Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: రిపబ్లిక్‌


బ్యానర్: జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

Advertisement
CJ Advs

న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్, ఐశ్వర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, రమ్యకృష్ణ, రాహుల్ రామ‌కృష్ణ, పోసాని కృష్ణముర‌ళి తదితరులు

మ్యూజిక్:  మ‌ణిశ‌ర్మ

సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌ 

ఎడిటింగ్: కె.ఎల్‌.ప్రవీణ్

నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు

స్క్రీన్‌ప్లే: దేవ క‌ట్టా‌, కిర‌ణ్ జ‌య్‌కుమార్‌

క‌థ‌, మాట‌లు, ద‌ర్శక‌త్వం: దేవ్ క‌ట్టా

కరోనా సెకండ్ వేవ్ తర్వాత వరసగా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. గత వారం నాగ చైతన్య లవ్ స్టోరీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ వారం సాయి ధరమ్ తేజ్ - దేవా కట్టా కాంబోలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిపబ్లిక్ ప్రమోషన్స్ తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన టీం కి సాయి ధరమ్ రోడ్డు ప్రమాదం కాస్త టెంక్షన్ పెట్టింది. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు సాయి తేజ్ రిపబ్లిక్ ని ప్రమోట్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి గత వారం లవ్ స్టోరీ సక్సెస్ ని ఈ వారం సాయి తేజ్ రిపబ్లిక్ తో కొనసాగించాడో.. లేదో.. సమీక్షలో చూసేద్దాం.  

కథ:

అభిరామ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) చాలా తెలివితేటలు ఉన్న కుర్రాడు. చిన్నప్పటినుండి ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే వరకు నిద్రపోడు. మొదట్లో విదేశాల‌కి వెళ్లి చదువుకుని సెటిల్ అవ్వాలని ఉన్నా.. క‌లెక్ట‌ర్ (సుబ్బ‌రాజు)తో ఈగో క్లాష్ వ‌ల్ల‌ ఐఏఎస్ కావ‌డం కోసం స‌న్నద్ధమ‌వుతాడు. క‌లెక్ట‌ర్ అయ్యే క్రమంలో వ్య‌వ‌స్థ‌లో మార్పు అంత సుల‌భం కాద‌ని, ఉద్యోగులంతా ప్ర‌భుత్వానికి బానిస‌లే అనే నిజం తెలుసుకుంటాడు. ఆ తర్వాత అభిరామ్ తెలివితేలు నచ్చి అతనికి ప్రత్యేక అధికారాల‌తో ఏలూరు క‌లెక్టర్‌గా బాధ్యతలు అప్పజెబుతారు. అభిరాం కలెక్టర్ అయినవెంటనే తెల్లేరు స‌ర‌స్సు స‌మ‌స్యపై దృష్టిపెడ‌తాడు. కొన్నేళ్లుగా తెల్లేరుపై పెత్తనం చలాయిస్తూ అక్రమాల‌కు పాల్పడుతున్న రాజ‌కీయ నాయ‌కురాలు విశాఖ‌వాణి (ర‌మ్యకృష్ణ)తో అభిరామ్‌కి పోరాటం మొద‌ల‌వుతుంది. మరి ప్రభుత్వ అధికారం ఉన్నా.. వ్యవస్థకి లోబడి చేసే ఉద్యోగంతో అభిరామ్ రాజ‌కీయ నాయ‌కురాలు విశాఖ‌వాణి ని ఎలా ఎదుర్కున్నాడు?  కలెక్టర్ గా అభిరామ్ ముందు ఉన్న సమస్యలను ఎలా దాటుకుని వెళ్ళాడు?  తెల్లేరు విష‌యంలో జ‌రిగిన పోరాటంలో గెలుపెవ‌రిది? వ్యవ‌స్థని మార్చడం కోసం అభిరామ్ ఎలాంటి సాహసం చేసాడు? అనేది రిపబ్లిక్ మిగతా కథ. 

పెరఫార్మెన్స్:

సాయిధ‌ర‌మ్ తేజ్ అభిరామ్ గా, కలెక్టర్ పాత్రలో ఒదిగిపోయాడు. త‌న సిన్సియ‌ర్ ఎఫెక్ట్ పెట్టాడు. సాయి ధరమ్ డైలాగ్ డెలివరీ  డైలాగులు బావుంది. లుక్స్ పరంగా సాయి తేజ్ కలెక్టర్ గా ఒకే కానీ.. డాన్స్ ల విషయంలో సాయి తేజ్ బరువు బాగా ఇబ్బంది పెట్టింది. సాయి ధరమ్ కాస్త బరువు పెరిగినట్టుగా చాలా సీన్స్ లో కనిపించింది. హీరోయిన్ గా ఐశ్వ‌ర్య రాజేష్ చేసింది ఏం లేదు.. జస్ట్ ఓ ఆర్టిస్ట్ అనేలా ఉంది ఆమె కేరెక్టర్. రాజకీయనాయకురాలి పాత్రలో ర‌మ్యకృష్ణ హుందాత‌నం నిండిన విల‌నిజం చూపించింది. అయితే ఆ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్ గా కనెక్ట్ అవదు. జ‌గ‌ప‌తిబాబు పాత్ర ఆక‌ట్టుకుంటుంది. శ్రీకాంత్ అయ్యర్‌‌, రాహుల్ రామ‌కృష్ణ‌, సుబ్బరాజు త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. 

విశ్లేషణ:

పొలిటిక‌ల్ డ్రామాతో కూడిన ప్రభుత్వ వ్యవస్థల కథలు చాలానే సినిమాలుగా వచ్చాయి. దేవా కట్టా కూడా పాలిటిక్స్ ని మిక్స్ చేస్తూ ఓ ప్రభుత్వ అధికారి వ్యవస్థని ఎలా బాగు చేసాడు అనే నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్ గా రిపబ్లిక్ మూవీ ని తెరకెకెక్కించాడు. పొలిటిక‌ల్ డ్రామాతో కూడిన ఓ నిజాయ‌తీ ని చూపించే ప్రయత్నమే రిపబ్లిక్. ఓ యంగ్ కలెక్టర్ ద్వారా వ్యవస్థను ఎలా బాగుచెయ్యాలో కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో దేవా కట్టా చెప్పే ప్రయత్నం చేసాడు. సినిమా మొదలు పెట్టిన సీన్స్ కాస్త స్లో గా అనిపించినా.. హీరో ఐఏఎస్ అధికారి కావ‌డం నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా.. హీరో కలెక్టర్ అవడం, తెల్లేరు విష‌యంలో రైతుల ప‌క్షాన ఉంటూ హీరో పోరాటం చేసే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో అస‌లు డ్రామా మొద‌ల‌వుతుంది. వ్యవ‌స్థల‌న్నింటినీ తన కిందే పని చేయాలనుకునే రాజకీయనాయకురాలు విశాఖ‌వాణికీ, అభిరామ్‌కీ మ‌ధ్య డ్రామా, అభిరామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్‌ అనేలా ఉన్నాయి. కాకపోతే రమ్యకృష్ణ పాత్రని ఇంకాస్త పవర్ ఫుల్ గా చూపిస్తే బావుండేది అనిపించింది. అలాగే ఆమనీ లాంటి పెద్ద ఆర్టిస్ట్ కి కేవలం రెండే డైలాగ్స్ పెట్టడం, జగపతి బాబు ని చివరి వరకు వాడుకోకపోవడం.. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు కనిపిస్తాయి.  ద‌ర్శకుడు నిజాయ‌తీగా క‌థ‌ని చెప్పే ప్రయత్నం చేసిన.. ఎక్కడో లాజిక్ మిస్ అయిన ఫీలింగ్.

సాంకేతికంగా..

మ‌ణిశ‌ర్మ సంగీతం అద్భుతం అని చెప్పలేం కానీ.. ఓకె ఓకె. బ్యాగ్ రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. సుకుమార్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ద‌ర్శకుడు డైలాగ్స్, క‌థ, మేకింగ్ ప‌రంగా మెప్పించాడు. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. 

రేటింగ్: 3.0/5

Republic Movie Telugu Review:

Republic Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs