Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: లవ్‌స్టోరీ


బ్యానర్‌: అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌

Advertisement
CJ Advs

నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, దేవయాని, రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: పవన్‌కుమార్‌ సీహెచ్‌

సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి. కుమార్‌

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌

నిర్మాత: నారంగ్‌ దాస్‌ కె నారంగ్‌, పుష్కర్‌రామ్‌ మోహనరావు

దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల

 కరోనా సెకండ్ తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి భయపడుతున్నారు. అలాంటి టైం లో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చేలా ఆసక్తిని కలిగించారు లవ్ స్టోరీ మేకర్స్. నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ ఈ రోజు సెప్టెంబర్ 24 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. శేఖర్ కమ్ముల మేకింగ్, సాయి పల్లవి పెరఫార్మెన్స్, లవ్ స్టోరీ కి మేకర్స్ చేసిన ప్రమోషన్స్ అన్ని సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేసాయి. నాగ చైతన్య, సాయి పల్లవి ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలతో సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలతో భారీ టికెట్ బుకింగ్స్ జరిగాయి. మరి ప్రేక్షకులు అంతగా అంచనాలు పెట్టుకున్న లవ్ స్టోరీ థియేటర్స్ లో ఏమేర మెప్పించిందో సమీక్షలో చూసేద్దాం. 

కథ:

రేవంత్ (నాగ‌చైత‌న్య) మ‌ధ్య త‌ర‌గతి యువకుడు. బిజినెస్ ప్లాన్స్ చేసుకుంటూ హైద‌రాబాద్‌లో జుంబా సెంట‌ర్ న‌డుపుతుంటాడు. తనని, తన ఫ్యామిలీని ఆ ఊరిలోని అధిక కులం వారు వివక్ష చూపించడంతో.. రేవంత్ కి బాగా సంపాదించి.. సమాజంలో గౌరవంగా బ్రతకాలనే కలతో.. బిజినెస్ కోసం లోన్ కావాలంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతాడు. మరోపక్క బీటెక్ పూర్తి చేసి మౌనిక (సాయిప‌ల్ల‌వి) కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చెయ్యాలనే కలతో హైద‌రాబాద్‌ వస్తుంది. కానీ మౌనిక ఎంతగా ట్రై చేసినా ఆమెకి ఉద్యోగం దొర‌క‌దు. ఖాళీగా ఉంటున్న మౌనిక రేవంత్ జుంబా సెంట‌ర్‌లో డ్యాన్స‌ర్‌గా చేరుతుంది. ఆ క్రమంలో రేవంత్ - మౌనిక మధ్య ప్రేమ పుడుతుంది. మౌనిక ఓ ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. రేవంత్ - మౌనికల పెళ్లికి మరో అడ్డంకి కులం. కులాల అడ్డుగోడలు, అధిక - బీద అనే బేధాలను దాటి రేవంత్, మౌనిక కలిసి నడుస్తారా? మౌనిక‌కి త‌న ఇంట్లో ఉన్న స‌మ‌స్య ఏమిటి? అసలు రేవంత్ - మౌనికలు చివరికి పెళ్లి చేసుకుంటారా? అనేది లవ్ స్టోరీ మిగతా కథ. 

పెరఫార్మెన్స్:

రేవంత్ గా నాగ‌చైత‌న్య‌, మౌనిక గా సాయిప‌ల్ల‌వి ఈ సినిమాకి మెయిన్ హైలెట్. చైతు - సాయి పల్లవి పెరఫార్మెన్స్ పరంగా పోటీ పడ్డారు. రేవంత్‌, మౌనిక పాత్రల్లో ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాగ‌చైత‌న్య ఎక్సప్రెషన్స్, ఎమోషన్స్, నాగ చైతన్య తెలంగాణ భాషలోని యాస అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. చదువు పూర్తి చేసి జాబ్ చేస్తూ తన లక్ష్యాన్ని చేరుకోవాలనే త‌ప‌న ఉన్న అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి ఎప్పటిలాగే పెరఫార్మెన్స్ పరంగా అదరగొట్టేసింది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వచ్చిన డ్యాన్సులు ఆకట్టుకుంటాయి. నాగ చైతన్య అమ్మ గా ఈశ్వ‌రీరావు, రాజీవ్ క‌న‌కాల, దేవ‌యాని, ఉత్తేజ్ తమ పాత్రలకు న్యాయం చేసారు. 

విశ్లేషణ:

ఎప్పుడూ ప్రేమ కథలకు, యూత్ కథలకి ఇంపార్టెన్స్ ఇచ్చే శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం ఓ సున్నితమైన ప్రేమ కథని లవ్ స్టోరీ సినిమాగా మలిచాడు. ప్రస్తుతం మోడ్రెన్ యుగంలో బ్రతుకుతున్నా ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ఊర్లలో కులాల పట్టింపులు, ధనిక, పేద కులాల కట్టుబాట్లు.. ఇవన్నీ ఇంకా ఇంకా కనిపిస్తున్నాయి. పేదవాడు ధనిక అమ్మాయిని ప్రేమించకూడదు. అగ్రవర్ణం అబ్బాయిని పేద కులం అమ్మాయి ప్రేమించకూడదు. అనే పట్టింపులు నిత్యం చూస్తున్నాం. ఇలాంటి కులాలు, కట్టుబాట్ల నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీని తెరకెక్కించారు. అంతేకాకుండా బ‌య‌టికి చెప్ప‌డానికి, మాట్లాడుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని లైంగిక దాడుల గురించి ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ లో నాగ చైతన్య - సాయి పల్లవి కేరెక్టర్స్ చూస్తే నిజంగా పక్కింటి అబ్బాయి, అమ్మాయి అనిపించేలా కేరెక్టర్స్ డిజైన్ చేసారు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ కథ పరంగా కొత్తదనం లేకపోయినా సరే.. శేఖర్ అందమైన ప్రేమతో తో లవ్ స్టోరి ఆకట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత వీరి పెళ్లికి కులం రంగు పులమడంతో కథ ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో - హీరోయిన్ మధ్య గిల్లికజ్జాల నేపథ్యంలో వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ సెన్సిబిలిటీస్‌తో ఫస్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో అస‌లు ప్రేమ‌క‌థ మొద‌ల‌వుతుంది. రేవంత్‌, మౌనిక ప్రేమకి ఎదుర‌య్యే స‌వాళ్లు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. క‌థ క్లైమాక్స్ కి వెళ్లబోతుంది అనే సమయంలో కథలో సాగదీత ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. మౌనికకి త‌న ఇంట్లోనే ఎదురైన స‌మ‌స్య గురించి చెప్పే స‌న్నివేశాలు అంతగా ఆకట్టుకునేలా లేవు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి రొటీన్ ఫార్ములాలోనే  ప‌రువు - ప్రేమ నేప‌థ్యంలో సాగే సినిమాల్నే గుర్తు చేసాయి తప్ప కొత్తగా ఏమి కనిపించదు. 

సాంకేతికంగా:

ఈ సినిమాకి మెయిన్ హైలెట్ ప‌వ‌న్ సీహెచ్ మ్యూజిక్. సాంగ్స్ అన్ని వినాలనిపించేలా ఉన్నాయి. బయట బాగా సక్సెస్ అయిన సారంగ ద‌రియా సాంగ్ మాత్రం సినిమాలో ప‌ర్వాలేద‌పిస్తుందంతే. మరో మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. విజ‌య్ సి.కుమార్ కెమెరా ప్ర‌తీ స‌న్నివేశాన్నీ తెర‌పై స‌హ‌జంగా ఆవిష్క‌రించింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

రేటింగ్: 3.0/5

Love Story Movie Telugu Review:

Love Story Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs