Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: కొండ‌పొలం


బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Advertisement
CJ Advs

న‌టీన‌టులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, అంటోని, రచ్చ రవి త‌దిత‌రులు

మ్యూజిక్ డైరెక్టర్: ఎంఎం కీరవాణి

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్

ఎడిటింగ్: శ్రావన్ కటికనేని

నిర్మాత: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అందరి చూపు తిప్పుకున్న మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. తన రెండో సినిమానే క్రిష్ లాంటి గొప్ప దర్శకుడితో చేసాడు. విలువలకు ప్రాధాన్యతనిచ్చే దర్శకుడు క్రిష్ కమర్షియల్ హంగులకి దూరం అయినా .. ఆయన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. లాక్ డౌన్ టైం లో షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో దర్శకుడు క్రిష్ కొండపొలం అనే నవలని తీసుకుని ఓ సినిమా గా తెరకెక్కించాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా.. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ తో చాలా తక్కువ సమయంలో షూటింగ్ ని పూర్తి చేసేసిన క్రిష్.. ఈ సినిమాని నేడు భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్.. కొండపొలంతో ఎలాంటి హిట్ ని అందుకున్నాడో సమీక్షలో చూసేద్దాం.  

కథ:

ర‌వీంద్ర‌ (వైష్ణ‌వ్‌తేజ్‌) బాగా చదువుకున్న కుర్రాడు. రవీంద్ర గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువ‌కుడు. హైదరాబాద్ కి వెళ్లి నాలుగేళ్లు ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించినా ఉద్యోగం రాదు. ఎంత ట్రై చేసినా ఉద్యోగం రాక‌పోవ‌డంతో రవీంద్ర తిరిగి ఊరికి వెళ్ళిపోయి.. తండ్రి తో కలిసి గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌తాడు. అడవికి వెళ్లిన రవీంద్ర కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రవీంద్ర ఓబులమ్మ(రకుల్) ప్రేమలో ఎలా పడ్డాడు?  కొండపొలం వెళ్లిన రవి కి అడ‌వి ఏం నేర్పింది? కొండపోలం వెళ్లిన రవి యూపీఎస్సీలో ఐ.ఎఫ్‌.ఎస్‌కి ఎంపికయ్యేంత ఆత్మ‌విశ్వాసాన్ని ఎలా సంపాదించాడ‌నేది కొండపొలం మిగ‌తా కథ.

పెరఫార్మెన్స్:

మొదటి సినిమా ఉప్పెన తోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న వైష్ణ‌వ్‌తేజ్ కొండపొలం లో మ‌రోసారి తన పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. గొర్రెల కాప‌రుల కుటుంబానికి చెందిన యువ‌కుడిగా రవీంద్రనాధ్ కేరెక్టర్ లో ఒదిగిపోయాడు. పులితో చేసే యాక్షన్ సన్నివేశాలలోను వైష్ణవ్ తేజ్ చక్కగా నటించాడు. ఓబుల‌మ్మ‌గా డీ గ్లామర్ గా లంగా వోణి లతో ర‌కుల్ కూడా చాలా స‌హ‌జంగా న‌టించింది. సాయిచంద్‌, ర‌విప్ర‌కాశ్, కోట శ్రీనివాస‌రావు, మ‌హేశ్ లు పరిధిమేర ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ:

ఆత్మవిశ్వాసం లేని ఓ యువకుడు అడవి బాట పట్టాక.. అడవిలో తిరుగుతూ.. అడవిలోని క్రూరమైన జంతులవులతో పోరాడుతూ ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకున్నాడన్నదే ఈ కొండపొలం సినిమా. టాలీవుడ్ లో ఉన్న దర్శకులందరికీ కొండ‌పొలం న‌వ‌ల‌ని చ‌ద‌వ‌మ‌ని ఇస్తే.. అంద‌రూ సూప‌ర్‌.. బాగుంది.. అంటూ కితాబిస్తారేమో. క్రిష్ ఒక్క‌డే నేను సినిమాగా తీస్తా అన‌గ‌ల‌డు. అంత ధైర్యం క్రిష్ కి మాత్ర‌మే ఉంది.. ఇది కొండపొలం సినిమా చూసిన ఓ అభిమాని చెప్పిన మాట. కమర్షియల్ హంగులకి అవకాశం లేని కథ. గొర్రెల కాపరుల జీవితాన్ని చూపించే కథ ఈ కొండపొలం కథ. గొర్రెలను కాస్తూ అడవికి వెళ్లిన హీరో.. అక్కడ అధిగమించే సవాళ్లు, వాటిని సాల్వ్ చేసే విధానం ఆకట్టుకునేలా ఉన్నాయి. అడివిలోకి వెళ్లే కొద్దీ అడవి గొప్పదనం, దానిని కాపాడవలసిన బాధ్యత మనపై ఎంత ఉందొ చెప్పే ప్రయత్నం అభినందించదగ్గ విషయం. సినిమా మొదట్లో హీరో భయం భయం గా కనిపించినా అడవి వల్ల అతనికి దొరికిన ధైర్యం.. ఆ ధైర్యంతోనే పులితో చేసే పోరాటం ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో.. యాక్షన్ సన్నివేశాలు తేలిపోయాయి. ఇక హీరో - హీరోయిన్స్ లవ్ ట్రాక్ ఓకె ఓకె గా అనిపిస్తుంది.  ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేవు, స్లో నేరేషన్, హడావిడి లేదు.. అయినా కొండపొలం ఓ ఎక్సపెరిమెంటల్ మూవీ గా నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

కీర‌వాణి మ్యూజిక్ సినిమాకి హైలెట్ అనేలా ఉంది. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాలకి ప్రాణం పోశాయి. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. కానీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ నాసిర‌కంగా అనిపిస్తాయి. సాంగ్స్, డైలాగ్స్ సినిమాకి హైలెట్ అనేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. 

రేటింగ్: 2.5/5

Konda Polam Movie Telugu Review:

Konda Polam Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs