్ మేన్ షో చేశారు. రజినీకాంత్ స్టైల్‌, ఆయ‌న మేనరిజమ్స్‌ ఎప్పటిలాగే సినిమాకి మెయిన్ హైలెట్. యాక్షన్ సీన్స్ లో ఎనర్జీగా కనిపించారు. టాప్ హీరోయిన్ అయ్యుండి.. కీర్తి రజినీకి చెల్లెలిగా చేసింది. అంటే ఆమె కేరెక్టర్ పై అభిమానులకి ఎన్నో అంచనాలుంటాయి. కానీ కీర్తిసురేష్ చెల్లెలి పాత్ర‌లో ప‌ర్వాలేద‌నిపిస్తుంది. న‌య‌న‌తార జస్ట్ గెస్ట్ పాత్రకి పనికొచ్చింది. మీనా, ఖుష్బూ కేరెక్టర్ ఓకె ఓకె.. విలన్స్ గా నటించిన ప్ర‌కాష్‌రాజ్‌, అభిమ‌న్యు సింగ్‌, జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లు తేలిపోయాయి. పవర్ ఫుల్ గా ఉండాల్సిన పాత్రలు పేలవంగా అనిపిస్తాయి. మిగతా వారు పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

అన్నా చెల్లి అనుబంధ కథలతో బోలెడన్ని సినిమాలు తెరకెక్కాయి. తమిళంలోనే అజిత్ వేదాళం, తెలుగు పవన్ కళ్యాణ్ అన్నవరం.. ఇలా చెల్లెలి కోసం అన్న త్యాగాలు, చెల్లి బాగు కోసం అన్న పడే  కష్టాలు.. ఇవేం ప్రేక్షకులకి కొత్తకాదు.. అలాంటిది మళ్ళీ అన్నా చెల్లెళ్ళ కథ అంటే.. అందులో ఎమన్నా కొత్త పాయింట్ తీసాడేమో డైరెక్టర్ శివ అనుకుంటే.. లేదు.. పాత కథే. పాత పద్దతే. అలాగే రజినీకాంత్ సినిమాలంటే.. ఈ మధ్యన కొత్తదనం లేకుండా పోతున్నాయి. యాక్షన్ డైరెక్టర్.. రజినిని కొత్తగా చూపించాడేమో అనుకుంటే.. అదీ లేదు. ఎప్పటిలాగే రజినీకాంత్ ఫాన్స్ కోసమే అన్నట్టుగా నాలుగు యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎంట్రీ సీన్స్ తప్పితే సినిమా లో ఇంకేం లేదు. ఇక తాను ఎంతగానో ప్రేమించే చెల్లెలి కోసం పెద్దన్న ఓ సంబంధం చూడడం, ఆమె పెళ్లి వరకు అన్నని నమ్మించి పారిపోవడం, ఆ తర్వాత ఆమె ఎక్కడో కష్టాలు పడుతుంటే.. అన్న కుంగిపోవడం, అంతా రొటీన్ రొటీన్ అంతే తప్ప కొత్తగా ఏం లేదు. ఇక పెద్దన్న ఫస్ట్ హాఫ్ అంతా విలెజ్ బ్యాక్డ్రాప్ లో సాగుతుంది.  ర‌జ‌నీ మార్క్ పంచ్ డైలాగులు, కొన్ని కామెడీ స‌న్నివేశాల‌తో అభిమానుల‌కి న‌చ్చేలాగే  స‌న్నివేశాలు సాగుతాయి. సెకండ్ హాఫ్ అంతా కొలకత్తా నేపధ్యలో సాగుతుంది. సెకండ్ హాఫ్ కూడా చ‌ప్ప‌గానే మొద‌ల‌వుతుంది. క‌ల‌క‌త్తాలో త‌న చెల్లెలి క‌న్నీటికి కార‌ణ‌మైన వ్య‌క్తుల‌పై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం, చెల్లెలికి అడుగ‌డుగునా ర‌క్ష‌ణగా నిలవ‌డ‌మే మిగిలిన క‌థంతా... అన్నట్టుగా ఉంది పెద్దన్న. ఇక సినిమాకి మెయిన్ హైలెట్ రజినీకాంత్. ఆయన స్టయిల్, మేనేరిజం అన్ని ఫాన్స్ కి బాగా నచ్చుతాయి. ఇక రజిని చాలా యాక్టీవ్ గా కనిపించారు. మైనస్ లు అంటే.. కథ, కథనం, శివ దర్శకత్వం, సెకండ్ హాఫ్, మ్యూజిక్ అబ్బో చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి.

సాంకేతికంగా..

ఇమ్మాన్ సంగీతం ఓకె ఓకె. నేపధ్య సంగీతమ్ మాత్రం హోరెత్తిపోయింది. వెట్రి కెమెరా ప‌నిత‌నం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. 

రేటింగ్ 1.75/5

Peddanna Movie Telugu Review:

Rajinikanth Peddanna Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs