Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: డియ‌ర్ మేఘ‌


న‌టీన‌టులు: మేఘా ఆకాష్‌, అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు, ప‌విత్ర లోకేష్ తదితరులు 

Advertisement
CJ Advs

మ్యూజిక్ డైరెక్టర్:హ‌రి గౌర

సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ

ప్రొడ్యూసర్: అర్జున్ దాస్య‌న్‌

ద‌ర్శ‌క‌త్వం: ఎ.సుశాంత్ రెడ్డి

క‌న్న‌డ‌ సూపర్ హిట్ దియా కి రీమేక్‌గా తెరకెక్కిన డియర్ మేఘ.. మొదటి నుండి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. క్యూట్ గర్ల్ మేఘ ఆకాష్ టైటిల్ రోల్ పోషించిన డియర్ మేఘాలో అరుణ్ అదిత్‌ హీరోగా నటించాడు. కరోనా సెకండ్ వేవ్ తగ్గి థియేటర్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో డియర్ మేఘని థియేటర్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేసింది మొదలు సినిమాపై అందరిలో అంచనాలు, ఆశక్తి పెరిగేలా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ మేఘ ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం. 

కథ:

కాలేజ్ లో చదివే రోజుల్లో మేఘ (మేఘా ఆకాష్‌) సీనియ‌ర్ అయిన అర్జున్ (అర్జున్ సోమ‌యాజులు)ని తెగ ప్రేమించేస్తుంది. త‌న ప్రేమని అర్జున్ కి చెప్పాలని చాలాసార్లు ట్రై చేస్తుంది. కానీ చెప్పలేకపోతుంది. ఈలోపు అర్జున్ స్టడీస్ కంప్లీట్ చేసుకుని సింగపూర్ వెళ్ళిపోతాడు. మూడేళ్లు మేఘ కి అర్జున్ కి ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు. కానీ మూడేళ్ల త‌ర్వాత అర్జున్ ముంబ‌యిలో మేఘ ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. అయితే కాలేజ్ లోనే తానూ కూడా మేఘ ని ఇష్టపడినట్లు చెప్పి షాకిస్తాడు. దానితో మేఘ - అర్జున్ లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టైం లో అర్జున్ ఓ ఆక్సిడెంట్ లో చనిపోతాడు. అర్జున్ దూరమవడం తట్టుకోలేని మేఘ కూడా చనిపోవాలని అనుకుంటుంది. అదే టైం లో మేఘ కి ఆది(అరుణ్ అదిత్) తో ఫ్రెండ్ షిప్ మొదలై జీవితంపై ఆశ కలిగేలా చేస్తుంది. మరి ఆది - మేఘ ల మధ్యన ప్రేమ పుడుతుందా? అసలు మేఘ అర్జున్ ని మరిచిపోయి ఆది ని లవ్ చేస్తుందా? ఆది - మేఘ - అర్జున్ ఈ స్టోరీ తెలియాలంటే డియర్ మేఘాని వెండితెర మీద వీక్షించాల్సిందే.

పెరఫార్మెన్స్:

డియర్ మేఘ టైటిల్ రోల్ పోషించిన మేఘ ఆకాష్ టైటిల్ కి తగిన న్యాయం చేసింది. మేఘ ఆకాష్ ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన నటన కనబర్చింది. మేఘ స్వరూప్ పాత్రకు ప్రాణం పోసింది. ఆద్యంతం ప్రేమను ఫీలయ్యే అమ్మాయిగా మెగా పెరఫార్మెన్స్ సూపర్. హీరో కేరెక్టర్ చేసిన అరుణ్ అదిత్  ఆది పాత్రలో ఒదిగిపోయాడు. అరుణ్ ఆదిత్ అండ్ మేఘ లు కథని తమ భుజాల మోశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. లవర్ బాయ్ గా అరుణ్ నటన సాధాసీదాగా అనిపిస్తుంది. అర్జున్ సోమయాజులు పాత్ర బావుంది. కానీ పెరఫార్మెన్స్ పరంగా తేలిపోయాడు. మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ:

కన్నడ దియా రీమేక్ డియర్ మేఘ ని కొత్తగా చూపించాలని దర్శకుడు ఏమాత్రం అనుకోలేదనేది.. దియా సినిమా చూసిన వారికి తెలిసిపోతుంది. మాతృకని చెడకొట్టకుండా డియర్ మేఘాని తెరకెక్కించాడు సుశాంత్ రెడ్డి. ఇక ముక్కోణపు ప్రేమ కథలు ప్రేక్షకులకు కొత్త కాదు. మాతృకని ఫాలో అయినప్పుడు అందులోని ఎమోషన్స్, ప్రేమ లోని ఫిలింగ్స్ మిస్ అవకుండా తెరకెక్కించడం కత్తి మీద సామే. అయినా దర్శకుడు తనవంతు ప్రయత్నం చేసాడు. సినిమా కథ మొత్తం మేఘ - అర్జున్ లేదంటే, మేఘ - ఆది మధ్యనే తిరుగుతుంది. మేఘ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిన సీన్ తో సినిమా మొదలవుతుంది. కాకపోతే మేఘ లాగే సినిమా కూడా స్లొగా సాగుతున్న ఫీలింగ్.  కాలేజీలో మేఘ స్వరూప్ అర్జున్ చూడకుండా ప్రేమించడం, దూరంగా ఉంటూనే అత‌న్ని ఆరాధిస్తుండ‌టం వంటి స‌న్నివేశాల‌తో ఫస్ట్ హాలాఫ్ అలా అలా సాగిపోతుంది. మేఘ - అర్జున్‌ల లవ్ ట్రాక్ లో ప్రేక్షకుడు ఎక్సపెక్ట్ చేసినంత ఫీల్ కనిపించదు. ఎప్పుడైతే ఆది మేఘ లైఫ్ లోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి స్క్రీన్ ప్లే పరిగెడుతుంది.  కానీ అది రాను రాను స్లో అనే ఫీలింగ్ తెప్పించింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లోనే ప్రేక్షకుడు కొంత సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తాడు తప్ప.. కథలో అనుకున్న ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే ప్రేక్షకుడు ఫీలవలేడు.  

సాంకేతికంగా:

హరిగౌర మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని డియర్ మేఘాకు మెయిన్ హైలెట్. నేపధ్య సంగీతం ప్రతి సీన్ కి ప్రాణం పెట్టినట్టు కనిపించింది. ఇక మరో హైలెట్ సినిమాటోగ్రఫీ. ఆండ్రూ కెమెరా చిత్రీకరించిన దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కథానుసారం ఫర్వాలేదనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5

Dear Megha Movie Telugu Review:

Dear Megha Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs